వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మారిన ఇండియన్ విద్యార్థుల రూట్.. అమెరికా కంటే కెనడా బెస్ట్

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : వలస చదువుకు హద్దులు..ఎల్లలనేవి ఉండవు. ఏ దేశంలో చదువుకుంటే.. ఆ దేశంలో తమకు ఉపాధి దొరుకుతుందో.. అటువైపు విద్యార్థులు ఆసక్తి చూపటం సహజం. ఏండ్ల తరబడి ఎలాంటి ఇబ్బందులు లేక పోవటంతో అమెరికాలో చదువులపై నే భారతీయ యువతరం దృష్టిపెట్టింది. ప్రధానంగా మోడీ సర్కారు అధికారంలోకి వచ్చాక, స్వదేశంలో ఉపాధి అవకాశాలు సన్నగిల్లటానికి తోడు మరో వైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ తీసుకున్న వలస వ్యతిరేక విధానాలు అక్కడ చదువునే అవకాశాలను దెబ్బతీశాయి.

దీంతో మరో వలసదేశమైన కెనడాపై చూపు పడింది. అమెరికాలో వర్క్‌పర్మిట్‌ వీసాలపై వెళ్తున్నవారితో పాటు విదేశీ విద్యార్థులపై ఆ దేశాధ్యక్షుడు ట్రంప్‌ కఠిన వైఖరి అనుసరిస్తున్నారు. ట్రంప్‌ విధానాలతో భారతీయ విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

 అమెరికా కంటే కెనడా మేలని విద్యావేత్తల అభిప్రాయం

అమెరికా కంటే కెనడా మేలని విద్యావేత్తల అభిప్రాయం

పూటపూటకో కొత్త నిబంధన ప్రవేశపెడుతున్న తీరుతో.. అమెరికాలో చదువుకుంటున్న భారతీయ విద్యార్థులను, ఉద్యోగులు భయాందోళనకు గురవుతున్నారు. దీనికి అమెరికా ఉద్యోగాల్లో స్థానిక యువతకే తొలి ప్రాధాన్యం అని పేర్కొనడమే ప్రధాన కారణం. నైపుణ్యం ఉన్న విదేశీయుల సేవలను మాత్రమే వినియోగించుకుంటామని అమెరికా అదికారులు ఊదరగొడుతున్నారు. ఈ నేపథ్యంలో ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్లే బదులు కెనడాకు వెళ్లడమే సముచితం అని భారతీయ విద్యార్థులు అభిప్రాయపడుతున్నారు. ఇదే విషయాన్ని న్యూఢిల్లీలోని కెనడా హై కమిషన్‌, యూఎస్‌ ఎంబసీ లు ధ్రువీకరించాయి. ఏడాది క్రితమే న్యూఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయానికి వచ్చిన కెనడా దౌత్యవేత్త ఒకరు.. అమెరికా ఎంబసీ అధికారులతో మాట్లాడుతూ భారతీయ విద్యార్థులు ఎందుకు ఉన్నత విద్యావకాశాల కోసం కెనడాను ఎంచుకుంటున్నారో వివరించారు. శాశ్వత సభ్యత్వం, పౌరసత్వం కోసం భారతీయులు కెనడాను ఎంచుకోవడానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అనుసరిస్తున్న కఠినమైన ఇమ్మిగ్రేషన్ పాలసీ కారణమని చెప్తున్నారు. ఇది 2017 చివరిలో వాస్తవ రూపం దాలుస్తుందని పేర్కొన్నారు.

భారతీయ విద్యార్థులకు ఉన్నత విద్యా కేంద్రం కెనడా

భారతీయ విద్యార్థులకు ఉన్నత విద్యా కేంద్రం కెనడా

అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్‌ ప్రమాణం చేసినప్పటి నుంచి అమెరికాకు వెళ్తున్న విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయిందని న్యూయార్క్‌లోని ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంటర్నెషనల్‌ ఎడ్యుకేషన్‌ (ఐఐఈ ) సంస్థ పేర్కొన్నది. ఆ సంస్థ వెల్లడించిన తాజా నివేదిక ప్రకారం 2015-16లో ఎఫ్‌-1 వీసాల కోసం 62,537 మంది దరఖాస్తు చేసుకోగా, 2016-17లో కేవలం 52,281 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. అమెరికాలో చదువుకునేందుకు వెళ్తున్న భారతీయ విద్యార్థుల సంఖ్య క్రమక్రమంగా తగ్గిపోతున్నది. అయితే, కెనడాలో ఉన్నత చదువు కోసం 2015లో 39,525 మంది, 2016లో 39,790 మంది, గతేడాది 2017 41,805 మంది దరఖాస్తు చేసుకున్నారు.

అమెరికాపై మనస్సు మార్చుకున్న భారత విద్యార్థులు

అమెరికాపై మనస్సు మార్చుకున్న భారత విద్యార్థులు

ఉన్నత విద్య కోసం కెనడాకు వెళ్తున్న భారతీయ విద్యార్థుల సంఖ్య మూడేండ్ల నుంచి క్రమక్రమంగా పెరుగుతూ వస్తున్నది. కెనడాలో ఉన్నత విద్యా ప్రమాణాలు, సౌకర్యాలు, త్వరితగతిన అర్హులకు వీసాలు మంజూరు కావడమే ఇందుకు ప్రధాన కారణం. 2016-17లో అమెరికాలో చదువుకునేందుకు 1,86,267 మంది భారతీయ విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. అయితే, వారిలో దాదాపు లక్ష మంది దరఖాస్తు చేసుకున్న తర్వాత నిర్ణయాన్ని మార్చుకున్నారు. అమెరికా ప్రయాణాన్ని రద్దు చేసుకున్నారు. ట్రంప్‌ విధానాలతో భారతీయ విద్యార్థుల్లో గందరగోళ పరిస్థితి నెలకొనడమే దీనికి ప్రధాన కారణం. 2015 - 16లో కేవలం 1.3 శాతం మంది విద్యార్థులు మాత్రమే తగ్గితే 2016 - 17లో అమెరికాలోని 500కి పైగా కాలేజీలు, యూనివర్సిటీల్లో కొత్తగా పేర్లు నమోదు చేసుకున్న విద్యార్థులు ఏడు శాతం తగ్గారు. అమెరికాతో పోలిస్తే ఫీజులు కూడా కెనాడలో 30 నుంచి 40 శాతం తక్కువగా ఉంటాయి. అగ్రశ్రేణి కాలేజీల్లో కూడా ఈ పరిస్థితి నెలకొంది.

 భారత్ ఓపీటీ విద్యార్థులకు అమెరికా ఇమ్మిగ్రేషన్

భారత్ ఓపీటీ విద్యార్థులకు అమెరికా ఇమ్మిగ్రేషన్

ఇపుడు చాలా మంది కెనడాలో ఉన్నత విద్య పూర్తి చేయాలని దరఖాస్తు చేసుకొని వెళ్లారు. 2016లో స్టడీ పర్మిట్‌ వీసాలపై 52,870 మంది భారతీయ విద్యార్థులు కెనడాకు వెళ్లారు. 2017లో 54,425 మంది వెళ్లారు. కెనడాకు వెళ్తున్న భారతీయ విద్యార్థుల సంఖ్య ప్రతీ ఏడాది పెరుగుతున్నది. అమెరికాలో ఉన్నత చదువులు పూర్తి చేసుకున్న విద్యార్థులంతా ఆప్షనల్‌ ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌ విధానం (ఓపీటీ ) ప్రకారం అమెరికాలోనే ఉండిపోతున్నారు. ట్రంప్‌ సర్కార్‌ తాజాగా తీసుకొచ్చిన హెచ్‌-1బీ వీసా నిబంధనల కారణంగా ఓపీటీ ప్రకారం అమెరికాలో ఉంటున్న భారతీయ విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదిలా ఉండగా, నైపుణ్యం గల భారతీయ విద్యార్థులకు కెనడా స్వర్గధామంగా మారింది.

కెనడాలో రెసిడెన్స్ హోదా పెరుగుతున్న భారతీయులు

కెనడాలో రెసిడెన్స్ హోదా పెరుగుతున్న భారతీయులు

స్టెమ్‌ (సైన్స్‌, టెక్‌, ఇంజినీరింగ్‌, మ్యాథమెటిక్స్‌) విధానం ద్వారా నైపుణ్యం ఉన్న భారతీయ విద్యార్థులకు కెనడాలో మంచి ఉద్యోగాలు లభిస్తున్నాయి. కెనడాలో స్థిరపడిపోవాలనుకునే భారతీయ విద్యార్థులకు ఉద్యోగావకాశాలు కల్పించడంతో పాటు శాశ్వత పౌరసత్వం కల్పిస్తున్నది. 2015లో 1,170 మంది, 2016లో 2,360 మంది, 2017లో 7,120 మందికి కెనడా పర్మినెంట్‌ రెసిడెన్స్‌ స్టేటస్‌ లభించింది. ట్రంప్‌ విధానాలతో విసిగిపోయిన భారతీయ విద్యార్థులు కెనడాలో ఉన్నత విద్యను అభ్యసించి ఉద్యోగాలు చేయాలని భావిస్తున్నారు. ఉత్తర అమెరికాలో కెనడా ఇక ముందు భారతీయ విద్యార్థులు అత్యధికంగా ప్రాధాన్యం ఇస్తారని ఏడాది ముందే సంకేతాలు అందాయి.

English summary
At a breakfast event at the US Embassy in New Delhi on November 9, 2016, a senior diplomat from the Canadian High Commission discreetly fielded questions on whether more Indians would opt for permanent residence and citizenship in his country, with the new US President Donald Trump taking a hard line on immigration. Fast forward to the winter of 2017 and that trend seems to be becoming a reality. Canada is fast emerging as the preferred destination in North America.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X