వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికా చరిత్రలోనే చెత్త ప్రెసిడెంట్‌గా ట్రంప్‌-42 శాతం ఓటర్ల అభిప్రాయమిదే- ఫాక్స్‌ న్యూస్

|
Google Oneindia TeluguNews

ప్రపంచ అగ్రరాజ్యం అమెరికాకు నాలుగేళ్ల పాటు అధ్యక్షుడిగా పనిచేసిన డొనాల్డ్‌ ట్రంప్‌ను తాజాగా ఓటర్లు తిరస్కరించారు. తాజా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌ దారుణంగా ఓటమి పాలయ్యారు. కరోనాను ఎదుర్కోవడంలో వైఫల్యమే ఆయన కొంపముంచిందనే వాదన సర్వత్రా వినిపిస్తున్నదే. అయితే తాజాగా ఫాక్స్ న్యూస్ నిర్వహించిన పోల్‌లోనూ అత్యధిక శాతం మంది ట్రంప్‌ అమెరికా చరిత్రలోనే అత్యంత చెత్త అధ్యక్షుడిగా తేల్చేశారు. దీంతో ఈ సర్వేలో పాల్గొన్న వారు ఏయే అంశాల ఆధారంగా ఈ నిర్ణయానికి వచ్చారన్న దానిపై ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తికర చర్చ జరుగుతోంది.

 ట్రంప్‌పై ఫాక్స్ న్యూస్‌ పోల్‌..

ట్రంప్‌పై ఫాక్స్ న్యూస్‌ పోల్‌..

అమెరికాకు చెందిన ఫాక్స్ న్యూస్‌ తాజా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌పై తాజాగా ఓ ఒపీనియన్‌ పోల్‌ నిర్వహించింది. ఇందులో భారీ సంఖ్యలో అమెరికన్లు పాల్గొని తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ట్రంప్‌ హయాంలో తీసుకున్న నిర్ణయాలు, ఎన్నికలు, కరోనాను ఎదుర్కొన్న తీరు, ఇలా పలు అంశాలపై ఈ సర్వే జరిగింది. ఇందులో పాల్గొన్న వారు కూడా తమ అభిప్రాయాలను స్పష్టంగా చెప్పారు. ఈ పోల్‌లో ట్రంప్‌ పనితీరుపై వ్యక్తమైన అభిప్రాయాలను బట్టి చూస్తే తాజా అధ్యక్ష ఎన్నికల్లో ఆయన ఎందుకంత దారుణంగా ఓడిపోయారో మనకు ఇట్టే అర్ధమవుతుంది.

 చరిత్రలోనే చెత్త ప్రెసిడెంట్‌ ట్రంప్‌

చరిత్రలోనే చెత్త ప్రెసిడెంట్‌ ట్రంప్‌

ఫాక్స్‌ న్యూస్‌ నిర్వహించిన పోల్‌లో పాల్గొన్న వారిలో 42 శాతం మంది అమెరికా అధ్యక్షులుగా పనిచేసిన వారిలో ట్రంప్‌ అత్యంత చెత్త ప్రెసిడెంట్‌గా తేల్చేశారు. మరో 8 శాతం మంది ట్రంప్‌కు తాము సగటు కంటే తక్కువ మార్కులే ఇస్తామన్నారు. 16 శాతం మాత్రం సగటు కంటే ఎక్కువ మార్కులు ఇచ్చారు. మరో 22 శాతం మంది మాత్రం ట్రంప్‌ గొప్ప అధ్యక్షుడని కితాబిచ్చారు. దీంతో ట్రంప్‌ విషయంలో అమెరికన్ల తాజా వైఖరి ఎలా ఉందో స్పష్టమైంది. అమెరికా ఎన్నికల తర్వాత నిర్వహించిన ఈ సర్వేలో ఎన్నికల సమయంతో పోల్చినా ట్రంప్‌ ఆదరణ పడిపోయిందని తెలుస్తోంది..

 నెగెటివ్‌ ట్రంప్‌ అన్న ఓటర్లు

నెగెటివ్‌ ట్రంప్‌ అన్న ఓటర్లు

గతంలో అమెరికా అధ్యక్షులుగా పనిచేసిన వారితో పోలిస్తే డొనాల్డ్‌ ట్రంప్‌ అత్యంత నెగెటివ్ భావాలున్న వ్యక్తిగా ఈ పోల్‌లో పాల్గొన్న వారు చెప్పారు. గతంలో అమెరికా అధ్యక్షుడుగా పనిచేసిన జార్జి డబ్ల్యూ బుష్‌ కూడా ఇలాగే ఉండేవారని అప్పట్లో ఆయన అధ్య్షక్ష బాధ్యతల నుంచి దిగిపోయే చివరి రోజుల్లో నిర్వహించిన గ్యాలప్‌ పోల్‌లో తేలింది. ట్రంప్‌కు ఈసారి ఓటర్లు ఇచ్చిన రేటింగ్స్‌ చూస్తే గతంలో వారు ఎప్పుడూ అలాంటి రేటింగ్స్‌ ఇవ్వలేదని కూడా తేలింది. ట్రంప్‌ విషయంలో ఓటర్లు పోలరైజ్‌ అయినట్లు కూడా ఈ పోల్‌ చెబుతోంది.

అందుకే గతంలో ఏ అధ్యక్షుడికీ ఇవ్వనంత దారుణ రేటింగ్‌ ట్రంప్‌కు ఇచ్చినట్లు తెలుస్తోంది.

Recommended Video

PM Modi meets UK Foreign Secretary, discusses post-Brexit ties
 ట్రంప్‌ అభిమానుల వాదన ఇదే..

ట్రంప్‌ అభిమానుల వాదన ఇదే..

నిన్న మొన్నటి వరకూ అధ్యక్షుడుగా పనిచేసిన ట్రంప్‌కు వ్యతిరేకంగా ఫాక్స్‌ న్యూస్‌ పోల్‌లో జనం ఓటేయడం ఆయన అభిమానుల్లోనూ చర్చకు దారి తీసింది. అయితే 22 శాతం మంది ఆయనో మంచి అధ్యక్షుడని ఓటింగ్‌లో తేల్చారు. అయితే వీరంతా ట్రంప్‌ అభిమానులే. వీరంతా ఇప్పుడు ట్రంప్‌ను సమర్ధిస్తూ ఏ అధ్యక్షుడైనా ముందు బాగానే కనిపిస్తారని, కొంతకాలం తర్వాత వారు కూడా వ్యతిరేకత మూటగట్టుకోవడం ఖాయమని అంటున్నారు. ప్రస్తుత అధ్యక్షుడ బైడెన్‌ కూడా రెండు, మూడేళ్లలో వ్యతిరేకత తెచ్చుకుంటారని, ఇందులో ట్రంప్‌ ఏమీ మినహాయింపు కాదంటున్నారు. ట్రంప్‌తో పోలిస్తే గతంలో అధ్యక్షులుగా పనిచేసిన వారిలో రెండోసారి పోటీ చేసి ఓడిపోయిన జార్జిబుష్‌, జిమ్మీ కార్టర్‌ వారు కూడా అప్పట్లో ఇలాంటి పరిస్ధితినే ఎదుర్కొన్నారని గుర్తు చేస్తున్నారు.

English summary
How voters rank Trump a historically bad president in Fox news Poll,
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X