వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్ బ్యాంకు్లో రూ.5,900 కోట్లు దాచిన దావూద్: ఎలా చేశాడు?

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: నల్లధనం పైన ఓ వైపు కేంద్ర ప్రభుత్వం దర్యాఫ్తు చేస్తుండగా... అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం గురించిన షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈడీ.. ఐబీ, రీసెర్చ్ అండ్ ఎనలసిస్ వింగ్ సహకారంతో దావూద్ గురించిన పలు విషయాలను గుర్తించింది.

భారత దేశంలోని వివిధ బ్యాంకులలో దావూద్ ఇబ్రహీం రూ.5,900 కోట్లు పెట్టారని తెలుస్తోంది. వీటిని దేశంలోని 1600 బ్యాంకులలో పెట్టారని సమాచారం.

దావూద్ ఇబ్రహీం... ఎక్కువ మొత్తం డబ్బులను నేషనలైజ్డ్ బ్యాంకులలో పెట్టాడు.

మొత్తం 1600 బ్యాంకులలో వాటిని ఉంచాడని తెలుస్తోంది. అందులో 900 బ్యాంకులు నేషనలైజ్డ్ బ్యాంకులుగా తెలుస్తోంది.

ఈ డబ్బును అక్రమంగా కూడగట్టారు. డ్రగ్స్, అక్రమాయుధాల సరఫరా, లాటరీ స్కామ్స్ తదితరాల ద్వారా సేకరించారు. ఈ మొత్తాన్ని తమ ఏజెంట్స్ ద్వారా బ్యాంకులలో పెట్టించాడు.

దావూద్ ఇబ్రహీంకు చెందిన ఏజెంట్లు తమ పేర్ల పైన ఖాతాలను ఓపెన్ చేయరు. వారు డబ్బులు అవసరమైన ప్రజలను లక్ష్యంగా చేసుకుంటారు. వారి అకౌంట్లలోకి డబ్బులు వేసుకోవాలని పలువురికి చెబుతారు.

How did Dawood park Rs 5,900 crore in Indian banks?

సామాన్యులు అకౌంట్ ఓపెన్ చేసి అందులో డబ్బులు వేసుకోవడానికి వారికి ఏజెంట్లు కొంత మొత్తాన్ని చెల్లిస్తుంటారు.

తమ తమ డిపాజిట్లలో డబ్బులు వేసుకునే వారికి.. రూ.లక్షకు.. రూ.5వేలు ఇస్తారని తెలుస్తోంది.

ఏటీఎం కార్డులను ఖాతాదారులు దావూద్ ఏజెంట్లకు అప్పగిస్తారు.

భారత దేశంలో దావూద్ ఇబ్రహీంకు మూడు వందల మంది ఏజెంట్ల వరకు ఉన్నారని తెలుస్తోంది.

గత నాలుగైదేళ్లుగా దావూద్ ఇబ్రహీం ఏజెంట్లు ఉపయోగిస్తున్న దాదాపు వెయ్యి వరకు నెంబర్లను ఐబీ, రా సంపాదించకలిగిందని తెలుస్తోంది. ఇందులో కరాచీకి చెందిన నెంబర్లు కూడా ఉన్నాయని తెలుస్తోంది.

నగరాలలోని బ్యాంకులలో స్క్రూటినీ ఎక్కువగా ఉంటోందని భావించిన దావుద్ అనుచరులు ఎక్కువగా గ్రామీణ ప్రాంత బ్యాంకులకే ప్రాధాన్యత ఇస్తుంటారట.

ఒకసారి ఒక అకౌంటులో కేవలం లక్ష రూపాయల వరకు వేస్తుంటారట. అంతేకాదు, అదే అకౌంటును మూడుసార్లకు మించి ఉపయోగించరని తేలింది.

English summary
In the fight against black money there are always two sides to it. The one we know and the other we do not.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X