వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మీకెంత ధైర్యం: దేశాధినేతలను కడిగి పారేసిన ఈ 16 ఏళ్ల బాలిక ఎవరు?

|
Google Oneindia TeluguNews

న్యూయార్క్/ యూఎన్: ఆమెకు 16 ఏళ్లు.. కానీ ఓ అంతర్జాతీయ వేదికపై ప్రపంచదేశాల అధినేతలకు ముచ్చెమటలు పట్టించింది. ఒక ప్రధాని గురించి వ్యతిరేకంగా మాట్లాడాలంటే భయపడే మనము... ఆ బాలిక మాత్రం ఏకంగా 60 దేశాల అధినేతలను ఏకి పారేసింది. నాయకులు వారు సంపాదన కోసం పాకులాడే మనస్తత్వమే ఈ రోజు యువత భవిష్యత్తును, భవిష్యత్ తరాలను అంధకారంలోకి నెట్టేసిందని విరుచుకుపడింది.. మా జీవితాలతో ఆడుకునే హక్కు మీకెవరిచ్చారంటూ నేతలను నిలదీసింది. ఇంతకీ ఆ 16 ఏళ్ల బాలిక ఎవరో తెలుసా..?

అందరి చూపు 16 ఏళ్ల బాలిక వైపే...

అందరి చూపు 16 ఏళ్ల బాలిక వైపే...

ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా సోమవారం రోజున వాతావరణ పరిరక్షణపై నేతలు మాట్లాడారు. భారత ప్రధాని నరేంద్ర మోడీతో పాటు పలువురు దేశాధినేతలు పాల్గొని ప్రసంగించారు. కానీ వీరందరి ప్రసంగాలు షరామామూలు అన్నట్లే సాగాయి. అయితే గ్రేటా థన్‌బర్గ్ అనే 16 ఏళ్ల బాలిక ప్రసంగం మాత్రం ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. వాతావరణంలో పెను మార్పులు చోటుచేసుకున్నాయంటే దానికి కారణం ప్రభుత్వాలు పాలకులే అని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ తరం, నాయకులను ఎన్నటికీ క్షమించదని నాయకులను వేదికపై నుంచి కడిగి పారేసింది. తమ భవిష్యత్తును అంధకారంలో పడేసేందుకు హక్కు ఎవరిచ్చారంటూ ప్రశ్నించడమే కాదు.. అంతటి ధైర్యం ఎక్కడినుంచి వచ్చిందని మండిపడింది.

స్కూళ్లో ఉండాల్సిన దాన్ని..ఇక్కడున్నాను

స్కూళ్లో ఉండాల్సిన దాన్ని..ఇక్కడున్నాను

స్వీడన్‌కు చెందిన ఈ టీనేజీ అమ్మాయి ఒక్కసారిగా ప్రపంచ దృష్టిని ఆకట్టుకుంది. వాతావరణం, పర్యావరణ పరిరక్షణకై ఉద్యమిస్తోంది. తను ఈ సమయంలో ఎంతో చక్కగా స్కూళ్లో ఉండాల్సిన దాన్నని తన వయసుకు ఈ సమావేశంకు రాకూడదని చెప్పారు. కానీ పాలకులు చేస్తున్న తప్పులకు పర్యావరణం దెబ్బతిని తమలాంటి యువత భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేస్తున్నారని అందుకే దీనిపై ప్రశ్నించేందుకు తాను వచ్చానని గ్రేటా తన్‌బర్గ్ చెబుతూ భావోద్వేగానికి గురైంది.

ఇప్పటికీ పాలకులు ఆర్థిక అంశాలనే మాట్లాడుతున్నారు

ఇప్పటికీ పాలకులు ఆర్థిక అంశాలనే మాట్లాడుతున్నారు

పాలకులంతా కలిసి తను కన్న కలలను చెరిపివేశారని, పాలకులు చెప్పే వట్టి మాటలను నమ్మి తన బాల్యంను కోల్పోయినట్లు గ్రేటా తన్‌బర్గ్ చెప్పింది. అయినప్పటికీ తాను అదృష్టవంతురాలినేనని చెప్పుకొచ్చింది. ఎందుకంటే పాలకులు పర్యావరణంను దెబ్బతీస్తున్న నేపథ్యంలో చాలామంది సామాన్య ప్రజలు చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. త్వరలో మనిషి కూడా క్రమంగా అంతరించిపోతాడని చెప్పిన గ్రేటా తన్‌బర్గ్... ఇప్పటికీ పాలకులు తమ దేశ ఆర్థిక వ్యవస్థ, డబ్బులు గురించే కథలు కథలుగా మాట్లాడుతారని చెప్పింది. మీకెంత ధైర్యం అంటూ ప్రశ్నించింది.

భవిష్యత్ తరాలు క్షమించవు

భవిష్యత్ తరాలు క్షమించవు

తను పలువురు దేశాధినేతలతో మాట్లాడిన సమయంలో వారంతా యువత గొంతుకను ప్రభుత్వాలు వింటున్నాయని పర్యావరణంపై కచ్చితంగా మంచి జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని నమ్మబలికారని చెప్పింది గ్రేటా తన్‌బర్గ్. కానీ వారి మాటలు నమ్మశక్యంగా లేవని, ఒకవేళ నిజంగానే వారు పర్యావరణం నాశనమైపోతోంది అనే సత్యాన్ని గ్రహించి ఉంటే ఎప్పుడో చర్యలు ప్రారంభించేవారని ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఇక చివరిగా దేశాధినేతలు పాలకులు ప్రతీసారి యువత కన్న స్వప్నాలపై నీళ్లు చల్లుతున్నారని పర్యావరణంను కాపాడటంలో విఫలమవుతున్నారని చెబుతూ తన ప్రసంగంను ముగించింది గ్రేటా తన్‌బర్గ్. అయితే ఇప్పుడు మీరు చేస్తున్న ద్రోహాన్ని యువత పసిగట్టిందని చెప్పిన గ్రేటా తన్‌బర్గ్.... భవిష్యత్ తరాల కళ్లన్నీ నేతలు చెప్పే మాటలపైనే ఉన్నాయని చెప్పింది. ఈ సారి కూడా పాలకులు మోసం చేస్తే యువత వారిని ఎప్పటికీ క్షమించదంటూ తన ప్రసంగాన్ని ముగించింది గ్రేటా తన్‌బర్గ్.

English summary
Greta Thunberg a 16 year girl who plays active role in saving environment slammed the world leaders for not acting promptly at the climate summit at UN.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X