వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీకి హిందీలో ఇజ్రాయెల్ ప్రధాని, అడ్డుకోవాలని.. పాక్ మీడియా గగ్గోలు

ఇజ్రాయెల్‌లో మూడు రోజుల ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన భార‌త ప్ర‌ధాని మోడీకి ఆ దేశ ప్ర‌ధాన‌మంత్రి ఘ‌న‌స్వాగ‌తం పలికారు. ప్రధానికి వెల్ కం కార్యక్రమంలో ఇజ్రాయెల్ ప్రధాని నేతన్యాహు హిందీలో మాట్లాడి, ఆశ్చర్యపరిచార

|
Google Oneindia TeluguNews

కరాచీ: ఇజ్రాయెల్‌లో మూడు రోజుల ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన భార‌త ప్ర‌ధాని మోడీకి ఆ దేశ ప్ర‌ధాన‌మంత్రి ఘ‌న‌స్వాగ‌తం పలికారు. ప్రధానికి వెల్ కం కార్యక్రమంలో ఇజ్రాయెల్ ప్రధాని నేతన్యాహు హిందీలో మాట్లాడి, ఆశ్చర్యపరిచారు.

చదవండి: 70 ఏళ్లుగా ఇజ్రాయెల్ వెయిటింగ్, మోడీ అడుగు: చైనా దూకుడు ఎఫెక్ట్..

ఆప్ కా స్వాగత్ హై మేరా దోస్త్ అంటూ మోడీకి స్వాగతం పలికారు. భారత్ అంటే తమకు ఎనలేని అభిమానం అన్నారు. భారత సంస్కృతి, చరిత్ర, ప్రజాస్వామ్యం, అభివృద్ధి తమను ఎంతో ఆశ్చర్యానికి గురి చేశాయన్నారు. ఇరు దేశాల భాగస్వామ్యం విజయవంతమవుతుందన్నారు.

మరోవైపు, మోడీ ఇజ్రాయెల్‌ పర్యటనపై పాకిస్థాన్‌ మీడియా ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. పాకిస్థాన్ విశ్లేషకులు పలు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. తమ సైన్యాన్ని ఎదుర్కొనేందుకే భారత్ ప్రణాళికలు వేసుకుంటోందని పేర్కొంటున్నారు.

How Pakistani media reported on PM Modi’s visit to Israel

దౌత్యపరంగా భారత్ చేస్తోన్న ప్రయత్నాలను అడ్డుకోకపోతే తమ దేశానికి కష్టాలు తప్పవని వాపోతున్నారు. పాకిస్థాన్‌లోని ఆంగ్ల, ఉర్దూ పత్రికలు మోడీ పర్యటన గురించే ప్రధానంగా కథనాలు ప్రచురించాయి.

ఇజ్రాయెల్‌లో భారత ప్రధాని మోడీ తొలిసారిగా పర్యటిస్తున్నారని పతాక శీర్షికల్లో ప్రచురించాయి. పాకిస్థాన్‌ను ఎదుర్కోవడానికి ఇజ్రాయెల్, భారత్ ఏక‌మ‌వుతున్నాయ‌ని పేర్కొన్నాయి.

ఓ ప‌క్క‌ హిందూ జాతీయవాదం, మ‌రో ప‌క్క‌ యూదుల జాతీయవాదం మధ్య దగ్గర పోలికలు ఉంటాయని సెక్యూరిటీ నిపుణుడు బ్రిగ్‌ ఘజాన్ఫర్‌ అలీ వ్యాఖ్యానించారు.

చదవండి: మోడీకి అరుదైన గౌరవం, ఇజ్రాయెల్ పుష్పానికి మోడీ పేరు

ఆయా దేశాలు త‌మ త‌మ‌ జాతీయ ప్రయోజనాలపై ఎక్కువగా దృష్టి పెట్ట‌డంతో త‌మ దేశ‌ భద్రతపై అధికంగా ప్రభావం చూపుతుంద‌ని పేర్కొన్నారు.

మరోవైపు ఇజ్రాయెల్‌తో సౌదీ అరేబియా కూడా స‌త్సంబంధాలు నెల‌కొల్పుకుంటోంద‌ని, అదే ‌కనుక‌ జరిగితే త‌మ దేశం ఇబ్బందుల్లో పడుతుందన్నారు. భారత్‌ రక్షణాత్మకంగా తీసుకుంటున్న ఈ చ‌ర్య‌ల‌ను ఎలాగైనా అడ్డుకోవాల్సి ఉంద‌న్నారు.

English summary
Prime Minister Narendra Modi’s visit to Israel is historic for many reasons. The fact that he is the first ever Indian Prime Minister to visit Israel and will not pay a visit to Ramallah, detouring from the customary practices, has created a lot of buss. And Pakistani media is covering Modi’s Israel visit at great length. They are also attaching a great deal of importance to defence deals between the two countries.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X