వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆశలు రేకెత్తిస్తున్న ఆక్స్‌ఫర్డ్ కరోనా వ్యాక్సిన్... మానవ శరీరంలో ఎలా పనిచేస్తుందో తెలుసా..

|
Google Oneindia TeluguNews

బ్రిటన్‌కు చెందిన ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ అభివృద్ది చేసిన ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ కరోనా చికిత్సకు ఆశాజనకంగా కనిపిస్తోంది. ప్రిలిమినరీ ట్రయల్స్‌లో 1000 మందిపై పరీక్షలుగా జరపగా మంచి ఫలితాలు కనిపించాయి. 18 ఏళ్ల నుంచి 55 ఏళ్ల వయసు లోపు వారిపై ఆస్ట్రాజెనెకా టీకాను ప్రయోగించగా... వాళ్లలో రోగ నిరోధక శక్తి గణనీయంగా పెరిగింది. దీంతో ప్రపంచమంతా ఆస్ట్రాజెనెకా కోసం ఎదురుచూస్తోంది.

Recommended Video

COVID-19 : గణనీయంగా పెరిగిన రోగ నిరోధక శక్తి.. ఆక్స్‌ఫర్డ్ కరోనా వ్యాక్సిన్ ఎలా పనిచేస్తుందంటే..!
వ్యాక్సిన్ ఎలా పనిచేస్తుంది...

వ్యాక్సిన్ ఎలా పనిచేస్తుంది...

చైనాకు చెందిన కాన్‌సినో బయోలాజిక్స్ అభివృద్ది చేస్తున్న వ్యాక్సిన్‌కు, ఆక్సఫర్డ్ ఆస్ట్రాజెనెకా(AZD1222) వ్యాక్సిన్‌కు చాలావరకు దగ్గర పోలికలున్నాయి. జన్యుపరంగా ఇంజనీరింగ్ చేసిన వైరస్‌లతో దీన్ని అభివృద్ది చేశారు. ఈ వైరస్‌లను అడెనోవైరల్ వెక్టార్స్ అని కూడా పిలుస్తారు. శరీరంలోకి వైరస్ ప్రవేశించిందని అంతర్గత వ్యవస్థలను నమ్మింపజేయడంలో ఈ వ్యాక్సిన్ ప్రభావవంతంగా పనిచేస్తుంది. దీంతో వైరస్‌తో పోరాడేందుకు శరీరంలోని కణాలు వాటి చుట్టూ స్పైక్ ప్రోటీన్లను ఏర్పరుచుకుంటాయి. ఈ టీకాలో చింపాంజీ అడెనోవైరస్ బలహీనమైన మరియు జన్యుపరంగా మార్పు చెందిన రూపంలో ఉంటుంది కాబట్టి అది మనుషులకు సోకదు. కానీ స్పైక్ ప్రోటీన్ల ఉత్పత్తిలో కీలకంగా వ్యవహరిస్తుంది.

సైంటిస్టులు ఏమంటున్నారు...

సైంటిస్టులు ఏమంటున్నారు...

కణాల చుట్టూ ఏర్పడిన స్పైక్ ప్రోటీన్లు శరీరంలోకి వచ్చే వైరస్‌ల పట్ల అప్రమత్తతో వ్యవహరిస్తుంటాయి. కరోనా వైరస్‌ ఇన్‌ఫెక్షన్లను గుర్తించి వాటితో పోరాడేందుకు అనుగుణంగా మన శరీరాన్ని సిద్దం చేస్తాయి. వ్యాక్సిన్ అభివృద్ది గురించి ఆక్స్‌ఫర్డ్ సైంటిస్టులు మాట్లాడుతూ... 'ఈ వ్యాక్సిన్ ప్రయోగించిన ప్రతీ ఒక్కరిలో రోగ నిరోధక ప్రతిస్పందన మెరుగైన స్థాయిలో ఉంది.' అన్నారు. శరీరంలోని T కణాలను కూడా వ్యాక్సిన్ ప్రభావం చేస్తుందని... కరోనా వైరస్‌తో పోరాడేందుకు ఇది ఉపయోగపడుతుందని చెప్పారు.SARS-CoV-2 ఇన్ఫెక్షన్‌ను ఎదుర్కోవడంలో T కణాలతో పాటు యాంటీ బాడీస్ కీలకంగా వ్యవహరిస్తాయని చెప్పారు.

రోగ నిరోధక శక్తి పెరుగుదల...

రోగ నిరోధక శక్తి పెరుగుదల...

వ్యాక్సిన్ తీసుకున్న 14 రోజుల్లో పేషెంట్లలో T కణాల సంఖ్య బాగా పెరిగినట్లు గుర్తించామని ఆక్స్‌ఫర్డ్ సైంటిస్టులు తెలిపారు. అలాగే 28 రోజుల్లో యాంటీబాడీస్ పెరిగినట్లు తెలిపారు. గత మూడు దశాబ్దాలుగా ఎన్నో రకాల ప్రభావవంతమైన వ్యాక్సిన్ల తయారీలో అడెనోవైరస్ వైక్టార్స్‌ను ఉపయోగించారు. ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌ను ఎదుర్కొనే వ్యాక్సిన్ తయారీ కోసం కూడా దీన్ని పెద్ద ఎత్తున పరీక్షిస్తున్నారు.

స్వల్పకాలిక సైడ్ ఎఫెక్ట్స్...

స్వల్పకాలిక సైడ్ ఎఫెక్ట్స్...

ఆస్ట్రాజెనెకా ట్రయల్స్ సందర్భంగా టీకా తీసుకున్న 60శాతం మందిలో స్వల్ప జ్వరం,తలనొప్పి,కండరాల నొప్పి వంటి లక్షణాలు కనిపించాయి. అయితే ఇవి ప్రమాదకర స్థాయిలో లేవని,త్వరగానే పరిష్కరించబడుతాయని సైంటిస్టులు ధీమాగా చెబుతున్నారు. ప్రస్తుతం మొదటి దశ ట్రయల్స్ విజయవంతంగా పూర్తవగా... వ్యాక్సిన్ అందుబాటులోకి రావాలంటే రెండో,మూడో దశ ట్రయల్స్ కూడా పూర్తి కావాల్సి ఉంటుంది. ఇందుకోసం దాదాపు 10వేల మందిపై పరీక్షలు జరపనున్నారు. ఇది సత్ఫలితాలినిస్తే ఈ ఏడాది చివరి నాటికల్లా వ్యాక్సిన్ అందరికీ అందుబాటులోకి వస్తుందని చెబుతున్నారు.

English summary
Oxford University's vaccine candidate is made with genetically engineered viruses. These viruses are also called adenoviral vectors. The job of a vaccine is to trick our body into believing that a foreign pathogen has entered the body, and will cause disease if not taken care of.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X