వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మినీ స్కర్టులో ఆఫ్ఘన్ అమ్మాయిలు: ఆ ఒక్క ఫోటో ట్రంప్ మనసు మార్చేసింది..

1970ల్లో ఆఫ్ఘన్ మహిళలు ఎంత స్వేచ్చగా ఉన్నారో ఆ ఫోటోలో గమనించవచ్చు.

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: ఆఫ్ఘనిస్తాన్ నుంచి తమ సైన్యాన్ని వెనక్కి రప్పించాలన్న నిర్ణయంపై ట్రంప్ వెనక్కి తగ్గారు. అవసరమైతే మరిన్ని బలగాలను పంపించి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే ట్రంప్ నిర్ణయాన్ని మార్చడంలో ఒక ఫోటో కీలకంగా మారిందని చెబుతున్నారు.

అమెరికా జాతీయ భద్రతా సలహాదారు మెక్ మెస్టర్ చూపించిన ఆ ఫోటోతో ట్రంప్ మనసు మార్చుకున్నారు. ఇంతకీ ఆ ఫోటోలో ఏముందంటే.. 1970ల్లో ఆఫ్ఘన్ మహిళలు ఎంత స్వేచ్చగా ఉన్నారో అందులో కనిపిస్తోంది. ఇప్పటిలా దుస్తులపై ఎలాంటి ఆంక్షలు లేని కాలంలో మినీ స్కర్ట్స్ వేసుకుని వారు రోడ్డుపై నడుస్తుండటం గమనించవచ్చు.

How Trump was convinced to send more troops to Afghanistan

1930-70వరకు ఇదే రకమైన స్వేచ్చా వాతావరణం ఆఫ్ఘనిస్తాన్‌లో కొనసాగింది. కానీ 1990ల్లో తాలిబన్లు ఆఫ్ఘన్‌ను తమ చేతిలోకి తీసుకున్నాక పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. మహిళల దుస్తులు, చదువు, పెళ్లిళ్లు ఇలా ప్రతీ విషయంలోను ఆంక్షలు అమలవుతూ వస్తున్నాయి. ఎదురు తిరిగినవారిని నిర్దాక్షిణ్యంగా మట్టుబెడుతూ వస్తున్నారు.

ఈ నేపథ్యంలో.. ఆఫ్ఘన్‌లో తిరిగి 1970నాటి స్వేచ్చా వాతావరణం వెల్లివిరియాలంటే అమెరికా సైనిక సహాయం తప్పనిసరి అని ఆ దేశ భద్రతా సలహాదారు మెక్‌మెస్టర్ ట్రంప్‌కు సూచించారు. ఆయన సూచనతో తన నిర్ణయంపై వెనక్కి తగ్గిన ట్రంప్.. అవసరమైతే మరిన్ని బలగాలను ఆఫ్ఘన్‌లో దించాలని, యుద్దం మాత్రం ఆపేది లేదని ప్రకటించారు.

English summary
National Security Advisor H.R. McMaster helped persuade President Donald Trump to recommit to the Afghanistan war effort by showing him an old photo of Afghan women strolling the streets of Kabul wearing miniskirts.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X