వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డెక్సామెథాసోన్.. కోవిడ్-19కి డ్రగ్ దొరికినట్టేనా.. ట్రయల్స్‌లో ఏం తేలింది..?

|
Google Oneindia TeluguNews

ఇప్పటికైతే కరోనా వైరస్‌కు ప్రత్యేక చికిత్సా విధానం గానీ వ్యాక్సిన్ గానీ అందుబాటులో లేవు. అవి ఎప్పటిలోపు అందుబాటులోకి వస్తాయో చెప్పడానికి నిర్దిష్ట అంచనాలు కూడా లేవు. ఇలాంటి తరుణంలో ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ సైంటిస్టులు ప్రపంచానికి బిగ్ రిలీఫ్ ఇచ్చే ఓ మంచి వార్త చెప్పారు. డెక్సామెథాసోన్ అనే జనరిక్ డ్రగ్ ద్వారా కోవిడ్-19 మరణాలను తగ్గించవచ్చునని.. ముఖ్యంగా వైరస్ కారణంగా తీవ్ర అనారోగ్యం బారినపడినవారిలో డెత్ రిస్క్‌ను తగ్గించవచ్చునని వెల్లడించారు. గతంలోనూ హైడ్రాక్సి క్లోరోక్విన్,ఫవిపరవిర్,లోపినవిర్ వంటి డ్రగ్స్ కోవిడ్ 19 ట్రీట్‌మెంట్‌లో ఆశాజనకమైన ఫలితాలనిస్తున్నాయన్న అధ్యయనాలు వెలుగుచూసిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ ఆ పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి.

 213 మందికి వైరస్, రెండోరోజు రెండొందల పాజిటివ్ కేసులు, నలుగురి మృతి.. 213 మందికి వైరస్, రెండోరోజు రెండొందల పాజిటివ్ కేసులు, నలుగురి మృతి..

1960ల నుంచి ఉపయోగంలో..

1960ల నుంచి ఉపయోగంలో..

తక్కువ ఖర్చుతో కూడుకున్న డెక్సామెథాసోన్ డ్రగ్ 1960ల నుంచి వైద్య చికిత్స విధానంలో ఉపయోగంలో ఉంది. పలు చికిత్స విధానాల్లో డెక్సామెథాసోన్‌తో పెద్ద ఎత్తున ప్రయోగాలు జరిగాయి.ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌పై కూడా ఇది ప్రభావాన్ని చూపగలదా అన్న దానిపై సైంటిస్టులు దృష్టి సారించారు. బ్రిటన్‌లోని నేషనల్ హెల్త్ సర్వీస్‌లో దీన్ని ఉపయోగించేందుకు అనుమతులు కూడా రావడంతో అక్కడ ఎంపిక చేసిన పేషెంట్లపై ట్రయల్స్ నిర్వహిస్తున్నారు.

ట్రయల్స్‌లో ఏం తేలింది..

ట్రయల్స్‌లో ఏం తేలింది..

డాక్సామెథాసోన్ పనితీరును పరిశీలించేందుకు బ్రిటన్‌ నేషనల్ హెల్త్ సర్వీస్‌లోని 175 ఆస్పత్రుల్లోని 11500 పేషెంట్లను సైంటిస్టులు ఎంచుకున్నారు. ఇందులో 2104 మంది పేషెంట్లకు ఒకేసారి కాకుండా ర్యాండమ్‌గా డెక్సా డ్రగ్‌ను ఇచ్చారు. ఒక్కో పేషెంట్‌కు 10 రోజుల పాటు 6మి.గ్రా మోతాదులో ఇచ్చారు. మరో 4321 మంది పేషెంట్లకు ప్రస్తుతం ఇస్తున్న సాధారణ చికిత్సనే కొనసాగించారు. ఈ ఫలితాలను విశ్లేషించగా... వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న 33 శాతం మంది పేషెంట్లలో మరణాలను తగ్గించినట్టు నిర్దారించారు. అలాగే సాధారణ పేషెంట్లలోనూ దీని కారణంగా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ తలెత్తలేదని గుర్తించారు.

ఏయే ట్రీట్‌మెంట్స్‌లో ఉపయోగంలో ఉంది..

ఏయే ట్రీట్‌మెంట్స్‌లో ఉపయోగంలో ఉంది..

డెక్సామెథాసోన్ అనేది ఒక కార్టికోస్టెరాయిడ్ (కార్టిసోన్ వంటి మెడిసిన్ లేదా స్టెరాయిడ్). మయో క్లినిక్ తెలిపిన ప్రకారం.. ఆస్తమా, ఆర్థరైటిస్, మల్టిపుల్ స్క్లెరోసిస్,తీవ్రమైన అలర్జీలు ఇతరత్రా చికిత్స విధానాల్లో రోగ నిరోధక డ్రగ్‌గా దీన్ని ఉపయోగిస్తారు.మొదట్లో వుహాన్‌లో తీవ్రమైన ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌కు గురైన కరోనా పేషెంట్లకూ స్టెరాయిడ్స్ ఉపయోగించారని మౌంట్ సినయ్ హెల్త్ సిస్టమ్ సీఈవో డా.చార్లెస్ పావెల్ తెలిపారు. అయితే మరింత విస్తృత పరిశోధనలు,సమీక్ష జరగాల్సి ఉందని మరికొందరు వైద్యులు అభిప్రాయపడుతున్నారు.

Recommended Video

IPL 2020 Line Clear : No T20 World Cup Plans, Cricket Australia Confirms
అద్భుతాలు జరుగుతాయా..?

అద్భుతాలు జరుగుతాయా..?

డెక్సామెథాసోన్ ప్రస్తుతం విరివిగా అందుబాటులో ఉంది. రెండెసివిర్ లాంటి డ్రగ్స్ తరహాలో దీనికి కొరత ఏమీ లేదు. పైగా తయారీలోనూ పెద్ద సంక్లిష్టత లేదు. పైగా ఏజీ అక్టెమ్రా వంటి రోగ నిరోధక డ్రగ్స్‌తో పోల్చితే దీనికి అయ్యే ఖర్చు చాలా తక్కువ. రాబోయే రోజుల్లో దీనిపై మరిన్ని పరిశోధనలు జరిగి.. రికవరీ రేటు బాగుంటే కోవిడ్ 19 చికిత్స విధానంలో ఇది కీలకంగా మారే అవకాశం లేకపోలేదు. అయితే దీనివల్ల అద్భుతాలు జరుగుతాయని కూడా ఆశించలేమన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి.

English summary
An inexpensive and widely available steroid used since the early 1960s and known for its anti-inflammatory properties is being touted as the next life-saving treatment for COVID-19
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X