వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హోడీ మోడీ: 'అమెరికాకు భారత్ అత్యంత నమ్మకమైన స్నేహితుడు'

|
Google Oneindia TeluguNews

హ్యూస్టన్: భారత ప్రధాని నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ ఆదివారం హ్యూస్టన్‌లోని ఎన్ఆర్జీ ఫుట్‌బాల్ స్టేడియంలో 'హౌడీ మోడీ' కార్యక్రమంలో ఒకే వేదికను పంచుకుంటున్నారు. ఎన్జీఆర్ స్టేడియం ప్రవాస భారతీయులతో కిక్కిరిసిపోయింది. ఈ కార్యక్రమానికి 50 వేల మందికి పైగా భారతీయులు హాజరయ్యారు. 650 కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.
భారత కాలమానం ప్రకారం రాత్రి తొమ్మిదిన్నర గంటల సమయానికి మోడీ వేదిక వద్దకు రాగానే పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మోడీకి ఎన్నారైలు ఘన స్వాగతం పలికారు. హ్యూస్టన్ మేయర్ స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా మేయర్ మాట్లాడారు. భారత్-అమెరికా ప్రజాస్వామ్యాలు అందరికీ ఆదర్శమన్నారు. ఇరుదేశాల మధ్య మైత్రిబంధం బలోపేతం చేయడమే లక్ష్యమన్నారు. వాణిజ్యంలోను ఇరుదేశాల మైత్రి కొత్త అడుగులు వేస్తోందన్నారు. ప్రభుత్వాల మధ్య కాదు, ప్రజల మధ్య మైత్రిబంధాన్ని బలోపేతం చేస్తామన్నారు. భారత్ అమెరికాకు అత్యంత నమ్మకమైన స్నేహితుడు అన్నారు. భారత్‌లో జరుగుతున్న అభివృద్ధి కొత్త పాఠాలు నేర్పుతోందన్నారు.

Howdy Modi: Howdy Modi schedule as per Indian time

అంతకుముందు...

అంతకుముందు ఎన్ఆర్జీ స్టేడియంలోని హౌడీ మోడీ కార్యక్రమంలో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఏడున్నర గంటల నుంచి ఇవి ప్రారంభమయ్యాయి. బాంగ్రా ఆర్టిస్ట్‌లు ప్రదర్శన చేశారు. కార్యక్రమానికి ముందు డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేశారు. తాను హ్యూస్టన్‌లో తన స్నేహితుడితో కలిసి వేదికను పంచుకుంటున్నానని పేర్కొన్నారు.

- 7:30 pm: సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభం
- 9:20 pm: ట్రంప్, నరేంద్ర మోడీ ఇద్దరు కలిసి స్టేజ్ పైకి వస్తారు.
- 9:20-9:30 pm: హ్యూస్టన్ మేయర్.. అధినేతలిద్దరికి ఆహ్వానం పలుకుతారు.
- 9.39 -10:09 pm: ట్రంప్ ప్రసంగం ఉంటుంది.
- 10:15 pm నుండి: నరేంద్ర మోడీ ప్రసంగం

English summary
Prime Minister Narendra Modi's address at the 'Howdy Modi!' event in Houston, United States, will begin shortly.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X