వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హిందువులపై ముస్లింల చిత్రహింసలు: తస్లీమా(ఫొటో)

|
Google Oneindia TeluguNews

ఢాకా: బంగ్లాదేశ్‌లో మైనార్టీలుగా ఉన్న హిందువులపై అక్కడి ముస్లింలు చిత్రహింసలకు పాల్పడుతున్నారని ఆ దేశ ప్రముఖ రచయిత తస్లీమా నస్రీన్ చెప్పారు. ట్విట్టర్ వేదికగా ఆమె బంగ్లా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ప్రభుత్వం హిందువుల రక్షణకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు.

అక్టోబర్ 28న ఫెని జిల్లాలో లక్ష్మీ పూజ సందర్భంగా హిందువులు బాణాసంచా కాల్చడంతో ఏర్పడిన వివాదంలో ముస్లిం యువకులు హిందువులపై దాడికి దిగారని, ఆ దాడిలో 9మందికి తీవ్ర గాయాలయ్యాయని తెలిపారు. అందులో ఓ గర్భిణీ కూడా ఉందని చెప్పారు.

ముస్లింల దాడిలో గాయపడిన ఆ గర్భిణి గర్భంలోని ఇద్దరు శిశువులు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. ముస్లింల దాడిలో తీవ్రంగా గాయపడిన కారణంగా తులసీ రాణి అనే ఆ గర్భిణి ఇద్దరు మరణించిన శిశువులకు జన్మనిచ్చిందని ట్విట్టర్ ఆ ఫొటోను పోస్ట్ చేశారు తస్లీమా.

Hindus are tortured by Muslims in Bangladesh, govt is not protecting them, says Taslima Nasreen

కాగా, దాడికి పాల్పడిన నిందితులు అలీంగిర్ హోస్సేన్ బాబు(18), జహంగీర్ అలాం(20), జకీర్ హోస్సేన్(20), ఖాజీ నూర్ హోస్సేన్(20), సద్దాం హోస్సేన్ బాబు(18), అమీర్ హోస్సేన్(38), రియాజ్ ఉద్దీన్, జహంగీర్ అలాం సుమన్‌లను మథియారా గ్రామంలో గత శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేసినట్లు బిడిన్యూస్24.కాం ప్రచురితం చేసిన తన కథనంలో పేర్కొంది.

ఐదు రోజుల కస్టడీ కోసం దాఖలైన పిటిషన్‌ను నవంబర్ 22న స్థానిక కోర్టు విచారించనుంది. కాగా, బంగ్లాదేశ్‌కు స్వాతంత్ర్యం సిద్ధించిన 40ఏళ్ల నుంచి ఆ దేశంలోని హిందువులు దాడులకు గురవుతూనే ఉన్నారు.

అంటీ లిబరేషన్ దళాలు నుంచి దాడులు, వేధింపులను ఎదుర్కొంటూనే ఉన్నారు. అక్కడి ప్రభుత్వాలు హిందువులకు దాడుల నుంచి రక్షణ కల్పించడంలో విఫలమవుతూనే ఉన్నాయని తస్లీమా ఆగ్రహం వ్యక్తం చేశారు.

English summary
In the backdrop of recent atrocity carried out by Muslim youth against Hindus (minority) in Bangladesh, noted writer Taslima Nasreen has said that the government is not doing anything to protect them.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X