వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వామ్మో.. మనిషి నుంచి శునాకినికి కరోనా వైరస్ రక్కసి..? ఎక్కడో తెలుసా..?

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఇప్పటికే 3 వేలకు పైగా మంది చనిపోగా.. 86 వేల మందికి వైరస్ సోకింది. చైనాలోని వుహాన్‌లో వైరస్ వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ప్రజల నుంచి ప్రజలకు వైరస్ సోకుతోంది. కానీ హాంకాంగ్‌లో మాత్రం ఓ మనిషి నుంచి కుక్క వైరస్ సోకబోతోంది. ఆ శునకం ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉంది.

శునకానికి కరోనా వైరస్ పాజిటివ్ అని హాంకాంగ్ వ్యవసాయం, మత్స్య పరిరక్షణ విభాగం పేర్కొన్నది. ఆ శునకాన్ని నిశీతంగా పరిశీలిస్తున్నామని తెలిపింది. ఆ కుక్కకు వైరస్ సోకకుంటే.. తిరిగి యాజమానికి అప్పగిస్తామని తెలిపారు. అయితే పెంపుడు జంతువులకు వైరస్ సోకినట్టు ఎలాంటి ఆధారాలు లభించలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలుపడం విశేషం.

Hong Kong coronavirus patients dog could be first human-to-animal transmission

దీనిపై యాజమానులు ఆందోళన చెందొద్దని ప్రతినిధులు సూచించారు. అయితే తమ పెంపుడు జంతువులను వదిలిపెట్టొద్దని జంతు ఆరోగ్య నిపుణులు తెలిపారు. ఆ శునకానికి వైరస్ సోకిందో లేతో నిర్ధారించడానికి మరిన్ని పరీక్షలు చేయాల్సి ఉంది అని పశువైద్యులు ఒక ప్రకటనలో తెలిపారు. హాంకాంగ్‌లో 103 కరోనా వైరస్ కేసులు నమోదు కాగా.. ఇద్దరు చనిపోయారు. జనం రద్దీగా ఉండే షాపింగ్ మాల్స్, రెస్టారెంట్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి.

English summary
Animal health experts said on Wednesday the quarantined dog of a coronavirus patient in Hong Kong could be the first case of human-to-animal transmission.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X