వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మాఫియా సురక్షిత పెట్టుబడి వేదిక ‘లాస్ వేగాస్’!

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

లాస్‌వేగాస్‌: ఎడారి నగరం లాస్‌వేగాస్‌. సంగీత కచేరీలపై దాడులకు కేంద్రంగా లాస్ వేగాస్ సిటీ నిలుస్తోంది. అమెరికా చరిత్రలోనే కనీసం 59 మంది మరణించడంతోపాటు 527 మంది గాయ పడ్డారు. అంతేకాదు కాల్పులకు దిగిన దుండగుడు తనకు తాను ఆత్మాహుతి చేసుకున్నాడు. ఈ కాల్పులతో దాదాపు 22 వేల మందికి పైగా సంగీత ప్రియులు ప్రాణాలు రక్షించుకునేందుకు కేకలు వేస్తూ పరుగులు తీయాల్సిన దుస్థితి నెలకొన్నది. అసలు లాస్ వేగాస్ సిటీ నేపథ్యం ఏమిటి? దీని చరిత్ర ఎప్పటి నుంచి మొదలైందన్న సంగతి పరిశీలనార్హం.

అమెరికా మధ్యభాగంలో నెవెడా రాష్ట్ర కొండల మధ్య ఎడారిలో 1905లో చిన్న పట్టణంగా పురుడు పోసుకున్న సిటీ లాస్‌వేగాస్‌. అంతకుముందు 1821లో మెక్సికో, కాలిఫోర్నియా మధ్య రవాణా మార్గం కనుక్కొనే ప్రయత్నంలో ఓ యూరోపియన్‌ తొలిసారి ఇక్కడికొచ్చారు. ఆ తర్వాత 80 ఏళ్లు ఎడారిగానే ఉండిపోయింది. 1848లో ఈ ప్రాంతం మెక్సికో నుంచి అమెరికా పాలనలోకి వచ్చింది. 1855లో స్థానిక గిరిజనులకు ఇక్కడ ఆవాసం ఏర్పాటు చేస్తే కోట కట్టుకున్నారు. కొన్నాళ్లకు ఉండలేక పారిపోయారు. ఒక ఎస్టేట్‌ యజమాని ఆ కోటలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. 'లాస్‌వేగాస్‌ రాంచ్‌' అని పేరు పెట్టుకున్నారు. మొదట్లో ఎస్టేట్‌ యజమానులు, రైల్‌ రోడ్‌ కార్మికులు మాత్రమే ఉండేవారు. 1905లో రైల్‌ రోడ్‌ కంపెనీ ఇక్కడ రియల్‌ ఎస్టేట్‌ ప్లాట్లు వేసింది.

 చీకటి ప్రపంచానికి స్థావరంగా..

చీకటి ప్రపంచానికి స్థావరంగా..

1911లో లాస్‌వేగాస్‌ కార్పొరేషన్‌ ఏర్పడింది. విశృంఖలత్వానికి ఈ నగరం మారుపేరుగా మారింది. పశ్చిమ తీరంలోని చీకటి ప్రపంచానికి ఇది స్థావరంగా తయారైంది. జూదం, వ్యభిచారం, తదితర వినోద కార్యక్రమాలే ప్రధాన వ్యాపకం. కేవలం వందేళ్ల చరిత్ర గల ఈ నగరానికి ప్రపంచం నలు మూలల నుంచి కోట్ల మంది పర్యాటకులు వచ్చి లక్షల కోట్ల డాలర్లు కుమ్మరిస్తారు. డ్రగ్స్‌, దొంగ వ్యాపారాల్లో సంపాదించిన మొత్తాలను ఇక్కడే కాసినోలు, వడ్డీ వ్యాపారాల్లో పెట్టేవారు. కాసినోలు ఇచ్చే కారుచౌక రుచుల కోసం, ఆనందాల కోసం ఇతర ప్రాంతాల జనం కూడా పడి చచ్చేవాళ్లు. ఇక్కడ ప్రధాన ఉపాధి కాసినోలే. 2008 మాంద్యం తర్వాత కూడా నగరానికి ఏటా నాలుగు కోట్ల మంది వస్తున్నారు. ఈ నగరం నేరపూరిత స్వభావానికి పెట్టింది పేరు. అందుకే, ఇక్కడ స్వీయ రక్షణకు తుపాకులు కొనుక్కొనే స్వేచ్ఛ ఉంది. వాటిపై ఎలాంటి నియంత్రణా ఉండదు. ఆ స్వేచ్చే ఆదివారం రాత్రి కాల్పులకు దారి తీసింది.

ఎన్ని తుపాకులైనా తేలిగ్గా కొనుక్కోవచ్చు

ఎన్ని తుపాకులైనా తేలిగ్గా కొనుక్కోవచ్చు

నెవాడా రాష్ట్రం, అక్కడి లాస్‌వేగాస్‌ నగరం అంటేనే కేసినోలు, నైట్‌క్లబ్బులకు పెట్టింది పేరు. ఇక్కడ 24 గంటల పాటు యువత ఆటపాటల్లో మునిగి తేలుతారు. ఒక్క వినోదానికే కాదు.. ఆయుధాలకూ నెవడా చిరునామాగా మారింది. ఇక్కడ తుపాకులు పొందడం చాలా తేలిక. సాధారణంగా అమెరికాలో ఏ రాష్ట్రంలోనైనా తుపాకులు కొనాలంటే.. ‘మీ నేపథ్యం ఏమిటి? మానసిక ఆరోగ్యపరిస్థితి ఎలా ఉంది? గతంలో నేరాలు ఏవైనా చేశారా?' తదితర వివరాలు అడుగుతారు. నెవాడాలో ఆ సమాచారానికి పెద్దగా ప్రాముఖ్యం ఉండదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎన్ని కావాలంటే అన్ని కొనుక్కోవచ్చు. తుపాకుల యజమానులకు విధిగా లైసెన్సులు ఉండాలనే నిబంధన నెవాడా చట్టాల్లో ఎక్కడా కనిపించదు. కాకపోతే కొనుగోలు చేసే ఆయుధాల వివరాలను నమోదు చేయాలి. అంతే.

ఆటోమేటిక్ నుంచి మెషిన్ గన్ల వరకు తేలిగ్గా లభ్యత

ఆటోమేటిక్ నుంచి మెషిన్ గన్ల వరకు తేలిగ్గా లభ్యత

లాస్ వేగాస్‌లో ఆటోమేటిక్‌ అసాల్ట్‌ ఆయుధాలు మొదలు మెషిన్‌ గన్ల వరకు అన్నీ సులువుగా దొరుకుతాయి. అంతేనా.. వాటిని కలిగి ఉండటంపైగానీ, బదిలీ చేయడంపై గానీ ఆంక్షలు అసలే ఉండవు. కొన్నవాటిని బహిరంగంగా ప్రదర్శిస్తూ తిరిగేయొచ్చు. ఒక్కమాటలో చెప్పాలంటే.. అమెరికా మొత్తం మీద ఆయుధాల వినియోగంపై నియంత్రణలు అతి తక్కువగా ఉండే రాష్ట్రం అదే. లాస్‌వేగాస్‌ మారణకాండ తర్వాత తుపాకుల తయారీ కంపెనీల షేర్ల ధరలు అమాంతం ఎగబాకాయి. కాల్పుల తర్వాత సోమవారం ట్రేడింగ్‌లో షేర్ల ధరల్లో ఐదు శాతం పెరుగుదల చోటుచేసుకుంది. ఇలాంటి ఘటనలకు మార్కెట్లు సహజరీతిలో స్పందిస్తుంటాయని, ఆత్మరక్షణ కోసం తుపాకులను పౌరులు ఎగబడి కొంటారనే భావనే దీనికి కారణమని ప్రుడెన్షియల్‌ ఫైనాన్షియల్‌ చీఫ్‌ మార్కెట్‌ స్రేటజిస్ట్‌ క్రాస్బీ చెప్పారు.

 ఏటా అమెరికాలో 10 లక్షల తుపాకుల తయారీ

ఏటా అమెరికాలో 10 లక్షల తుపాకుల తయారీ

ప్రపంచవ్యాప్తంగా సాధారణ పౌరుల చేతుల్లోని ఆయుధాల సంఖ్య దాదాపు 65 కోట్లయితే అందులో అమెరికన్ల వాటా 48 శాతం. ఇక్కడ ప్రతి వంద మందిలో 89 మంది తుపాకులు వినియోగిస్తున్నారు. రెండోస్థానం యెమన్‌ది. అక్కడ ప్రతి వందమందిలో 55 మంది వద్ద ఆయుధాలు ఉన్నాయి. ఏటా అమెరికాలో పది లక్షల తుపాకులు తయారవుతున్నట్టు అంచనా. తుపాకుల తయారీ పరిశ్రమ వార్షికాదాయం 88 వేల కోట్లకు పైనే ఉంటుందని తెలుస్తోంది. ఒక్క అమెరికాలోనే 31 కోట్ల తుపాకులు ఉన్నాయి. ప్రపంచ జనాభాలో అమెరికన్లు 5 శాతం కాగా.. కాల్పులు ఘటనల్లో వారి వాటా 31 శాతం ఉంటుంది.

English summary
Sunday night's mass shooting in Las Vegas exposed a new vulnerability for concertgoers -- the outdoor venue. In what is being called the deadliest shooting in modern U.S. history, at least 59 people died and 527 were injured when a gunman opened fire on the crowd at an outdoor country music concert. Officials said the gunman, whom police believe killed himself, was firing at the crowd from the 32nd floor of the nearby Mandalay Bay Resort and Casino, sending more than 22,000 country music fans scrambling for their lives.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X