వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికాలో బలంగా చైనా వ్యతిరేక పవనాలు- క్యాష్‌ చేసుకునేందుకు ట్రంప్‌, బిడెన్‌ ప్రయత్నాలు

|
Google Oneindia TeluguNews

అమెరికాలో అధ్యక్ష ఎన్నికల పోలింగ్‌కు పది రోజులే మిగిలున్న నేపథ్యంలో ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. అధ్యక్ష ఎన్నికల్లో పోటీపడుతున్న రెండు ప్రధాన పార్టీలు కూడా ప్రచారాన్ని రోజుకో రకంగా కొత్త పుంతలు తొక్కిస్తున్నాయి. ఓటర్లను ఆకట్టుకోవాలంటే ప్రధానంగా మారిన రెండు కీలక అంశాలను పదేపదే ప్రచారం చేస్తూ వాటి చుట్టే ఎన్నికలు సాగేలా చూస్తున్నాయి. ఇందులో ఒకటి కరోనా కాగా.. రెండవది చైనా. ఈ రెండు అంశాల చుట్టే అమెరికా ఎన్నికల ప్రచారం సాగుతుండటంతో వీటి ఆధారంగానే జనం దృష్టి కూడా వీటిపైనే కేంద్రీకృతమవుతోంది. దీంతో కరోనా కట్టడిలో ట్రంప్‌ వైఫల్యం చైనాతో సాగుతున్న పోరు ఫలితాలను నిర్ణయించబోతున్నాయి.

రసవత్తరంగా అమెరికా పోరు- రంగంలోకి ఒబామా.. తన మాజీ డిప్యూటీ బిడెన్‌ గెలుపు కోసం..రసవత్తరంగా అమెరికా పోరు- రంగంలోకి ఒబామా.. తన మాజీ డిప్యూటీ బిడెన్‌ గెలుపు కోసం..

 చైనా చుట్టూ అమెరికా ఎన్నికలు..

చైనా చుట్టూ అమెరికా ఎన్నికలు..

అమెరికాలో నవంబర్‌ 3న జరిగే అధ్యక్ష ఎన్నికలు ఆ దేశంలో పరిణామాల కంటే చైనా చుట్టూనే ఎక్కువగా సాగిపోతున్నాయి. దీనికి కారణం కరోనాను కట్టడి చేయడంలో ట్రంప్‌ వైఫల్యం ఒక్కసారిగా తెరపైకి రావడంతో ఆయన ఓటర్ల దృష్టి మరల్చేందుకు తన ప్రసంగాల్లో చైనాను తెరపైకి తేవడం మొదలుపెట్టారు. చైనాతో డెమోక్రాట్‌ అభ్యర్ధి బిడెన్‌కు సంబంధాలు ఉన్నాయంటూ ఓటర్లను నమ్మించేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. దీంతో బిడెన్‌ కూడా అనివార్యంగా చైనా ప్రస్తావన లేకుండా తన ప్రచారం చేసుకోలేని పరిస్ధితి వచ్చింది. ఇప్పుడు ఆయన ట్రంప్‌ ఆరోపణలకు కౌంటర్‌గా చైనాతో ఆయనకు రహస్య బ్యాంక్ అకౌంట్‌ ఉందంటూ మరో ప్రచారం చేస్తున్నారు. దీంతో అధ్యక్ష అభ్యర్ధులు ఇద్దరికీ చైనాతో సంబంధాలు ఉన్నాయా అనే చర్చ సగటు అమెరికన్లలో సాగుతోంది.

 బలంగా చైనా వ్యతిరేక పవనాలు..

బలంగా చైనా వ్యతిరేక పవనాలు..

అమెరికాలో ప్రస్తుతం చైనా వ్యతిరేక పవనాలు బలంగా వీస్తున్నాయి. ముఖ్యంగా కరోనా ప్రభావం మొదలు కాక ముందే ఆ దేశంతో వాణిజ్య యుద్ధం పేరుతో ట్రంప్‌ సాగించిన ప్రచారం కొంత మేర ప్రభావం చూపగా.. కరోనా వైరస్‌ను చైనాయే పుట్టించిందన్న ప్రచారం జనం మెదళ్లలోకి ఓ రేంజ్‌లో వెళ్లిపోయింది. దీంతో ప్రపంచంలోనే బలమైన ఆర్ధికశక్తిగా ఉన్న అమెరికాను దెబ్బతీసేందుకు ఇవన్నీ చైనాయే చేస్తుందన్న అనుమానాలు జనంలోకి వెళ్లాయి. వీటి ప్రభావంతో ఇప్పుడు అమెరికాలో గతంలో ఎన్నడూ లేనంతగా మూడింట రెండోవంతు జనం చైనా పేరెత్తితేనే మండిపడుతున్నట్లు తాజా సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. అయితే ఈ వ్యతిరేకత ట్రంప్, బిడెన్‌ ఇద్దరిలో ఎవరికి చుట్టుకుంటుందో మాత్రం తెలియడం లేదు.

Recommended Video

US Election 2020 : ట్రంప్ vs జో బైడెన్.. అధ్యక్ష ఎన్నికల చివరి డిబేట్ లో నేతల మధ్య మాటల తూటాలు!
 చైనా బూచి చూపుతున్న ట్రంప్‌, బిడెన్‌

చైనా బూచి చూపుతున్న ట్రంప్‌, బిడెన్‌

అమెరికాను దెబ్బతీసేందుకు చైనా ప్రయత్నిస్తోందన్న ప్రచారం జనంలోకి బాగా వెళ్లిపోవడంతో మొదట్లో చైనా గురించి అంతగా మాట్లాడని బిడెన్ కూడా ఇప్పుడు చైనాతో ట్రంప్‌కు లింక్‌ పెడుతూ విమర్శలు చేస్తున్నారు. తాజాగా జరిగిన అమెరికా అధ్యక్ష అభ్యర్ధుల తుది విడత చర్చలోనూ ట్రంప్‌, బిడెన్‌ ఇరువురూ పరస్పరం చైనాతో లింకుల ఆరోపణలు చేసుకున్నారు. దీంతో ఓ దశలో జనం కూడా ఎవరిని నమ్మాలో తెలియని పరిస్ధితుల్లోకి జారిపోతున్నారు. చైనాపై ఇప్పటికే కఠిన వైఖరి అవలంబిస్తున్న ట్రంప్‌నే ఈ విషయంలో జనం ఎక్కువగా నమ్ముతున్నట్లు తెలుస్తోంది. కరోనాను కట్టడి చేయడంలో తన వైఫల్యాలను ట్రంప్‌ చైనాపై విరుచుకుపడటం ద్వారా కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారని డెమోక్రాట్లు ఆరోపిస్తున్నారు. అయితే వీటిని జనం ఎంతమేరకు నమ్ముతున్నారనేది మరో పది రోజుల్లో తేలిపోనుంది.

English summary
less than two weeks of time remaining for us elections polling date, two presidential candidates donald trump and joe biden trying to encash anti-china waves in the country.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X