వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బ్రెగ్జిట్ ఫలితాలు: ఏ గంటకు ఏం జరిగింది?, ఈయూ నుంచి బ్రిటన్ ఔట్

By Nageshwara Rao
|
Google Oneindia TeluguNews

లండన్: గత నాలుగు దశాబ్దాలుగా ఐరోయా యూరోపియన్ యూనియన్ (ఈయూ)తో కలిసి ఉన్న బ్రిటన్ ఇప్పుడు దాని నుంచి వైదొలిగింది. గురువారం నిర్వహించిన రిఫరెండంతో బ్రెగ్టిట్ (బ్రిటన్ ఎగ్జిట్)కు అనుకూలంగా ఉన్నామంటూ 51.9 శాతం మంది ప్రజలు కోరుకుంటే 48.1 శాతం మంది ప్రజలు ఈయూలోనే ఉండాలని తమ మద్దతు ప్రకటించారు.

ఈ నిర్ణయంతో యూరోపియన్‌ యూనియన్‌ నుంచి బ్రిటన్‌ వైదొలగడం ఖాయమైంది. ప్రజలు రెండు వర్గాలుగా విడిపోయి బ్రెగ్జిట్‌కు మద్దతుగా, వ్యతిరేకంగా హోరాహోరీగా ప్రచారం చేశారు. రెఫరెండంకు ముందు రోజున బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరూన్ మాట్లాడుతూ బ్రెగ్జిట్ వైపు మొగ్గు చూపితే కష్టాలు కోరి తెచ్చుకున్నట్టేనని హెచ్చిరించినా బ్రిటన్ వాసులు పట్టించుకోలేదు.

పిల్లల భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకుని బ్రెగ్జిట్‌కు వ్యతిరేకంగా ఓటు వేయాలని ఆయన విజ్ఞప్తి చేసినా ప్రజలు పెడచెవిన పెట్టారు. ఈయూలో కొనసాగాలా వద్దా? అన్న దానిపై గురువారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఓటింగ్‌ను నిర్వహించిన సంగతి తెలిసిందే.

ఈయూ నుంచి బ్రిటన్ ఔట్: విడిపోదామన్న మెజార్టీ ప్రజలు, ట్రేడింగ్ నిలిపివేసిన జపాన్

Hour by hour, how Brexit results night will unfold

భారత కాలమానం ప్రకారం గురువారం అర్ధరాత్రి నుంచి కౌంటింగ్‌ ప్రక్రియ మొదలైంది. శుక్రవారం మధ్యాహ్నం 11.30 నిమిషాలకు తుది ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ ఫలితాల్లో ఈయూలో కొనసాగాలని కోటి 49 లక్షల మంది ప్రజలు ఓటేయగా, వైదలగాలని కోటి 59 లక్షల మంది ఓటేశారు.

బ్రెగ్జిట్‌లో ఫలితాల వెల్లడిలో రెండు వర్గాల మధ్య ఓట్ల వ్యత్యాసం చాలా స్వల్పంగా ఉన్నప్పటికీ ఈయూ నుంచి వైదొలగాలనే బ్రిటన్ ప్రజలు నిర్ణయించారు. యూరోపియన్ యూనియన్ కూటమిలో మొత్తం 28 దేశాలు ఉన్న సంగతి తెలిసిందే. దీంతో ఈయూ నుంచి వైదొలగే మొట్టమొదటి దేశంగా బ్రిటన్ నిలిచింది.

బ్రెగ్జిట్ ఎఫెక్ట్, రాజకీయాల్లో కుదుపు: కామెరూన్ రాజీనామా!

బ్రెగ్జిట్ ఫలితాలు క్షణక్షణం ఉత్కంఠను కలిగిస్తూ గంట గంటకు తారుమారయ్యాయి. భారత కాలమానం ప్రకారం ఫలితాల విశ్లేషణ ఈ విధంగా ఉంది.

ఉదయం 6.30 గంటలు
ఈ సమయంలో ఈయూ మద్దతుదారులు, ఈయూ వ్యతిరేకుల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. విడిపోవాలని కోరుకునే వారి సంఖ్య కొంచెం ఆధిక్యంలో ఉంది. తొలి ఫలితం సండర్లాండ్ నుంచి వెలువడగా, ఇక్కడ 82,394 మంది విడిపోవాలని, 51,930 మంది కలిసి కొనసాగాలని ఓట్లు వేశారు.

7:30గంటలు
ఈ సమయంలో ఓట్ల లెక్కింపు ఉత్కంఠకు తెరలేపింది. ఇద్దరి మధ్యా వ్యత్యాసం భారీగా పెరిగింది. ఈయూ నుంచి వైదొలగాలనుకునే వారి సంఖ్య బాగా పెరిగింది.

8:30 గంటలు:
ఈ సమయంలో వెల్లడైన ఫలితాలను చూస్తే ఆశ్చర్యం కలగకమానదు. బ్రెగ్జిట్‌కు పూర్తిగా మద్దతు తెలిపారు. దీంతో ఈ సమయంలో ఈయూ నుంచి వైదొలగాలనే వారి సంఖ్య వేల నుంచి లక్షలకు చేరింది.

9:30గంటలు:
ఈ సమయంలో ఈయూ నుంచి వైదొలగాలనుకునే వారి సంఖ్య ఇంకా పెరిగింది.

10:30గంటలు:
ఈ సమయంలో ఈయూ నుంచి వైదొలగాలనుకునే వారి సంఖ్య క్రమంగా పెరిగింది. ఇద్దరి మధ్య 10లక్షల పైగా భారీ వ్యత్యాసం వచ్చింది.

11:30గంటలు:
ఫలితాల ఉత్యంఠకు తెరపడింది. ఈయూ నుంచి వైదొలగడానికి అధిక శాతం ప్రజలు మొగ్గు చూపారు. మొత్తంగా చూస్తే ఈయూలోనే బ్రిటన్ ఉండాలని 1,61,41,241 మంది ఓటేయాగా, వైదొలగాలని 1,74,10,742 మంది కోరుకున్నారు.

English summary
For anyone weary of the Brexit referendum – and it is hard to find someone who is not – going to bed by midnight Thursday should ensure they get a good night’s sleep before waking up to the result early on Friday morning.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X