వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మీడియా మొఘల్ అరెస్ట్: జాతీయ భద్రతా చట్టం ప్రయోగం: చైనా ఊహించిన దాని కంటే దుందుడుకుగా

|
Google Oneindia TeluguNews

బీజింగ్: చైనా.. ఊహించిన దానికంటే దుందుడుకు చర్యలకు పూనుకుంటోంది. తాను అనుసరిస్తోన్న జాతీయ భద్రతా చట్టాన్ని హాంకాంగ్‌పై ప్రయోగించిన కొద్దిరోజుల్లోనే అరెస్టులకు దిగుతోంది. హాంకాంగ్ మీడియా మొఘల్‌గా గుర్తింపు పొందిన జిమ్మీ లై, ఆయన కుమారుడిని అరెస్టు చేసింది. జాతీయ భద్రతా చట్టాన్ని వారి మీద ప్రయోగించింది. చైనాలో విలీనం కావడం వల్ల స్వేచ్ఛను కోల్పోతామంటూ హాంకాంగ్ వాసులు ఇదివరకు వ్యక్తం చేసిన అనుమానాలు, నిర్వహించిన ఆందోళనలు నిజం అయ్యేలా చైనా వ్యవహరిస్తోందనే ఆరోపణలు వ్యక్తమౌతున్నాయి.

జిమ్మీ లై.. హాంకాంగ్‌కు చెందిన నెక్స్ట్ డిజిటల్ మీడియా గ్రూప్ అధినేత. సామాజిక కార్యకర్తగా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు. విదేశీ శక్తులకు ఆయన కుమ్మక్కు అయ్యారనే ఆరోపణల మీద పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. జిమ్మీతో పాటు ఆయన కుమారుడు మార్క్ సైమన్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు. బీజింగ్ నుంచి వెలువడుతోన్న ప్రొ డెమోక్రసీ న్యూస్ అవుట్‌లెట్ యాపిల్ డెయిలీ గ్రూప్‌కు చెందిన మీడియా హౌస్ ఇది. 1995లో జిమ్మీ లై దీన్ని నెలకొల్పారు.

Hong Kong: Next Media house Chief Jimmy Lai arrested under national security law in

సోమవారం ఉదయం సుమారు 200 మంది పోలీసులు నెక్స్ట్ మీడియా హౌస్ కార్యాలయానికి చేరుకున్నారు. జిమ్మీ, ఆయన కుమారుడిని అరెస్టు చేశారు. తమ సెల్‌ఫోన్ల ద్వారా వీడియోలను తీయడానికి ప్రయత్నించిన కొందరు జర్నలిస్టులను హెచ్చరించారు. గుర్తింపు కార్డులను చూపాలంటూ దురుసగా ప్రవర్తించారు. అనంతరం హాంకాంగ్ పోలీసులు ఓ ప్రకటన విడుదల చేశారు. 23 నుంచి 72 సంవత్సరాల మధ్య ఉన్న సుమారు తొమ్మిదిమందిని అరెస్టు చేసినట్లు తెలిపారు. జాతీయ భద్రతా చట్టం నిబంధనలను ఉల్లంఘించి కారణంగా వారిని అదుపులోకి తీసుకున్నట్లు స్పష్టం చేశారు.

హాంకాంగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ క్యారీ లామ్, హాంకాంగ్‌లోని చైనా రాయబారి సహా మరో 10 మందికి సరఫరా చేసే నిధులను యూఎస్ ట్రెజరీ డిపార్ట్‌మెంట్ ఆంక్షలను విధించిన తరువాత.. ఈ అరెస్టులు చోటు చేసుకున్నాయని అంటున్నారు. ఈ ఘటన పట్ల పలువురు మీడియా ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిమ్మీ లై అరెస్టు ఆరంభం మాత్రమేనని, ఇలాంటి చర్యలు మరిన్ని ఉండొచ్చని అనుమానిస్తున్నారు. యాపిల్ డెయిలీని మూసేయించడమే లక్ష్యంగా కనిపిస్తోందని వ్యాఖ్యానిస్తున్నారు. హాంకాంగ్ మీడియా స్వేచ్ఛకు సంకెళ్లు పడ్డాయని చెబుతున్నారు.

English summary
Police on Monday arrested the media tycoon and activist Jimmy Lai, his sons and several executives of his publishing group for allegedly colluding with foreign forces, a crime punishable by life imprisonment under a sweeping national security law that China recently imposed on Hong Kong.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X