వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పౌరసత్వం కోసం చిన్నారి ‘నిగ్రిక్త’ నిరీక్షణ.. ఇంతకీ నిగ్రిక్త అంటే...

|
Google Oneindia TeluguNews

పౌరసత్వ సవరణ బిల్లుకు ఎగువసభ రాజ్యసభ ఆమోదం తెలుపడంతో దేశంలో ఉన్న శరణార్థులు సిటిజన్‌షిప్ కోసం ఎదురుచూస్తున్నారు. అందులో అప్పుడే జన్మించిన చిన్నారి కూడా ఉన్నారు. రాజ్యసభలో బిల్లు ప్రవేశపెట్టకముందే చిన్నారి జన్మించినా.. పేరెంట్స్ మాత్రం బిల్లు ఆమోదం పొందాకే పెట్టారు. అదీ కూడా 'నిగ్రిక్త' అని.. అంటే పౌరసత్వం అని అర్థం. పాప జన్మించడంతో తమకు సిటిజెన్‌షిప్ వస్తోందని ఆ కుటుంబం సంతోషంగా చెబుతుంది.

ఏడేళ్ల నుంచి..

ఏడేళ్ల నుంచి..

పాకిస్థాన్‌ నుంచి ఓ కుటుంబం ఏడేళ్ల భారత్ వచ్చింది. ఢిల్లీలోని మంజు కా తీలాలో నివసిస్తోంది. ఇక్కడేకాదు రోహిణి సెక్టార్ 9,11, ఆదర్శ్ నగర్, సిగ్నేచర్ బ్రిడ్జ్ వద్ద చాలా మంది గుడారాలు వేసుకొని జీవిస్తున్నారు. మరికొందరు షెట్టర్లు వేసుకొని అందులో ఉంటున్నారు. ఆ కుటుంబం మంజు కా తీలాలో ఉంటుంది. భారతదేశ పౌరసత్వం కోసం చేయని ప్రయత్నం కూడా లేదు.

సవరణలు

సవరణలు

పౌరసత్వ బిల్లుకు కేంద్ర ప్రభుత్వం సవరణలు చేసింది. ఇటీవల లోక్‌సభలో ఆమోదం పొందాక బుధవారం రాజ్యసభ ముందుకొచ్చింది. రాత్రి ఎగువసభలో కూడా ఆమోదం పొందింది. బిల్లు ఆమోదం పొందకముందే వివాహితకు చిన్నారి జన్మించారు. బిల్లు సభలో ఆమోదం పొందాక.. గురువారం ఉదయం వారు పేరు పెట్టారు. అదీ కూడా తాము ఎదురుచూస్తున్న పౌరసత్వం అర్థం వచ్చేలా నిగ్రిక్త అని పేరు పెట్టామని ఆమె నానమ్మ మీర దాస పేర్కొన్నారు.

 నిరీక్షణ..

నిరీక్షణ..

దేశంలో ఉంటున్న ప్రతీ ఒక్కరు పౌరసత్వం కోసం చూస్తారు. తమ ఇంట్లోకి వచ్చిన లక్ష్మీదేవితో సిటిజెన్ సిప్ వస్తోందని ఆశాభావం వ్యక్తం చేశారు. పౌరసత్వం కోసం ఇప్పటికే చాలా ఇబ్బందులు పడ్డామని ఆమె పేర్కొన్నారు. ఇకనైనా తమకు సిటిజెన్ ‌సిప్ ఇప్పించాలని కోరారు.

సందర్భాన్ని బట్టి

ఇప్పుడే కాదు ఆయా సందర్భాల్లో కూడా ఇదివరకు కొందరు పేర్లు పెట్టుకున్నారు. నామామి గంగే, గంగపుత్ర భిష్మ్, ఎన్డీఆర్ఎఫ్ సింగ్ అని పేర్లు పెట్టారు. 2016లో బీహార్‌లో వరదల వచ్చిన సందర్భంగా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది చాలామందిని కాపాడారు. దానికి గుర్తుగా ఎన్డీఆర్ఎఫ్ సింగ్ అనే పేరు పెట్టుకున్నారు.

English summary
Hindu refugee family from Pakistan has waited to get Indian citizenship.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X