వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వామ్మో.. మిలిటరీ బేస్ ఇనుపకంచె ఎక్కిన మొసలి.. సోషల్ మీడియాలో హల్‌చల్

|
Google Oneindia TeluguNews

ఫ్లోరిడా : అదీ మిలిటరీ బేస్. అక్కడ సైనికులు శిక్షణ పొందుతుంటారు. కానీ వారు ఏర్పాటు చేసిన ఫెన్సింగ్ మాత్రం కాస్త చిన్నగానే ఉంది. వారిపై దాడి చేసేందుకు నేరస్తులో, సంఘ విద్రోహ శక్తులో దూకలేదు. ఓ మొసలి బేస్ క్యాంపులోకి వెళ్లడం కలకలం రేపింది. మొసలి ఏంటీ .. బేస్ క్యాంపులోకి వెళ్లడం ఏంటి అనుకుంటున్నారా ? నమ్మడం లేదా ? అయితే కింద వీడియో చూడండి. చూశారా ... అవును ఓ ప్రయాణికురాలు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో తెగ ట్రోల్ అవుతుంది.

అమెరికాలోని ఫ్లోరిడాలో మిలిటరీ బేస్ క్యాంపు ఉంది. ఇక్కడ సైనికులు శిక్షణ పొందుతారు. వారిని సుశిక్షితులైన సోల్జర్స్‌గా తీర్చిదిద్దుతారు. కఠోర సాధన అనంతరం పోస్టింగ్ ఇస్తారు. జాక్‌సాన్ విల్లేలో గల నవల్ ఎయిర్ స్టేషన్ ఉంది. దాని చుట్టు పక్కల ఇనుపకంచె ఏర్పాటు చేశారు. అయితే శనివారం కొంచెం వర్షం పడుతుంది. దీంతో అటుగా వెళ్తున్న క్రిస్టినా స్టివర్ట్ నిశీతంగా గమనించారు. రోడ్డుపై నుంచి ఓ మొసలి దాటుకుంటూ వెళ్లింది. అక్కడే ఉన్న ఇనుప కంచె ఎక్కింది. దీంతో ఆశ్చర్య పోయినా క్ట్రిస్టినా .. మొసలి కంచె ఎక్కిన ఘటనను వీడియో తీశారు. అలా మొసలి కంచె ఎక్కి .. మిలిటరీ బేస్ క్యాంపులోకి చొచ్చుకెళ్లింది.

 Horrifying Video Shows Alligator Climbing Fence At Military Base

ఆ వీడియోను తన సోషల్ మీడియాలో అకౌంట్‌లో పోస్ట్ చేశారు. ఇనుప కంచెను దాటుతున్న మొసలి అంటూ ట్యాగ్ లైన్ పెట్టి మరీ పోస్ట్ చేశారు. ఇంకేముంది ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. దాదాపు 3 లక్షల మంది చూశారు. ఆ వీడియో చూస్తుంటే భయమేస్తుంది అంటూ నెటిజన్లు కామెంట్లు పెట్టారు. మీరు ప్లోరిడాకు కొత్తనా .. ఇక్కడే కొన్నేళ్ల నుంచి ఉంటున్నారా ? మీరు ఇక్కడ నీళ్లు చూశారా .. అయితే అందులో మొసలి కూడా ఉంటుందని అని కామెంట్లు పెడుతున్నారు.

English summary
Security measures at a naval base in Florida were not enough to keep out one scary intruder - an alligator. A horrifying video that is going viral online shows a huge alligator scaling a fence to enter the military base of Naval Air Station Jacksonville. The video was captured by Christina Stewart, who was driving past the site on Saturday. She shared the clip of the alligator climbing the wire fence on Facebook and wrote: "Glad I got to watch him or her crawl over the gate and disappear." Her video has been viewed over 3 lakh times on Facebook and seems to have freaked a lot of people out.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X