వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏసుక్రీస్తు ఎలా కనిపించేవారు.. ఆయన అసలు చిత్రం ఏది?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews

జీసస్ లేదా ఏసుక్రీస్తు ఎలా ఉంటాడో మనకందరికీ తెలుసు. పాశ్చాత్య కళాకారులు అత్యధికంగా రూపొందించిన చిత్రాల్లో ఆయనది కూడా ఒకటి.

జీసస్ ప్రతి చిత్రంలో ఆయనకు పొడవాటి జుట్టు, గడ్డం ఉంటాయి. ఆయన పొడవాటి చేతులున్న చోగా(తరచూ ఇది తెల్ల రంగులోనే ఉంటుంది) ధరించినట్లు చూపిస్తారు. దానిపై ఒక వస్త్రం(ఎక్కువగా నీలం) వేసుకున్నట్టు కనిపిస్తుంది.

ఏసుక్రీస్తు ముఖం ఇప్పుడు ఎంత సుపరిచితం అయ్యిందంటే, మనం దాన్ని కేక్ మీద నుంచి టోస్ట్ ముక్కల్లో కూడా చూడవచ్చు.

కానీ. ఏసుక్రీస్తు నిజంగా ఈ చిత్రాల్లో ఉన్నట్లే ఉండేవారా. బహుశా, కాదేమో. నిజానికి ప్రసిద్ధి పొందిన ఏసుక్రీస్తు చిత్రం మొదట గ్రీకు సామ్రాజ్యం నుంచి వచ్చింది. నాలుగో శతాబ్దం తర్వాత నుంచే జీసస్ బైజాంటియన్ చిత్రాలు ఉన్నాయి. వాటిని బట్టే క్రీస్తు ఇలా ఉండేవారని ఊహించగలిగారు. కానీ చారిత్రక కోణంలో ఆ వాదనల్లో కచ్చితత్వం లేదు.

సింహాసనంపై ఒక చక్రవర్తిలా కూర్చున్న ఏసు చిత్రం ఆధారంగా ఆయన చిత్రాలు వేశారు. రోమ్‌లో శాంటా ప్యూడెన్‌జైనా చర్చిలోని మొజాయిక్‌లో ఆ చిత్రం కనిపిస్తుంది.

ఆ చిత్రంలో జీసస్ బంగారు రంగు టోగా(చోగా) ధరించి ఉంటారు. మొత్తం ప్రపంచానికే పాలకుడులా కనిపిస్తుంటారు. పొడవాటి జుట్టు, గడ్డంతో సింహాసనంపై కూర్చున్న ఆయన జూస్‌లా కనిపిస్తున్నారు.

జూస్ అంటే ప్రాచీన గ్రీకు మతంలో ప్రధాన దేవుడు. ఒలింపియా ఆయన దేవాలయం. అందులోని ఆయన విగ్రహం ఆధారంగానే ఏసుక్రీస్తు చిత్రాలు కూడా లభించాయి. ఈ విగ్రహం ఎంత ప్రసిద్ధి చెందిందంటే, రోమన్ చక్రవర్తి అగస్టస్ దగ్గర కూడా ఇదే శైలిలో రూపొందించిన ప్రతిమ ఉండేది.(అయితే ఇందులో గడ్డం, పొడవాటి జుట్టు లేవు)

బైజాంటియన్ కళాకారులు ఏసుక్రీస్తును స్వర్గాన్ని పాలించే, విశ్వ పాలకుడి రూపంలో చూపించారు. వారు ఆయన్ను యువ జూస్‌ రూపంలో చూపించేవారు.

కానీ, కాలక్రమేణా స్వర్గానికి చెందిన ఏసుక్రీస్తు చిత్రాల విజువలైజేషన్‌లో మార్పులు వచ్చాయి. తర్వాత కాలంలో హిప్పీ లైన్ ఆధారంగా మార్పులు జరిగాయి. ఇప్పుడు, ఆయన గురించి వేసిన ఏసుక్రీస్తు మొదటి చిత్రాలే ప్రామాణికంగా మారాయి.

అయినా, ఏసుక్రీస్తు రూపం అసలు ఎలా ఉండేది అనే ప్రశ్న వస్తుంది. అందుకే, ఇప్పుడు మనం తల నుంచి పాదాల వరకూ జీసస్ ఎలా ఉండేవారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

జుట్టు, గడ్డం

మొదట్లో క్రైస్తవులు ఏసుక్రీస్తును స్వర్గంలో దేవుడుగా చూసేవారు కాదు. వాళ్లంతా ఆయన్ను ఒక మామూలు మనిషిలాగే చూశారు. అప్పుడు ఆయనకు గడ్డంగానీ, పొడవాటి జుట్టుగానీ లేవు.

కానీ, దేశదిమ్మరిలా ఉండడం వల్ల జీసస్‌కు గడ్డం పెరిగుంటుందని, ఆయన తిరుగుతూనే ఉండడం వల్ల ఆయన బహుశా గడ్డం చేసుకునేవారు కాదేమోనని అనుకునేవారు. అందుకే, చిత్రాల్లో ఏసుక్రీస్తును గడ్డం ఉన్న వ్యక్తిగా చూపించారు.

చెదిరిన జుట్టు, గడ్డం వేదాంతులకు చిహ్నంగా భావించి ఉండవచ్చు. అలాంటి వారు(ప్రాపంచిక విషయాలకంటే ఎక్కువగా ఆలోచించే సన్యాసులు)మిగతావారికి భిన్నంగా ఉంటారు.

క్రీస్తు ఈ చిత్రం ఆయన స్వభావానికి సరిగ్గా సరిపోతుందని తత్వవేత్త ఎపిక్టెస్ భావించారు. మొదటి శతాబ్దంలో గ్రీకు-రోమన్ కాలంలో శుభ్రంగా గడ్డం చేసుకోవడం, జుట్టు పొట్టిగా ఉండడం తప్పనిసరిగా భావించేవారు. మెడ వరకూ ఉన్న జుట్టు, గడ్డం దైవత్వాన్ని సూచిస్తుంది. అప్పటి పురుషులకు అలాంటి రూపం ఉండేది కాదు. తత్వవేత్తలు కూడా చాలా పొట్టి జుట్టుతోనే ఉండేవారు.

ప్రాచీన కాలంలో యూదులకు గడ్డం ఉండేది. ఇందులో వింతేం లేదు. అప్పుడప్పుడు తమను అణచివేసేవారి నుంచి కాపాడుకోడానికి వారు గడ్డం పెంచేవారు. అప్పుడు వారిని గుర్తించడం కష్టంగా ఉండేది.

ఆ కాలంలో అందరూ ఒకేలా కనిపించేవారు. అయితే 70 శతాబ్దంలో జెరూసలెంపై ఆక్రమణ తర్వాత రోమన్లు జుడియా కాప్టా ప్రకారం జారీ చేసిన నాణాల్లోని చిత్రాలను బట్టి, అప్పట్లో బందీలుగా ఉండేవారికి గడ్డాలు ఉండేవని తెలుస్తోంది.

అంటే, ఏసుక్రీస్తు కూడా అలాంటి ఒక తత్వవేత్తలా, సహజంగా అలా కనిపించేవారా. ఆ నాణాల్లో చూపించినట్లు ఆయనకు చిన్న గడ్డం ఉండుంటుంది. కానీ ఆయన జుట్టు పొడవుగా ఉండకపోవచ్చు.

ఆయనకు పొడవాటి జుట్టు ఉండుంటే మనకు ఏదైనా ప్రతిచర్య కనిపించి ఉండేది. యూదుల్లో గడ్డం, పొడవాటి జుట్టు ఉన్న వారిని వెంటనే గుర్తించేవారు. వారంతా నాజరైట్ దీక్ష చేసుండేవారు.

ఆ దీక్షలో వారు కొంత కాలం దేవుడి భక్తిలో లీనం కావాల్సి వచ్చేది. ఆ సమయంలో వారు మద్య తాగడం, జుట్టు కత్తిరించుకోవడం నిషేధం. దీక్ష ముగిసిన తర్వాత వారంతా జెరూసలెంలో ఒక ఆలయంలో జరిగే కార్యక్రమంలో జుట్టు, గడ్డం తీయించుకునేవారు.

కానీ, ఏసుక్రీస్తు నాజరైట్ దీక్ష చేయలేదు. ఆయన తరచూ మద్యం తాగుతూ కనిపించారని, ఆయన అతిగా మద్యం తాగేవారని క్రీస్తు విమర్శకులు ఆరోపించారు(మాథ్యూ అధ్యాయం, వచనం 11). ఆయన నాజరైట్ తీసుకునుంటే, ఆయన ముఖంలో ఆ మార్పుకు సంబంధించి ఏదైనా కనిపించి ఉండేదని అంటారు..

క్రీస్తు బట్టలు

ఏసుక్రీస్తు ఉన్న సమయంలో సంపన్నులు ముఖ్యంగా కొన్ని సందర్భాల్లో పొడవాటి చోగా ధరించేవారు. అది ప్రజా జీవితంలో ఔన్నత్యాన్ని చూపించడానికి చిహ్నంగా ఉండేది.

పొడవాటి చోగా వేసుకుని బజార్లలో సలాములు అందుకునే నేతలకు, ప్రార్థనామందిరాల్లో ప్రముఖ స్థానాల్లో కూర్చోపెట్టేవారికి దూరంగా ఉండండి అని ఏసుక్రీస్తు తన బోధనల్లో అన్నారు.(మార్క్ చాప్టర్, వచనం 38-39)

ఏసుక్రీస్తు ఈ కథనాలను గాస్పెల్‌లో అత్యంత ప్రామాణిక భాగంగా భావించారు. అందుకే, ఆయన ఇలాంటి చోగా ధరించి ఉండరని మనం అనుకోవచ్చు. జీసస్ ఉన్న కాలంలో పురుషులు మోకాళ్ల వరకూ పొడవాటి ట్యూనిక్ ధరించేవారు. దానిని చిటాన్ అనేవారు. మహిళలు మడమలవరకూ పొడవాటి వస్త్రం ధరించేవారు.

పురుషులు వేసుకునే ట్యూనిక్‌కు భుజాల నుంచి మోకాళ్ల వరకూ రంగుల పట్టీలు ఉండేవి. వీటిని ఒకే ముక్కలా నేసేవారు. ఆ ట్యూనిక్ మీద ఏదైనా వస్త్రం కప్పుకునేవారు. దానిని హిమెషన్ అనేవారు. జీసస్ కూడా దానిని ధరించడం మనం చూశాం.

ఒక మహిళ ఆశీర్వాదం కోసం వెళ్లినపుడు, ఏసు వస్త్రాన్ని తాకారు. దానిని బట్టి ఆయన అలాంటి ఒక వస్త్రం కప్పుకునేవారనేది తెలుస్తోంది. (మార్క్ అధ్యాయం 5, వరుస 27)

అప్పట్లో జనం కప్పుకునే వస్త్రం నాణ్యత, సైజు, రంగును బట్టి ప్రజల గొప్పతనం గుర్తించేవారు. పర్పుల్, మరికొన్ని రకాల నీలం రంగులను ఉన్నత వర్గాలకు చిహ్నంగా భావించేవారు. అప్పట్లో నీలం రంగును రాజసంగా భావించేవారు. ఎందుకంటే అప్పట్లో నీలం రంగు అరుదుగా దొరికేది. దాని ధర కూడా చాలా ఎక్కువ.

జీసస్ బట్టలు, మెరిసే వాటి తెల్లటి రంగు గురించి మార్క్ అధ్యాయం 9లో చెప్పారు. ముగ్గురు దేవదూతలు ఆయనతోపాటూ పర్వతంపైకి వెళ్లినప్పుడు, అక్కడ ఏసు శరీరం నుంచి వెలుగు రావడం మొదలైందని చెప్పారు.

"జీసస్ హిమాషియా(బట్టలు) మెరుస్తోంది. అది పూర్తిగా తెల్లగా మెరుస్తోంది. అంత మెరుపు భూమిపై బట్టలు ఉతికే ఎవరూ తీసుకురాలేరు. ఏసుక్రీస్తు రూపాంతరణకు ముందు ఆయన ఒక మామూలు వ్యక్తిలాగే ఉండేవారని మార్క్ చెప్పారు. అప్పుడు ఆయన రంగు లేని ఉన్ని దుస్తులు వేసుకునేవారని అన్నారు.

ఏసును శిలువ వేసినప్పుడు ఆయన బట్టల గురించిన ఎక్కువ వర్ణనలు మనకు కనిపిస్తాయి. రోమన్ సైనికులు ఆయన హిమాషియాను నాలుగు ముక్కలుగా చేయడంతో(జాన్ అధ్యాయం 19-23) అందులో ఒకటి టలిత్ అయ్యింది. దానిని యూదుల ప్రార్థనల సమయంలో శాలువలా ఉపయోగించేవారు.

మాథ్యూ అధ్యాయం, వచనం 5లో టసెల్స్ తోపాటూ ఈ వస్త్రం గురించి ప్రస్తావించారు. అది ఒక పలుచటి వస్త్రం. దానిని సంప్రదాయం ప్రకారం ఏ రంగు లేని క్రీమ్ కలర్ ఉన్నితో నేస్తారు. దానిలో బహుశా నీలి రంగు పట్టీ లేదా దారాలతో త్రెడింగ్ చేసేవారు అని చెప్పారు.

ఏసుక్రీస్తు పాదరక్షలు

ఏసుక్రీస్తు పాదాల విషయానికి వస్తే ఆయన, పాదాలకు రక్షణగా బహుశా చెప్పులు ధరించేవారు. ఆ కాలంలో ప్రతి ఒక్కరూ చెప్పులు వేసుకునేవారు. ఎడారిలో డెడ్ సీ, మసాదా దగ్గర జీసస్ కాలానికి సంబంధించిన పాదరక్షలను గుర్తించారు.

అందుకే, ఏసుక్రీస్తు పాదరక్షలు ఎలా ఉండేవి అనేది మనకు తెలుసు, అవి చాలా సింపుల్‌గా ఉండేవి. అరికాలి కింద ఉండే భాగాన్ని మందపాటి చర్మంతో చేసేవారు. దానికోసం కొన్ని చర్మాలను కలిపి కుట్టేవారు. దాని పై భాగంలో చర్మంతో చేసిన దారాలు ఉండేవి. బొటన వేలి నుంచి తీసుకువచ్చి వాటిని పాదం వెనుక కట్టుకునేవారు.

ఏసు ముఖం

ఏసుక్రీస్తు ముఖం ఎలా ఉండేది. ఆయన ముఖంలో లక్షణాలు యూదుల్లాగే ఉండేవా. జీసస్ యూదేనా. పాల్ లేఖలతోపాటూ ఎన్నో గ్రంథాల్లో దీని గురించి పదే పదే ప్రస్తావించారు. హీబ్రూ పాలనలో రాసిన లేఖల్లో "మన దైవం యుదా నుంచి వచ్చాడనేది స్పష్టంగా తెలుస్తోంది" అని రాశారు. అయితే ఆ కాలంలో యూదు పురుషులు ఎలా ఉండేవారో మనం ఎలా ఊహించుకోగలం. ఆ సమయంలో ఒక 30 ఏళ్ల వ్యక్తి ముఖం ఎలా ఉండుంటుంది. (ల్యూక్ అధ్యాయం 3)

2001లో ఫోరెన్సిక్ ఆంథ్రపాలజిస్ట్ రిచర్డ్ నెవమ్ 'గెలీలియా'వాసి మోడల్ రూపొందించారు. ఆ మోడల్‌ను ఆయన ఒక బీబీసీ డాక్యుమెంటరీ కోసం రూపొందించారు. ఆ ప్రాంతంలో దొరికిన ఒక మనిషి పుర్రె ఆధారంగా దానిని తయారుచేశారు. ఆ ప్రాంతంలో వారు ఏసు అసలు లేనేలేరని భావిస్తారు.

రిచర్డ్ నెవమ్ గెలీలియావాసి మోడల్

కానీ, ఏసుక్రీస్తు ముఖం ఇలాగే ఉంటుందని ఆయన చెప్పలేదు. ఇది జీసస్ ముఖం గురించి ప్రజలకు ఉన్న ఊహల ప్రేరణతో తయారుచేశాను. క్రీస్తును ఆయన కాలానికి, ఆయన ప్రాంతానికి సంబంధించిన ఒక వ్యక్తి రూపంలోనే చూడాలని రిచర్డ్ చెప్పాలని అనుకున్నారు. ఎందుకంటే, ఆయన భిన్నంగా కనిపించేవారని మేం ఎప్పుడూ చెప్పలేదు.

పురాతన ఎముకల ఆధారంగా ఎన్ని మోడల్స్ తయారు చేసినా, నాకు తెలిసి ఏసుక్రీస్తు ముఖం ఎక్కువగా మూడో శతాబ్దానికి చెందిన డ్యూరా-యూరోపోస్‌ సెనెగాగ్‌లో ప్రస్తుతం గోడలపై ఉన్న మోజెస్ చిత్రాలను పోలి ఉంటుంది. గ్రీకు-రోమన్ ప్రపంచంలో ఒక యూదు సన్యాసి ఎలా ఉండేవాడో వాటిలో చూపించారు.

మోజెస్ ఎలాంటి రంగులు లేని దుస్తులు ధరిస్తారని భావించారు. ఒక డ్యూరాలో వేసిన మోజెస్ చిత్రంలో ఆయన బట్టల అంచులు ఉబ్బినట్లు కనిపిస్తాయి.

జీసస్ ఎలా కనిపించేవారు

జీసస్ గురించి ఉన్న ఈ మొత్తం ఊహలన్నింటినీ గమనిస్తే, బైజాంటియన్‌లో ఏ జీసస్ ముఖాకృతిని ఊహించారో, దానితో పోలిస్తే ఈ చిత్రం ఎక్కువ కచ్చితత్వంతో ఉన్నట్టు అనిపిస్తుంది. అయితే బైజాంటియన్ ఏసుక్రీస్తు చిత్రాన్నే ప్రామాణికంగా భావించారు.

జీసస్‌కు చిన్న గడ్డం, పొట్టి జుట్టు ఉంటుంది. ఆయన పొట్టి ట్యూనిక్ వేసుకునేవారు. పైన వేసుకునే దుస్తుల చేతులు పొట్టిగా ఉన్నాయి. ఆయన దానిపై చిన్న వస్త్రం కప్పుకుని ఉంటారు.

( జాన్ టేలర్ కింగ్స్ కాలేజీలో Christian Origins and Second Temple Judaism ప్రొఫెసర్‌గా ఉన్నారు. ఆయన The Essenes, the Scrolls and the Dead Sea రాశారు. )

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
The Galilean model was created in 2001 by forensic anthropologist Richard Newm. He created the model for a BBC documentary. It was made based on the skull of a man found in the area
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X