వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'ఆ ఆస్టరాయిడ్ ఢీకొట్టి ఉంటే.. ఓ ఖండమే నాశనమయ్యేది'

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: 2018 జీఈ3 అనే ఓ ఆస్టరాయిడ్‌ గత ఆదివారం భూమికి అతి దగ్గరగా వచ్చినట్టు నాసా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆరోజు తెల్లవారుజామున 2.41గం. సమయంలో 2018జీఈ భూమికి కేవలం 119,500మైళ్ల దూరం నుంచి వెళ్లినట్టు చెబుతున్నారు.

Asteroid

ఓ ఫుట్‌బాల్‌ మైదానమంత సైజు ఉన్న ఆ ఆస్టరాయిడ్‌ వ్యాసార్థం 157 నుంచి 361 అడుగులు ఉంటుందని అంచనా వేస్తున్నారు. 2013లో రష్యాలో పడ్డ ఆస్టరాయిడ్ కంటే ఇది చాలా పెద్దదని చెబుతున్నారు. అయితే ఇంత విశాల విశ్వంలో ఫుట్‌బాల్‌ మైదానమంత సైజు ఉన్న ఆస్టరాయిడ్‌ ఒక చిన్న కొండ లాంటిది మాత్రమేనని వారు అభిప్రాయపడుతున్నారు.

ఈ ఆస్టరాయిడ్‌ గనుక భూమిని ఢీకొట్టి ఉంటే.. ఓ ఖండమంతా నాశనమయ్యేదని స్పేస్‌ వెబ్‌సైట్‌ వెల్లడించడం గమనార్హం. గంటకు లక్ష కిలోమీటర్ల వేగంతో ఇది దూసుకెళ్లిందని శాస్త్రవేత్తలు గుర్తించారు. భూమి వైపు దూసుకొచ్చిన ఈ ఆస్టరాయిడ్ ను దాని రాకకు కేవలం 21గం. ముందే అరిజోనాలోని నాసా శాస్త్రవేత్తలు గుర్తించారు.

English summary
Earth received a cosmic close shave on Sunday (April 15) when a football field-size boulder passed by at half the moon's distance from our planet. Named 2018 GE3, the asteroid was detected only a few hours before its flyby, spotted by the automated Catalina Sky Survey.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X