వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చైనాకు డొక్లామ్ దెబ్బ: వేగంగా మార్పులు, భారత్‌కు జపాన్ బుల్లెట్ ట్రెయిన్

భారత్‌, చైనాల మధ్య రెండు నెలలకు పైగా డొక్లామ్ వివాదం నెలకొంది. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో డొక్లామ్ అంశం రాజకీయ, వాణిజ్య పరిణామాలను వేగంగా మార్చుతోంది.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: భారత్‌, చైనాల మధ్య రెండు నెలలకు పైగా డొక్లామ్ వివాదం నెలకొంది. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో డొక్లామ్ అంశం రాజకీయ, వాణిజ్య పరిణామాలను వేగంగా మార్చుతోంది.

చదవండి: చైనాకు భారత్ 'ఎక్స్‌ట్రా' షాక్, డ్రాగన్ కంపెనీల ఆస్తులు అమెరికా సీజ్

ఈ నెల 14న జపాన్ ప్రధాని షింజో ఎబె భారత్ రానున్నారు. భారత్ - చైనా సరిహద్దు వివాదం ప్రభావం ఈ పర్యటనలో స్పష్టంగా కనిపించనుంది. ముంబై, అహ్మదాబాద్‌ బుల్లెట్‌ రైల్‌ ప్రాజెక్టు గురించి ఆయన భారత పర్యటనకు వస్తున్నారు.

చదవండి: 69వ ఆవిర్భావ దినం: అందరికీ భిన్నంగా ఉ.కొరియా మరో క్షిపణి ప్రయోగం?

చైనాను కాదని, భారత్‌లో మరిన్ని ప్రాజెక్టులు

చైనాను కాదని, భారత్‌లో మరిన్ని ప్రాజెక్టులు

భారత్‌, జపాన్‌ ఇంతకు ముందే ఈ ప్రాజెక్టుపై ఒప్పందం చేసుకున్నాయి. సిక్కిం సరిహద్దులో 73 రోజులు కొనసాగి, ముగిసిన డోక్లామ్‌ వివాదం నేపథ్యంలో చైనాను కాదని జపాన్‌ మన దేశంలో మరిన్ని ప్రాజెక్టులు దక్కించుకొనే అవకాశముంది.

ట్రైన్ ప్రాజెక్టుల్లో పోటాపోటీ

ట్రైన్ ప్రాజెక్టుల్లో పోటాపోటీ

బుల్లెట్‌ రైల్‌ నిర్మాణంలో చైనా, జపాన్‌ మధ్య తీవ్ర పోటీ ఉంది. గత ఏడాది జపాన్‌ను వెనక్కి నెట్టి ఇండోనేషియా ప్రాజెక్టును చైనా దక్కించుకొంది. ఇప్పుడు సింగపూర్‌-కౌలాలంపూర్‌ హైస్పీడ్‌ రైలుపై పోటీ నెలకొంది. థాయ్‌లాండ్‌ ఇప్పటికే చైనాతో రెండు ఒప్పందాలు చేసుకొంది. థాయ్‌లాండ్ - మలేషియా హైస్పీడ్ రైల్ లింక్ కోసం చైనా, జపాన్‌లు పోటీ పడుతున్నాయి.

చైనా కంటే జపాన్ బుల్లెట్ రైలు సురక్షితం

చైనా కంటే జపాన్ బుల్లెట్ రైలు సురక్షితం

చైనాతో పోలిస్తే జపాన్‌ బుల్లెట్‌ రైలు ఎంతో సురక్షితం. అదే సమయంలో ప్రియం కూడా. కఠిన సవాళ్లను ఎదుర్కోవడంలో చైనాకు మంచి అనుభవముంది.

జపాన్‌లో ప్రమాదాల్లేవు

జపాన్‌లో ప్రమాదాల్లేవు

బ్లూమ్‌బర్గ్‌ నివేదిక ప్రకారం నాణ్యతలో జపాన్‌కు తిరుగులేదు. 50 ఏళ్ల చరిత్రలో ఒక్క ప్రమాదం కూడా జరగలేదు. పరికరాలు త్వరగా పాడవవు. మరమ్మతు ఖర్చులు కూడా తక్కువ.

భారత్ ప్రాజెక్టులపై చైనా కలలు, జపాన్ వైపు మనం మొగ్గు

భారత్ ప్రాజెక్టులపై చైనా కలలు, జపాన్ వైపు మనం మొగ్గు

వీటన్నిటికీ తోడు డోక్లామ్‌ నేపథ్యంలో భారత్‌ సహజంగానే జపాన్‌ వైపు మొగ్గు చూపుతోంది. మరిన్ని ప్రాజెక్టులు వారికి అప్పగించేందుకు సిద్ధపడుతున్నట్టుగా తెలుస్తోంది. వేగంగా ఎదుగుతున్న భారత్‌లో చాలా ప్రాజెక్టులపై చైనా ఆశలు పెట్టుకొంది. కానీ దాని ఆశలు అడియాసలుగా మారనున్నాయి.

చైనాకు ఇది మింగుడుపడట్లేదు

చైనాకు ఇది మింగుడుపడట్లేదు

నౌకాయానం, సైనిక సహకారంలో జపాన్‌, భారత్‌ మరింత దగ్గరవుతుండటం చైనాకు ఇబ్బందిగా మారింది. ప్రధాని నరేంద్ర మోడీ చైనా పర్యటన తర్వాత షింజో అబే భారత్‌కు రావటం గమనార్హం.

English summary
Japanese Prime Minister Shinzo Abe's visit to India on September 14 will reflect the fast-changing equations in the Asia-Pacific after Doklam.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X