హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఐసిస్ షాకింగ్: భార్యల్ని ఎలా ఉపయోగించుకుంటారు?

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఇస్లామిక్ స్టేట్ లేదా ఐసిస్ ఉగ్రవాదంలో మహిళల పాత్ర వివిధ రకాలుగా ఉంటుంది. అలాంటి ఐసిస్‌ వైపు కొంతమంది యువతులు ఆకర్షితులవుతున్నారు. గతంలో హైదరాబాద్ నుంచి ఇద్దరు యువతులు ఐసిస్‌లో చేరేందుకు ప్రయత్నించి పట్టుబడ్డారు.

హైదరాబాద్ నుంచి లేదా మన దేశం నుంచే కాకుండా వివిధ దేశాలలో యువతులు ఐసిస్ వైపు ఆకర్షితులవుతున్నారు. ఐసిస్‌లో మహిళల పాత్ర ఎక్కువగా సెక్స్ బానిసలు లేదా ఐసిస్ కుటుంబ విస్తరణకు ఉపయోగించుకుంటారని తెలుస్తోంది.

ఐసిస్ పట్ల ఆకర్షితులయ్యే మహిళలను వివిధ రకాలుగా ఉపయోగించుకుంటారని చెబుతున్నారు. అందులో భాగంగా ఐసిస్‌కు మహిళలు మరో రకంగా కూడా సాయం చేస్తున్నట్లుగా వెలుగుచూస్తోంది.

How ISIS is using wives of its recruits to raise funds

తమతో చేరే పురుషులకు... ఐసిస్ ఉగ్రవాదులు ఓ సూచన చేస్తారని తెలుస్తోంది. మీ భార్యలను ఐసిస్‌కు ఉపయోగపడేలా చేయాలని చెబుతారట. అలా ఐసిస్ ఉగ్రవాదుల సూచనల మేరకు అందులో చేరిన పురుషులు.. తమ భార్యలకు నిధులు సమీకరించాలని సూచిస్తారు.

దీంతో ఆ మహిళలు నిధుల సేకరణ కోసం తమవంతు ప్రయత్నాలు చేస్తారు. సాధారణంగా ఐసిస్ అయిల్ బావులు తమ ఆదీనంలో ఉంచుకోవడం ద్వారా, ప్రాచీన వస్తువులను తదితరాలను టార్గెట్ చేయడం ద్వారా నిధులను సేకరించుకుంటాయి.

అయితే, ఈ నిధులు ఇరాక్ - సిరియాలోని ఐసిస్ యుద్ధానికే సరిపోతున్నాయి. మిగతా దేశాలకు విస్తరించేందుకు అవి పూర్తిగా సరిపోవడం లేదు. ఈ నేపథ్యంలో విస్తరించే ప్రతిచోట నిధుల వేట కూడా సాగిస్తున్నారు. నిధుల సేకరణ కోసం ప్రత్యేకంగా కూడా ఐసిస్‌లో చేర్చుకుంటున్నారు.

సిరియా - ఇరాక్‌లలో యుద్ధానికి ఐసిస్‌కు పెద్ద మొత్తంలో అవసరమని, అందుకే తాము సేకరించిన దానిని ఇతర దేశాలకు మళ్లించలేకపోతుందని తెలుస్తోంది. ఓ వైపు పురుషులు రిక్రూట్మెంట్, యుద్ధంలో బిజీగా ఉంటే, మహిళలను నిధుల సేకరణ కోసం కూడా వినియోగిస్తున్నారు.

పాకిస్తాన్‌లోని ఓ పత్రికలో వచ్చిన కథనం ప్రకారం... ఐసిస్‌తో సంబంధాలున్న పురుషుల భార్యలను లేదా మహిళలను బాగా డబ్బులున్న మహిళల వద్దకు విరాళాల కోసం పంపిస్తుంటారు. వారు ఫెయిత్ అకాడమీ అని చెప్పి ఐసిస్ కోసం నిధులు సేకరిస్తుంటారు.

ఆ మహిళలు తాము సేకరించిన డబ్బును తమ భర్తలకు ఇస్తారు. ఆ భర్తలు ఐసిస్ ఉగ్రవాద కార్యకలాపాలకు వాటిని వినియోగిస్తారు. అయితే, ఇలాంటి విషయం ఇప్పటి వరకు భారత్‌లో వెలుగు చూడలేదని తెలుస్తోంది. అయితే, పోలీసులు ఓ కన్నేసి మాత్రం ఉంచుతున్నారు.

English summary
The role of a woman in a terrorist organisation has often been spoken about. In India we got to witness an incident in which two girls from Hyderabad were trying to leave the country in a bid to join the ISIS.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X