వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Howdy Modi: హోస్టన్‌లో మోడీ ఫీవర్, గం.10.15 ప్రసంగం

|
Google Oneindia TeluguNews

హ్యూస్టన్: వరల్డ్ ఎనర్జీ కేపిటల్ హ్యూస్టన్ సిటీలో 'హౌడీ మోడీ' కార్యక్రమం కాసేపట్లో ప్రారంభం కానుంది. భారత ప్రధాని నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ ఒకే వేదికను పంచుకుంటున్నారు. 72 వేలమంది ప్రత్యక్షంగా వీక్షించగల సామర్థ్యం ఉన్న ఎన్ఆర్జీ ఫుట్‌బాల్ స్టేడియం ఇందుకు వేదిక అవుతోంది. 50 వేలమందికి పైగా ఎన్నారైలు ఈ కార్యక్రమానికి హాజరవుతారని అంచనా. 600 సంస్థలు కలిసి దీనిని నిర్వహిస్తున్నారు. దీంతో హౌడీ మోదీ కార్యక్రమానికి ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది.

ఈవెంట్ సమయం..
- 9:20 pm: ట్రంప్, నరేంద్ర మోడీ ఇద్దరు కలిసి స్టేజ్ పైకి వస్తారు.
- 9:20-9:30 pm: హ్యూస్టన్ మేయర్.. అధినేతలిద్దరికి ఆహ్వానం పలుకుతారు.
- 9.39 -10:09 pm: ట్రంప్ ప్రసంగం ఉంటుంది.
- 10:15 pm నుండి: నరేంద్ర మోడీ ప్రసంగం

Howdy Modi event in Houston, Modi to begin speaking around 10.15 pm

గత జూన్ నెలలో 28 రకాల అమెరికా ఉత్పత్తులపై భారత్ సుంకాన్ని పెంచిన విషయం తెలిసిందే. భారత్‌కు జనరలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్స్ (GSP) హోదాను అమెరికా రద్దు చేసిన నేపథ్యంలో భారత్ కూడా ఏమాత్రం తగ్గకుండా టిట్ ఫర్ టాట్ అన్నట్లుగా వ్యవహరించింది. ఈ నేపథ్యంలోను వీరి భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ కార్యక్రమం కోసం ట్రంప్ 100 నిమిషాల సమయం వెచ్చిస్తున్నారు.

Howdy Modi event in Houston, Modi to begin speaking around 10.15 pm

అమెరికా - భారత్ మధ్య బలమైన బంధం ఉందని చెప్పేందుకు హౌడీ మోడీ కార్యక్రమం మంచి వేదిక అని, ప్రపంచంలోని పురాతన, అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలు తమ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఏర్పరుచుకుంటున్నాయి. కాగా, ప్రధాని నరేంద్ర మోడీని చూసేందుకు ఉత్సహంగా ఉన్నామని అంతకుముందు హ్యూస్టన్‌లోని ఎన్ఆర్జీ స్టేడియానికి వచ్చిన ఎన్నారైలు చెప్పారు. అతను దేశాన్ని ముందుకు తీసుకు వెళ్తున్నారని, అందరికీ ఆదర్శమని ప్రశంసించారు.

English summary
People start gathering outside NRG stadium in Houston, Texas, to attend #HowdyModi event, say, ''We are excited to see Modi, expect to hear from him, & get words of wisdom from him because he is an inspiration for the country and people around the globe.''
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X