• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సముద్ర గర్భంలో అగ్నిపర్వతం పేలుడును శాటిలైట్లు ఎలా గుర్తించగలిగాయి?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
బూడిద మేఘం

శనివారం టోంగా సమీపంలోని దక్షిణ పసిఫిక్‌ సముద్రంలో నీటి అడుగున అగ్నిపర్వత విస్ఫోటనం జరిగినప్పుడు ఆ దృశ్యాలను శాటిలైట్లు గుర్తించగలిగాయి. ఇది ఎలా సాధ్యమైంది?

దీనికి కారణం ఉంది. భూమిని నిరంతరం పరిశీలించే అంతరిక్ష కేంద్రాల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈ శాటిలైట్లు భూమి మీద నిర్దిష్ట ప్రాంతాల మీద నిత్యం దృష్టి పెట్టి ఉంటాయి.

వాటి ద్వారా అందే డేటా భవిష్యత్ పరిశోధనలకు ఉపయోగపడుతుంది. తాజాగా టోంగా సమీపంలో ఏర్పడిన అగ్నిపర్వతానికి సంబంధించిన డేటా ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది.

ఇప్పటికే శాస్త్రవేత్తలు దీనిని విశ్లేషించే పనిలో ఉన్నారు.

ఈ ఉపగ్రహాలు సేకరించిన సమాచారం ఎమర్జెన్సీ రెస్పాన్స్ విభాగాలకు ఉపయోగపడుతుంది. సైంటిస్టులు అగ్నిపర్వతాలను అర్ధం చేసుకునే ప్రయత్నం చేయవచ్చు.

వాతావరణ ఉపగ్రహాలు

భూమికి 36,000 కి.మీ. (22,370 మైళ్లు) దూరంలో వాతావరణ వ్యవస్థలను పర్యవేక్షించే శాటిలైట్ల గ్రూప్ ఉంది. ప్రతి కొన్ని నిమిషాలకు ఒకసారి భూమిలో సగభాగాన్ని స్కాన్ చేస్తాయి.

https://twitter.com/simon_sat/status/1482412149897142284?s=20

తాజా వాతావరణాన్ని అంచనా వేస్తూ అవి ఎప్పటికప్పుడు ఫొటోలను, వీడియోలను భూమికి పంపిస్తాయి. ఈ ఉపగ్రహాలే టోంగా సమీపంలోని అగ్నిపర్వతం దృశ్యాలను రికార్డు చేశాయి.

https://twitter.com/CopernicusEU/status/1482656119038394370?s=20

విస్ఫోటనం సమయంలో బూడిద ఎక్కువగా విడుదల కావడం వల్ల అక్కడ ఏం జరుగుతుందో భూమి మీద ఉండి గుర్తించడం కష్టం. బూడిద ధూళిలోకి చొచ్చుకుపోయే రాడార్ సాంకేతికత ఉంటే తప్ప ఇది సాధ్యం కాదు.

యూరోపియన్ యూనియన్‌కు చందిన సెంటెనెల్-1ఏ శాటిలైట్ శనివారం నాడు అగ్నిపర్వతం మీదుగా ప్రయాణిస్తున్న సమయంలో పసిఫిక్ సముద్ర జలాలలో విస్ఫోటనం జరిగినట్లు గుర్తించింది.

రాడార్ పిక్చర్‌లను తరచూ గమనిస్తూ ఉండకపోతే వాటిని అర్ధం చేసుకోవడం కష్టం.

శాన్‌ఫ్రాన్సిస్కోకు చెందిన ప్లానెట్ కంపెనీ విడుదల చేసిన అగ్నిపర్వతం చిత్రాలను గమనించినప్పుడు, అందులో విస్ఫోటన జరగడానికి ముందు ఫొటోలు కూడా ఉన్నాయి.

పేలుడు జరగడానికి ముందు, తర్వాత దృశ్యలను పోల్చి చూసినప్పుడు దాని తీవ్రత ఎంతో అర్ధమవుతుంది.

https://twitter.com/Will4Planet/status/1482565187781550081?s=20

గ్లోబల్ షాక్ వేవ్

వెదర్ శాటిలైట్లు చిత్రీకరించిన అద్భుతమైన చిత్రాలలో కీలకమైనవి షాక్‌వేవ్ దృశ్యాలు. ఇవి విస్ఫోటనం తర్వాత అన్ని దిశలవైపు వేగంగా కదులుతున్న దృశ్యాలు కనిపిస్తాయి.

పేలుడు కారణంగా ఏర్పడిన పీడన తరంగం( ప్రెషర్‌వేవ్) భూగోళం మొత్తాన్ని కవర్ చేసింది.

వాతావరణం పై ఈ అగ్నిపర్వతం ప్రభావాన్ని సూచించే మరో మంచి ఉదాహరణ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ఏయోలస్ మిషన్ పంపి డేటాలో కనిపిస్తుంది.

https://twitter.com/metoffice/status/1482605906659622914?s=20


https://twitter.com/swshargi/status/1482471422618476547?s=20


ఈ శాటిలైల్ భూమి నుండి స్ట్రాటో ఆవరణలో 30 కిలోమీటర్ల ఎత్తు వరకు గాలులను అల్ట్రావయలెట్ లేజర్లను పంపడం ద్వారా కొలుస్తుంది.

అయితే ఏయోలస్ శాటిలైట్ పసిఫిక్ మీదుగా వెళుతున్నప్పుడు దాని లేజర్‌ను అగ్నిపర్వతం నుంచి వెలువడిన బూడిద మేఘాలు అడ్డుకున్నాయి.

ఈ లేజర్ లైట్ ద్వారా బూడిద మేఘాలు ఎంత ఎత్తులో ఉన్నాయన్నది గుర్తించే అవకాశం వచ్చింది.

శాటిలైట్ కెమెరాలకు చిక్కిన టోంగా అగ్నిపర్వతం పేలుడు

వాతావరణంపై ప్రభావం

అతి పెద్ద విస్ఫోటనాలు స్వల్పకాలానికి వాతావరణాన్ని చల్లబరుస్తాయి.

1991లో ఫిలిప్పీన్స్‌లోని మౌంట్ పినాటుబో విస్ఫోటనం కొన్ని సంవత్సరాల పాటు భూమి సగటు ప్రపంచ ఉష్ణోగ్రతను అర డిగ్రీకి తగ్గించింది.

అగ్నిపర్వతాలు పేలినప్పుడు దాని నుంచి భారీ ఎత్తున సల్ఫర్ డయాక్సైడ్‌ గాలిలో కలుస్తుంది. ఇది పొగ నీటితో కలిసి మంచు బిందువులుగా ఏర్పడుతుంది. ఇవి సూర్యుడి నుంచి వచ్చే రేడియేషన్‌ను అడ్డుకుంటాయి.

https://twitter.com/MikePRennie/status/1482655443545645058?s=20

యూరోపియన్ యూనియన్ సెంటినెల్ -5పి ఉపగ్రహం ఈ సల్ఫర్ డయాక్సైడ్ ఏ స్థాయిలో విడుదలైందో అంచనా వేయగలదు.

అయితే, తాజాగా వెలువడిన సల్ఫర్ డయాక్సైడ్ భూమి ఉష్ణోగ్రతపై ప్రభావం చూపే స్థాయిలో లేదని తాజా గణాంకాలు చెబుతున్నాయి.

https://twitter.com/ClimateOfGavin/status/1482461657309892609?s=20


https://twitter.com/simoncarn/status/1482612959104974848?s=20

నష్టం అంచనా

టోంగా ద్వీపాల సమూహానికి ఎంత నష్టం జరిగిందో ఇప్పుడే అంచనా వేయడం కష్టం. అక్కడ నివసిస్తున్న వారు బూడిదతోపాటు, సునామీ ప్రభావాన్ని కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది.

ఈ ప్రాంతంలోని అనేక ద్వీపాలపై ఈ పేలుడు ప్రభావాన్ని అంచనా వేయడం ద్వారా ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్‌లకు సహకరించేందుకు హై రిజల్యూషన్ ఉపగ్రహాలు పని చేస్తున్నాయి.

https://twitter.com/angelruizangulo/status/1482498845972078592?s=20


https://twitter.com/CopernicusEMS/status/1482676574159839233?s=20


https://twitter.com/StefLhermitte/status/1483008886286266370?s=20

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
How did the satellites detect a volcanic eruption in the seabed
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X