వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రిపోర్ట్‌కు దిమ్మతిరిగే పంచ్: వరద కష్టాల్లో ఉంటే చెత్త ప్రశ్నలు అడుగుతావా? (వీడియో)

వరద ప్రమాదాన్ని తప్పించుకుని బయటపడ్డ మా ముఖాలను చూస్తే మీకు ఇంటర్వ్యూ ఎలా చేయాలనిపిస్తుంది? అని చీవాట్లు పెట్టింది

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అమెరికాను ముంచెత్తిన హరీకేన్ హార్వీ హోస్టన్, టెక్సాస్ నగరాలను అతలాకుతలం చేస్తున్న సంగతి తెలిసిందే. మృతుల సంఖ్య ఇప్పటికే 31కి చేరగా.. వరదలు తగ్గుముఖం పడితే దీనిపై స్పష్టమైన వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.

బిక్కుబిక్కుమంటూ: ఇద్దరి పరిస్థితి విషమం, హర్రీకేన్ బాధితులకు తానా, ఆటా ఆపన్నహస్తంబిక్కుబిక్కుమంటూ: ఇద్దరి పరిస్థితి విషమం, హర్రీకేన్ బాధితులకు తానా, ఆటా ఆపన్నహస్తం

వరద ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు నిరాటంకంగా కొనసాగుతూనే ఉన్నాయి. ఇలాంటి తరుణంలో బాధితులంతా ఓవైపు సహాయం కోసం ఎదురుచూస్తుంటే.. మీడియా ప్రదర్శించిన అత్యుత్సాహంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

సీఎన్ఎన్ రిపోర్ట‌ర్ రోసా ఫ్లోర్స్‌ వరద ప్రాంతాల్లో బాధితుల అభిప్రాయాలను రికార్డ్ చేయడానికి వెళ్లి చేదు అనుభవం ఎదుర్కొన్నాడు. 'కష్ట కాలంలో ఉన్న తమకు సహాయం చేయకుండా, టీఆర్పీల కోసం చెత్త ప్రశ్నలు వేస్తావా?' అంటూ డేనియల్ అనే మహిళ ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

వరదల కారణంగా తప్పిపోయిన తమ పిల్లలను డేనియల్ హోస్టన్ కన్వెన్షన్ సెంటర్ సహాయ కేంద్రం వద్ద కలుసుకుంది. ఆ సమయంలోనే రిపోర్టర్ మైకులతో డేనియల్ ముందు హడావుడి చేయడంతో.. ఆమెకు చిర్రెత్తుకొచ్చింది.

'కెమెరాలు, మైకులతో ఇలా మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు. వరద ప్రమాదాన్ని తప్పించుకుని బయటపడ్డ మా ముఖాలను చూస్తే మీకు ఇంటర్వ్యూ ఎలా చేయాలనిపిస్తుంది? అంటూ డేనియల్ చీవాట్లు పెట్టింది. డేనియల్ వ్యాఖ్యలతో పరిస్థితిని అర్థం చేసుకున్న రోసా ఫ్లోర్స్ మైక్ వెనక్కి తీసుకుని క్షమాపణలు కోరింది.

English summary
CNN’s media correspondent Brian Stelter says this interview was a human, not a political,
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X