వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్రంప్ అధికారాలకు కత్తెర: ఇరాన్‌పై యుద్ధం కుదరదిక..!

|
Google Oneindia TeluguNews

Recommended Video

US House Votes To Clip Trump's Wings On Iran || Oneindia Telugu

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు అనూహ్యంగా షాక్ ఇచ్చింది అక్కడి పార్లమెంట్. ఇరాన్‌పై యుద్ధాన్ని ప్రకటించడానికి అవసరమైన అధికారాలకు కత్తెర పెట్టింది. ఈ మేరకు అమెరికా హౌస్ ఆఫ్ రెప్రజెంటేటివ్స్‌లో ప్రవేశ తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేశారు సభ్యులు. ఈ తీర్మానానికి అనుకూంగా 194 ఓట్లు పడ్డాయి. వ్యతిరేకంగా 224 ఓట్లు పోల్ అయ్యాయి. దీనితో ఇరాన్‌పై యుద్ధాన్ని ప్రకటించే దిశగా డొనాల్డ్ ట్రంప్ ఇక ఎలాంటి నిర్ణయాన్నీ సొంతంగా తీసుకోలేని పరిస్థితి ఏర్పడినట్టయింది. .

విమానం కుప్పకూలడం వెనుక ట్విస్ట్: ఇరాన్ క్షిపణుల దెబ్బకు ముక్కలు: పసిగట్టిన శాటిలైట్లు..!విమానం కుప్పకూలడం వెనుక ట్విస్ట్: ఇరాన్ క్షిపణుల దెబ్బకు ముక్కలు: పసిగట్టిన శాటిలైట్లు..!

 రిపబ్లికన్లు కూడా..

రిపబ్లికన్లు కూడా..

ఈ ఎపిసోడ్ మొత్తంలో ఆసక్తికరమైన ట్విస్ట్ ఏమిటంటే- డొనాల్డ్ ట్రంప్ ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న రిపబ్లికన్లు కూడా తీర్యానానికి వ్యతిరేకంగా ఓటు వేయడం. రిపబ్లికన్ పార్టీ సభ్యులు మాట్ గేట్జ్ (ఫ్లోరిడా), థామస్ మాస్సీ (కెంటకీ), ఫ్రాన్సిస్ రూనీ (ఫ్లోరిడా) ప్రతిపక్ష డెమొక్రటిక్ పార్టీకి అనుకూలంగా ఓటుహక్కును వినియోగించుకున్నారు. మ్యాక్స్ రోజ్ (న్యూయార్క్), బెన్ మెక్ ఆడమ్స్ (ఉటా), ఆంథోని బ్రిండిసీ (న్యూయార్క్), జో కన్నింగ్‌హామ్ (దక్షిణ కరోలినా), ఎలాన్ లూరియా (వర్జీనియా), జోష్ గెథెమేర్ (న్యూజెర్సీ), కెండ్రా హార్న్ (ఒక్లహామా), స్టెఫానీ మర్ఫీ (ఫ్లోరిడా) తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేశారు.

ట్రంప్ దూకుడుకు అడ్డుకట్ట పడినట్టే..

ట్రంప్ దూకుడుకు అడ్డుకట్ట పడినట్టే..

ఇరాక్‌ రాజధాని బాగ్దాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయంపై అమెరికా వైమానిక దళాలు దాడి చేసి, ఇరాన్ సైన్యాధక్ష్యుడు ఖాసిం సోలేమనిని హతమార్చడానికి ట్రంప్ ఆదేశాలే ప్రధాన కారణమైన విషయం తెలిసిందే. ట్రంప్ ఆదేశాల మేరకే అమెరికా వైమానిక దళాలు దాడి చేశాయంటూ ఆ దేశ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యాలయం పెంటగాన్ వెల్లడించింది. దీనితో ట్రంప్ దూకుడుకు అడ్డుకట్ట వేయాలని హౌస్ ఆఫ్ రెప్రజెంటేటివ్స్ నిర్ణయించుకున్నట్లు తేలింది.

ఇరాన్‌పై యుద్ధ వాతావరణం తొలగిపోయినట్టేనా?

ఇరాన్‌పై యుద్ధ వాతావరణం తొలగిపోయినట్టేనా?

డొనాల్డ్ ట్రంప్ అధికారాలను కోత పెట్టిన నేపథ్యంలో.. యుద్ధ వాతావరణం దాదాపు తొలగిపోయినట్టేననే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. ఇరాక్‌లోని తమ సైనిక స్థావరాలపై ఇరాన్ ప్రతిదాడులకు దిగిన ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికా ఎలాంటి నిర్ణయాన్ని తీసుకుంటుందనే భయాందోళనలు వ్యక్తమయ్యాయి. హౌస్ ఆఫ్ రెప్రజెంటేటివ్స్ తాజాగా తీసుకున్న నిర్ణయంతో యుద్ధ భయం తొలగిపోయినప్పటికీ..ఇప్పుడు యుద్ధానికి అనుమతి ఇచ్చే అధికారం పార్లమెంట్‌కు ఉంది.

English summary
The House of Representatives on Thursday voted to approve a resolution aimed at restraining the President's ability to use military action against Iran without congressional approval, amid simmering tensions between the US and the country.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X