వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దావోస్‌కు ముందు రోజు షాక్: చైనా-పాకిస్తాన్ కంటే వెనుకబడిన భారత్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ/దావోస్: సమ్మిళిత ఆర్థిక ప్రగతి సాధనలో భారత్ వర్ధమాన దేశాలలో 62వ స్థానంలో నిలిచింది. చైనా, పాకిస్తాన్‌ల కంటే భారత్ వెనుకబడి ఉంది. ప్రపంచ ఆర్థిక వేదిక రూపొందించిన అభివృద్ధి సూచీలో భారత్‌కు చైనా, పాక్‌ల కంటే దిగువ స్థానం దక్కడం గమనార్హం.

నరేంద్ర మోడీ ఇంగ్లీష్ భాషను అనుకరించిన డొనాల్డ్ ట్రంప్నరేంద్ర మోడీ ఇంగ్లీష్ భాషను అనుకరించిన డొనాల్డ్ ట్రంప్

ఈ జాబితాలో చైనాకు 26వ స్థానం లభించగా, పాకిస్తాన్ 47వ స్థానంలో నిలిచింది. భారత ప్రధాని నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ తదితర ప్రముఖులు హాజరవుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ప్రారంభానికి ముందు రోజు ఈ సూచీ విడుదల చేశారు.

 ఈ అంశాలు ప్రాతిపదికగా

ఈ అంశాలు ప్రాతిపదికగా

జీవన ప్రమాణాలు, పర్యావరణ సుస్థిరత, భవిష్యత్తు తరాలకు రుణభారం నుంచి రక్షణ వంటి అంశాలను ప్రాతిపదికగా తీసుకొని ఈ సూచీని రూపొందించినట్లు డబ్ల్యుఈఎఫ్ ఒక ప్రకటనలో తెలిపింది. సమ్మిళిత వృద్ధి, అబివృద్ధి సాధనకు సరికొత్త నమూనాను రూపొందించాలని, ఆర్థిక ప్రగతి అంచనాలకు జీడీపీని కొలమానంగా చేసుకోవడం షార్ట్ టర్మ్‌కు, అసమానతలకు దారి తీస్తుందని డబ్ల్యూఈఎఫ్ తెలిపింది.

 ఈసారి ఇండియా, చైనా ర్యాంకులు దిగజారాయి

ఈసారి ఇండియా, చైనా ర్యాంకులు దిగజారాయి

79 వర్థమాన ఆర్థిక వ్యవస్థలపై డబ్ల్యుఈఎఫ్ గత ఏడాది రూపొందించిన జాబితాలో భారత్ 60వ స్థానంలో నిలిచింది. అప్పుడు చైనా 15, పాకిస్తాన్ 52వ స్థానాల్లో నిలిచాయి. ఈసారి ఇండియా, చైనా ర్యాంకులు దిగజారాయి. మూడు రంగాలను ప్రామాణికంగా తీసుకొని 103 ఆర్థిక వ్యవస్థలకు 2018 సూచీ ర్యాంకులను కేటాయించింది. ఇందులో 29 అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలు కాగా, మిగతా 74 ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్న దేశాలు.

 భారత్ ఇలా

భారత్ ఇలా

అభివృద్ధి చెందుతున్న దేశాల జాబితాలో ర్యాంకు తక్కువగా వచ్చినప్పటికీ సంఘటిత వృద్ధి రేటులో భారత్ అడ్వాన్స్‌డ్ కేటగిరీలో ఉంది. ఇఖ అభివృద్ధి చెందిన దేశాల్లో నార్వే, ఐర్లాండ్, లగ్జెంబర్గ్, స్విట్జర్లాండ్, డెన్మార్క్ తొలి అయిదు స్థానాల్లో నిలిచాయి. టాప్ టెన్‌లో ఆస్ట్రేలియా తప్ప మిగతావన్నీ యూరోపియన్ దేశాలు.

షారుక్ ఖాన్‌కు సత్కారం

షారుక్ ఖాన్‌కు సత్కారం

ఇదిలా ఉండగా, దావోస్‌లో బాలీవుడ్ నటుడు షారూక్ ఖాన్ తళుక్కున మెరిశారు. ఆనను ప్రత్యేక అవార్డుతో సన్మానించారు. బాలలు, మహిళల హక్కుల కోసం షార్కు చేస్తున్న సేవలకు గాను ఆయనను క్రిస్టల్ అవార్డుతో గౌరవించింది డబ్ల్యూఈఎప్. షార్క్ మీర్ ఫౌండేషన్ ద్వారా యాసిడ్ దాడులకు గురైన మహిళలకు సహాయ, సహకారాలు అందిస్తున్నారు.

English summary
India was today ranked at the 62nd place among emerging economies on an Inclusive Development Index, much below China's 26th position and Pakistan's 47th.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X