వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నిరసనల ఫలితం: నేరస్తుల అప్పగింత బిల్లుకు బ్రేక్ వేసిన హాంకాంగ్

|
Google Oneindia TeluguNews

చైనాకు నేరస్తుల అప్పగింతకు సంబంధించి హాంకాంగ్ తీసుకువచ్చిన బిల్లుపై ఆ దేశపౌరులు మండిపడుతున్నారు.ఇందులో భాగంగానే పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. గత కొద్దిరోజులుగా పరిస్థితి మరింత దారుణంగా తయారు కావడంతో హాంకాంగ్ ప్రభుత్వం బిల్లును తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని సీఈఓ కేరీలామ్ మీడియా సమావేశంలో ప్రకటించారు.

ఒక ఫోన్‌కాల్‌తో చాలా డబ్బును కొల్లగొట్టిన కేటుగాడు..ఎలాగంటే. ఒక ఫోన్‌కాల్‌తో చాలా డబ్బును కొల్లగొట్టిన కేటుగాడు..ఎలాగంటే.

బిల్లుపై కొన్ని వర్గాల్లో విబేధాలు వచ్చాయని.. కొందరు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నందున ప్రస్తుతానికి ఈ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టడం లేదని చెప్పారు. అందుకే బిల్లును మరింత స్టడీ చేసేందుకు కొంత సమయం అవసరమని ప్రభుత్వం భావించినట్లు లామ్ తెలిపారు. ఇక బిల్లును తాత్కాలికంగా నిలిపివేస్తున్నారన్న వార్త బయటకురావడంతో కనీసం బిల్లుపై చర్చ జరపాలని కొందరు చైనా అనుకూల రాజకీయనాయకులు కేరీ‌లామ్‌కు తెలిపారు. దేశ ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని వారి అభీష్టం మేరకే నడుచుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు కేరీ లామ్ తెలిపారు.

Hong Kong suspends proposed extradition bill,amid mounting protests

కొద్ది రోజుల క్రితం కేరీ లామ్ ఎట్టి పరిస్థితుల్లో బిల్లును ప్రవేశపెడతామని ప్రకటించారు. నిరసనల కంటే ముందు దేశప్రయోజనాలు ముఖ్యమని అన్నారు. ఈ బిల్లు ప్రవేశపెట్టకపోతే దేశ భద్రతకు ముప్పు వాటిల్లుతుందని లామ్ అభిప్రాయపడ్డారు. హాంగ్‌కాంగ్ దేశం నేరస్తులకు అడ్డాగా మారుతుందని అన్నారు.ఎక్కడెక్కడో నేరాలు చేసి హాంకాంగ్‌లో తలదాచుకుంటున్నారని లామ్ అన్నారు. ఇక హాంగ్‌కాంగ్‌లో జరుగుతున్న పలు నేరాలకు కారణం చైనా జాతీయులే అని కొందరు చెబుతున్నారు.

Hong Kong suspends proposed extradition bill,amid mounting protests

ప్రజాస్వామ్య సంస్కరణలకు అక్కడికి వచ్చిన చైనా జాతీయులు తూట్లు పొడుస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అంతేకాదు చైనా నాయకులను విమర్శించిన ఐదు మంది 2015లో కనిపించకుండా పోయారు. వీరంతా పుస్తకాలు అమ్ముకునేవారు. ఇక బిల్లును ప్రవేశపెడితే అందుకు సంపూర్ణ మద్దతు తెలిపింది చైనా. జరుగుతున్నవి నిరసనలు కావని కొందరు అల్లరిమూకలు ఇలాంటి పనులు చేస్తున్నారని చైనా మండిపడింది. హాంకాంగ్‌లో ప్రజలు రోడ్లపైకొచ్చి ఆందోళనలు చేయడంతో పలు దేశాలు హాంకాంగ్‌ ప్రభుత్వంతో టచ్‌లోకి వచ్చాయి. సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరాయి. తాజాగా బిల్లును ప్రవేశ పెట్టడం లేదన్న ప్రభుత్వ ప్రకటనను అమెరికా కాన్సులేట్ ఆహ్వానించింది.

English summary
Amid extreme protests and boycotts, the Hong Kong government Saturday suspended the controversial legislation which allowed extradition of some suspects to stand trial in mainland China. The decision was announced by Chief Executive Carrie Lam in a press conference, who said that the bill has caused intense division in the society and she had heard the calls for her government to “pause and think.”
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X