వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హాంకాంగ్ ఎయిర్‌పోర్ట్ క్లోజ్.. వందల సంఖ్యలో విమానాలు రద్దు..!

|
Google Oneindia TeluguNews

హాంకాంగ్‌ : హాంకాంగ్ ఎయిర్‌పోర్టు మూతపడింది. సోమవారం నాడు ప్రజాస్వామ్య వాదులు నిరసన ఉధృతం చేయడంతో విమానాశ్రయం మూసివేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. దాంతో వందలాది విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. ఇక్కడ పరిస్థితులు బాగా లేనందున.. ప్రయాణీకులకు సౌకర్యాలు కల్పించలేమంటూ ఎయిర్‌పోర్ట్ సిబ్బంది చేతులెత్తేశారు.

అయితే సోమవారం నాటికి చెక్ ఇన్ పూర్తయిన విమానాలకు మినహాయింపు ఇచ్చారు. అదే సమయంలో హాంకాంగ్ నుంచి వెళ్లే విమానాలకు గానీ.. అక్కడకు చేరుకునే విమానాలకు గానీ ఛాన్స్ లేదని స్పష్టం చేశారు. హాంకాంగ్‌లో చైనా జోక్యాన్ని వ్యతిరేకిస్తూ అక్కడి ప్రొ-డెమోక్రసీ సభ్యులు గత కొన్ని రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. అదలావుంటే ఆ నిరసనల పర్వం సోమవారం నాడు షేర్‌ మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపడంతో నష్టాలను చవి చూడాల్సి వచ్చింది.

Hong Kong airport shutdown due to huge protest

అమ్మకు అన్యాయం.. ఆస్తి గుంజుకుని.. చివరకు..!

ఆందోళనలు పీక్ స్టేజీకి చేరిన క్రమంలో పోలీసులు లాఠీలు ఝలిపించారు. ఆ క్రమంలో పోలీస్ హింసను నిరసిస్తూ ప్రజాస్వామ్య వాదులు నిరసనను మరింత ఉధృతం చేశారు. సోమవారం నాడు ఏకంగా ఐదు వేల మంది ఉద్యమకారులు హాంకాంగ్ ఎయిర్‌పోర్టును నిర్భందించారు. పోలీసుల తీరును విమర్శించడమే గాకుండా.. హాంకాంగ్‌ భద్రతకు ముప్పు వాటిల్లనుందనే ప్లకార్డులతో నిరసనకు దిగారు. దాంతో అక్కడి అధికారులు విమానాశ్రయం మూసివేస్తున్నట్లు ప్రకటించారు.

ఎయిర్‌పోర్టు క్లోజ్ చేయడంతో అన్ని సేవలు రద్దయినట్లు తెలిపారు. విమానాశ్రయానికి ప్రయాణీకులు రావొద్దని కోరారు. హాంకాంగ్‌ పాలనలో చైనా జోక్యాన్ని, ఆధిపత్యాన్ని నిరసిస్తూ పది వారాలుగా ఉద్యమకారులు ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. అదలావుంటే నిరసనకారులకు టెర్రరిస్టులతో సంబంధాలున్నాయని చైనా కామెంట్లు చేయడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఉద్యమకారులు పదేపదే ఇక్కడి పోలీస్ అధికారులపై దాడులు చేయడం చూస్తుంటే టెర్రరిస్ట్ మూలాలు కనిపస్తున్నాయనే విధంగా మాట్లాడారు హాంకాంగ్‌ వ్యవహారాల కార్యాలయ ప్రతినిధి యాంగ్‌ జుయాంగ్‌.

English summary
Authorities in Hong Kong have canceled hundreds of flights this week because of major protests at the city's international airport. That's terrible news for companies operating in the financial hub. The decision to cancel all departures and inbound flights not already in the air on Monday afternoon was made after thousands of pro-democracy protestors gathered at the airport, the region's third busiest after Beijing and Tokyo. The disruption ran into a second day Tuesday when all outbound flights were canceled late afternoon because of a large protest at the airport.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X