• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఆ కరోనా వ్యాక్సిన్ తో హెచ్ఐవీ యాంటీ బాడీస్ .. మొదటి దశలోనే ఆపేసిన క్లినికల్ ట్రయల్స్

|

కరోనా మహమ్మారి నుండి బయటపడడం కోసం కరోనా వ్యాక్సిన్ ను అభివృద్ధి చేస్తూ ప్రపంచవ్యాప్తంగా పలు సంస్థలు వ్యాక్సిన్ తయారీలో నిమగ్నమయ్యాయి. ఇదే క్రమంలో ఆస్ట్రేలియాకు చెందిన క్వీన్స్ ల్యాండ్ యూనివర్సిటీ , సీఎస్ఎల్ ఔషధ సంస్థలు కలిసి సంయుక్తంగా కరోనా వ్యాక్సిన్ తయారు చేస్తున్నాయి . అయితే ఈ సంస్థ తయారు చేసిన టీకా తొలిదశ ప్రయోగాల్లో షాకింగ్ ఫలితాలు వచ్చాయి .

  COVID-19 Vaccine : India Prepares For 60 Crore COVID-19 Vaccines, To Use Standard Cold Storage

  తొలి దశ ట్రయల్స్‌లో పాల్గొన్న పలువురు వ్యాక్సిన్ డోస్ తీసుకున్న తరువాత వారికి హెచ్‌ఐవి యాంటీ బాడీస్ వచ్చినట్లుగా తేలింది. దీంతో ఆస్ట్రేలియా శుక్రవారం నాడు కోవిడ్-19 వ్యాక్సిన్ యొక్క అభివృద్ధిని నిలిపివేసింది.

  కరోనా హై రిస్క్ ఉంటే డైపర్లు వాడాలని చైనా సూచన..అయితే వారికి మాత్రమే!!

  క్వీన్స్ ల్యాండ్ విశ్వవిద్యాలయం ,యుక్యూ అభివృద్ధి చేస్తున్న వి 451 కోవిడ్ -19 వ్యాక్సిన్

  క్వీన్స్ ల్యాండ్ విశ్వవిద్యాలయం ,యుక్యూ అభివృద్ధి చేస్తున్న వి 451 కోవిడ్ -19 వ్యాక్సిన్

  బయోటెక్ కంపెనీ సిఎస్‌ఎల్ సహకారంతో క్వీన్స్ ల్యాండ్ విశ్వవిద్యాలయం (యుక్యూ) అభివృద్ధి చేస్తున్న వి 451 కోవిడ్ -19 వ్యాక్సిన్ యొక్క ఫేజ్ 1 ట్రయల్‌లో పాల్గొన్న 216 మందిలో తీవ్రమైన ప్రతికూల ప్రభావాలు కానీ భద్రతా సమస్యలు కానీ ఏవీ నివేదించబడలేదని ఒక ప్రకటనలో తెలిపింది. అయినప్పటికీ కొంతమంది రోగుల్లో హెచ్ఐవి యాంటీ బాడీస్ వృద్ధి చెందటం నిపుణులు గుర్తించారు. అయితే ఇదేమీ పెద్ద సమస్య కాదని, ఆ తర్వాతి కాలంలో వారిలో హెచ్ఐవి యాంటీ బాడీస్ క్రమంగా తగ్గాయని కూడా వచ్చిందని చెప్తున్నారు. అయినప్పటికీ

  ఆస్ట్రేలియా ప్రభుత్వంతో సంప్రదించిన తరువాత, యుక్యూ మరియు సిఎస్ఎల్ టీకా రెండవ దశ, మూడవ దశ క్లినికల్ ట్రయల్స్ ను నిర్వహించకూడదని నిర్ణయించాయి.

  ఆస్ట్రేలియా దేశంలో కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్న టీకాలలో వి 451 ఒకటి

  ఆస్ట్రేలియా దేశంలో కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్న టీకాలలో వి 451 ఒకటి

  ఆస్ట్రేలియా దేశంలో కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్న టీకాలలో ఈ వ్యాక్సిన్ ఒకటి . ఈ టీకా కోసం 51 మిలియన్ మోతాదుల ప్రయోగాత్మక వ్యాక్సిన్‌ను పొందటానికి ఒప్పందాలు జరిగాయి. క్వీన్స్లాండ్ విశ్వవిద్యాలయం ఆరోగ్యకరమైన వాలంటీర్లలో దాని భద్రత మరియు రోగనిరోధక శక్తిని అంచనా వేయడానికి జూలై 2020 లో వీ451 యొక్క మొదటి దశ క్లినికల్ ట్రయల్స్ ను ప్రారంభించింది. తయారీ సంస్థ ఈ వ్యాక్సిన్ కరోనావైరస్ పట్ల బలమైన ప్రభావాన్ని కనబరుస్తుందని మరియు బలమైన భద్రతా ప్రొఫైల్‌ను కలిగి ఉందని తెలిపింది.

  టీకా తొలి దశ ట్రయల్స్ వాలంటీర్స్ కు హెచ్ఐవీ యాంటీ బాడీస్

  టీకా తొలి దశ ట్రయల్స్ వాలంటీర్స్ కు హెచ్ఐవీ యాంటీ బాడీస్

  ఏదేమైనా, ఈ టీకా యొక్క మొదటి దశ పనితీరుకు అనుగుణంగా ఆరోగ్య సంరక్షణలో హెచ్ఐవి పరీక్షా విధానాలలో గణనీయమైన మార్పులు చేయవలసి ఉంటుందని ఒక ప్రకటనలో తెలిపింది. తయారీదారులు వ్యాక్సిన్ అభివృద్ధి ప్రయత్నాలను నిలిపివేసి ప్పటికీ, హెచ్ఐవి యాంటీ బాడీలు అభివృద్ధి చెందిన , వ్యాక్సిన్ తీసుకున్న వాలంటీర్స్ శరీరంలో ఎంతకాలం హెచ్ఐ వీ యాంటీ బాడీస్ ఎంత కాలం ఉంటాయో అంచనా వేయడానికి ట్రయల్ కొనసాగుతుందని విశ్వవిద్యాలయం తెలిపింది . టీకా తీసుకున్న వారికి గతంలో హెచ్ఐవీ పాజిటివ్ లేదని టీకా తీసుకున్న తర్వాత వారిలో యాంటీ బాడీస్ డెవెలప్ అయ్యాయని నిర్ధారణ అయ్యిందని చెప్తున్నారు .

  మళ్ళీ హెచ్ఐవీ యాంటీ బాడీస్ తగ్గాయన్న శాస్త్రవేత్తలు .. అయినా సరే టీకా ప్రయోగాలు నిలుపుదల

  మళ్ళీ హెచ్ఐవీ యాంటీ బాడీస్ తగ్గాయన్న శాస్త్రవేత్తలు .. అయినా సరే టీకా ప్రయోగాలు నిలుపుదల

  ఇప్పటివరకు చేసిన అధ్యయనాలు హెచ్ఐవి యాంటీ బాడీస్ స్థాయిలు పడిపోతున్నాయని , చాలా మందిలో సాధారంగా మారాయని చెప్తున్నారు.

  యుక్యూ వ్యాక్సిన్ కో-లీడ్, ప్రొఫెసర్ పాల్ యంగ్ మాట్లాడుతూ, టీకాను తిరిగి అభివృద్ధి చేయడం సాధ్యమే అయినప్పటికీ, బృందానికి అవసరమైన మౌలిక సదుపాయాలు లేవని పేర్కొన్నారు. మళ్ళీ అభివృద్ధి ప్రారంభిస్తే మరో 12 లేదా అంతకంటే ఎక్కువ నెలలు సమయం పట్టే అవకాశం ఉందని చెప్పారు. ఏది ఏమైనా ఆస్ట్రేలియా దేశం కరోనాని అంతమొందించే వ్యాక్సిన్ వస్తుందని ఆశగా ఎదురు చూస్తున్న వేళ ప్రతికూల ఫలితాలతో వి451 మొదటి దశలోనే ఆగిపోయింది.

  English summary
  Australia on Friday stopped the further development of a COVID-19 vaccine candidate as several participants in the early-stage trials generated antibodies for HIV after receiving the potential therapeutic. There were no serious adverse events or safety concerns reported in the 216 participants of the phase 1 trial of the v451 COVID-19 vaccine candidate being developed by the University of Queensland (UQ) in collaboration with biotech company CSL, according to a statement.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X