వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భయపడిందే జరిగింది: ట్విస్ట్.. అమెరికా ఉద్యోగ భర్తీకి కాదు కానీ..

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: భారత ఐటీ కంపెనీలు భయపడిందే జరిగింది. 'ది హై స్కిల్డ్‌ ఇంటెగ్రిటీ అండ్‌ ఫెయిర్‌నెస్‌ యాక్ట్‌ 2017' అమెరికా హౌస్‌ ఆఫ్‌ రిప్రజెంటేటివ్స్‌కు చేరింది. తద్వారా ఉద్యోగ అవకాశాల్లో అమెరికాకే తొలి ప్రాధాన్యం అన్న అధ్యక్షులు ట్రంప్ తనదైన దారిలో వెళ్తున్నారు.

హెచ్1బీ వీసాదారులకు ట్రంప్ భారీ షాక్: భారత ఐటీ కంపెనీలపై ప్రభావం,షేర్లు పతనంహెచ్1బీ వీసాదారులకు ట్రంప్ భారీ షాక్: భారత ఐటీ కంపెనీలపై ప్రభావం,షేర్లు పతనం

ఈ బిల్లును కాలిఫోర్నియా కాంగ్రెస్‌ సభ్యుడు జో లోప్గ్రెన్‌ ప్రవేశపెట్టారు. దీని ప్రకారం మార్కెట్‌ అవసరాల ఆధారంగా రెండువందల శాతం అదనపు వేతనం చెల్లించే కంపెనీలకు దీనిని కేటాయిస్తారు.

దీని ప్రకారం హెచ్‌-1బీ వీసాదారుడికి కనీసం 1,30,000 డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. ఇది ప్రస్తుతం చెల్లిస్తున్న 60,000 డాలర్లతో పోలిస్తే రెట్టింపుకన్నా ఎక్కువ. ఈ మొత్తాన్ని 1989లో నిర్ణయించారు. దీనిని నాటి నుంచి మార్చలేదు.

'డబుల్'తో ట్రంప్ షాక్: మనోళ్లు ఏ కంపెనీలో ఎంతమంది, వారి మాటేమిటి?'డబుల్'తో ట్రంప్ షాక్: మనోళ్లు ఏ కంపెనీలో ఎంతమంది, వారి మాటేమిటి?

తాజా బిల్లులో కఠిన నిబంధనలు ఉన్నాయి. కంపెనీలలో స్థానిక ఉద్యోగులకు అవకాశం ఉంటుంది. కంపెనీలకు విదేశీ ఉద్యోగులు భారం అవుతారు. డిపెండెంట్ వీసాల పైన ఉన్న వారిపై స్పష్టత రావాల్సి ఉంది.

ప్రతిభావంతులకు.. అమెరికా ఉద్యోగాల భర్తీ కోసం కాదు..

ప్రతిభావంతులకు.. అమెరికా ఉద్యోగాల భర్తీ కోసం కాదు..

ఈ బిల్లు ప్రవేశపెట్టే సమయంలో కాంగ్రెస్‌ సభ్యుడు లోఫ్గ్రెన్‌ మాట్లాడుతూ.. కొత్త బిల్లుతో ప్రపంచంలోనే అత్యంత ప్రతిభావంతులను.. అత్యధిక వేతనాలకు ఉద్యోగాల్లోకి తీసుకుంటారని, వీరు కొత్త ఉద్యోగాలు సృష్టించడానికి ఉపయోగపడతారని, అంతేగానీ అమెరికన్ల ఉద్యోగాలను భర్తీ చేయడానికి కాదన్నారు.

ఇరవై శాతం స్టార్టప్‌లకు..

ఇరవై శాతం స్టార్టప్‌లకు..

అంతేకాదు వర్క్ వీసాల సంఖ్యపై దేశాలపై ఉన్న పరిమితిని ఈ బిల్లు తొలగిస్తుందని, అప్పుడు జాతీయత ఆధారంగా కాకుండా ప్రతిభ ఆధారంగా ఉద్యోగాల్లోకి తీసుకోవచ్చునని, దీంతోపాటు ప్రస్తుతం ఇచ్చే హెచ్‌1బీ వీసాల్లో ఇరవై శాతం స్టార్టప్‌లకు కేటాయిస్తారని పేర్కొన్నారు.

ఐటీని కుదిపేసింది

ఐటీని కుదిపేసింది

అమెరికా వీసా నిబంధనల్లో మార్పు తీసుకొస్తూ హౌస్‌ ఆఫ్‌ రిప్రజెంటేటివ్స్‌లో బిల్లును ప్రవేశపెట్టడంతో భారత దిగ్గజ ఐటీ కంపెనీల షేర్లు కుదేలయ్యాయి. దీనిలో హెచ్‌-1బీ వీసాదారుల జీతాన్ని 1,30,000 డాలర్లుగా నిర్ణయించారు. ఈ వార్త ఒక్కసారిగా కలకలం రేపింది. దీంతో టీసీఎస్‌, విప్రో, హెచ్‌సీఎల్‌ షేర్లు మార్కెట్లో ఒక్కసారిగా పతనమయ్యాయి.

గంట వ్యవధిలోనే..

గంట వ్యవధిలోనే..

కేవలం గంట వ్యవధిలో ఈ కంపెనీలు రూ.48,000 కోట్ల విలువను కోల్పోయాయి. అమెరికన్ల ఉద్యోగాల్లో విదేశీయులను భర్తీ చేయడాన్ని అడ్డుకునేలా ఈ వర్క్‌వీసా నిబంధనలను సిద్ధం చేశారు. టెక్‌ సొల్యూషన్స్‌, మాస్టిక్‌, మైండ్‌ట్రీ, ఎంఫసిస్‌, కేపీఐటీ, నిట్‌ టెక్నాలజీ, జియోమెట్రిక్‌ షేర్లు 5 శాతానికి పైగా కుంగాయి.

మైక్రోసాఫ్ట్ దావా.

మైక్రోసాఫ్ట్ దావా.

ముస్లీం దేశాల నుంచి వలసలను పరిమితం చేయడంపై టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ తీవ్రంగా స్పందిస్తోంది. ఇమ్మిగ్రేషన్ కార్యనిర్వాహక ఆదేశాలపై కంపెనీ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఫెడరల్ కోర్టులో దావా వేసేందుకు సిద్ధమవుతోంది.

English summary
The executive order drafted by the Trump Administration not only strangulates H-1B and L1 visas.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X