వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

coronavirus spread:AC ద్వారా వైరస్, రెస్టారెంట్‌లో 9 మందికి సోకిన రక్కసి..

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ ఆవిర్భవించింది చైనాలోని వుహాన్‌లో.. అయితే వైరస్ వ్యాప్తి చెందిన క్రమంలో వుహాన్‌లో లాక్ డౌన్ విధించడంతో మంచి ఫలితాలు వచ్చాయి. అయితే వైరస్ సోకిన ఒకరు వుహాన్ నుంచి ఒకరు గ్వాంజు వెళ్లి రెస్టారెంట్‌లో భోజనం చేశారు. అక్కడ వైరస్ ఏసీ గుండా మూడు కుటుంబాలకు సోకాయి. వారికి వైరస్ ఎలా సోకిందని చైనా అధికారులు చేసిన పరిశోధనలో నిజం వెలుగుచూసింది.

 9 మందికి వైరస్..

9 మందికి వైరస్..

రెస్టారెంట్‌లో భోజనం చేసిన సమయంలో సమీపంలో ఉన్న తొమ్మిది మందికి వైరస్ సోకింది. అయితే వీరిలో ఒకరికొకరు పరిచయం లేకపోవడం విశేషం. అయితే హోటల్‌లో పనిచేస్తోన్న ఇతరులు, సిబ్బంది మొత్తం 73 మంది మాత్రం వైరస్ బారినపపడలేదని చైనా సెంటర్ ఫర్ డిసిజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ తెలిపినట్టు న్యూయార్క్ టైమ్స్ తన కథనంలో పేర్కొన్నది.

ఫ్యామిలీ నుంచి వైరస్..

ఫ్యామిలీ నుంచి వైరస్..

రెస్టారెంట్‌లో కూర్చొన్న ఫ్యామిలీ ‘ఏ' నుంచి ఫ్యామిలీ ‘బీ', ఫ్యామిలీ ‘సీ'కి ఏసీ ద్వారా వైరస్ సోకింది. వారు దగ్గినప్పుడు వాయువు ద్వారా వైరస్ ఏసీలోకి వెళ్లి.. తిరిగి బయటకు వచ్చింది. అలా రెస్టారెంట్‌లో కూర్చొన్న 63 ఏళ్ల వృద్దురాలికి తర్వాత దగ్గు, జ్వరం వచ్చింది. తర్వాత ఆమెకు పరీక్షలు చేయగా కరోనా పాజిటివ్ వచ్చింది. రెండు వారాల్లో ఇలా 9 మంది వరకు వైరస్ సోకింది. అయితే వారంతా అదే రెస్టారెంట్ వెళ్లిన వారు అని గుర్తించారు.

Recommended Video

Lockdown : Students In Hyderabad Donating Food & Grocery For 1500 People In Balanagar
మహిళా.. ఫ్యామిలీ మెంబర్స్

మహిళా.. ఫ్యామిలీ మెంబర్స్

వైరస్ సోకిన వారిలో నలుగురు మహిళ బంధువులు కాగా.. మిగిలిన వారు అక్కడ కూర్చొన్న మిగతా వారు. ఫ్యామిలీ ‘ఏ' ఆశీనులు కాగా.. వారు ద్వారా ఏసీలోకి గాలి ప్రవేశించింది. పక్కనే ఫ్యామిలీ ‘సీ'కి వైరస్ సోకింది. ఇటు పక్కన ఉన్న ఫ్యామిలీ ‘బీ'కి కూడా వైరస్ సోకింది. ఇలా 9 మందికి వైరస్ వచ్చింది. అయితే ఆ ఏసీకి దూరంగా ఉన్నవారికి వైరస్ సోకలేదని అధికారులు పేర్కొన్నారు.

English summary
Wuhan was yet to be locked down completely, a family was dining at a restaurant in Guangzhou and spread the virus.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X