వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కళ్లు తిరిగే వేతనం: అమెరికా అధ్యక్షుడి రాజభోగాలు ఇలా!

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: ఇప్పుడు ప్రపంచం అమెరికా వైపు చూస్తోంది. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ అవుతారా లేక హిల్లరీ క్లింటన్ విజయం సాధిస్తారా అని ఎదురు చూస్తోంది. హిల్లరీ వైపే ఎక్కువ మొగ్గు కనిపిస్తోంది. అమెరికా ప్రెసిడెంట్ అంటేనే గౌరవం, రాజభోగాలు ఉంటాయి.

అమెరికా ప్రెసిడెంట్ వార్షిక వేతనం 4,00,000 డాలర్లు. మన రూపాయల్లో రూ.2 కోట్ల 66 లక్షల 84 వేల 180. ఈ లెక్కన నెలకు రూ.ఇరవై రెండు లక్షలకు పైగా ఉంటుంది. వీటితో పాటు ఇతర ఖర్చులు కూడా ఉంటాయి. 50వేల డాలర్లతో ఏడాది వ్యయ ఖర్చులు, అదనంగా ప్రయాణాలకు 1,00,000 డాలర్లు, వినోదానికి 19,000 డాలర్లు ఉంటాయి.

How much does the U.S. president make a year?

ప్రెసిడెంట్‌కు 18 ఎకరాల గ్రీన్ గ్రౌండ్ లేదా ప్రయివేటు పూల్ ఉంటుంది. 55వేల చ.అ. విస్తీర్ణంలో విస్తరించిన విశాలమైన వైట్ హౌస్‌లో 132 గదులు ఉంటాయట. ఆ గదులన్నీ ఎప్పుడు పూల వాసనలు వెదజల్లుతాయట. వైట్ హౌస్ ఏడాది వ్యయం 4 మిలియన్ డాలర్లకు పైగానే ఉంటుంది.

అధ్యక్షుడి కోసం ప్రత్యేకంగా 747 - 200 బీ జెట్స్‌ ఉంటాయట. వాటిలో సూపర్ లగ్జరీ, ఆఫీస్, కాన్ఫరెన్స్, బాత్రూం, జిం, బెడ్ రూంలు ఉంటాయి. ఎయిర్ ఫోర్స్ అంచనా ప్రకారం ఒకసారి గంటసేపు విమానం గాలిలో ఎగిరితే 2,10,877 డాలర్ల ఖర్చు అవుతుందట.

English summary
How much does the U.S. president make a year?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X