వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

న్యూజిలాండ్‌లో భారీ భూకంపం.. సునామీ ప్రమాదం లేకపోవచ్చు...

|
Google Oneindia TeluguNews

న్యూజిలాండ్‌కు భారీ ప్రమాదం తప్పింది. భారీ భూకంపం రావడంతో అక్కడి అధికారులు హైరానా పడ్డారు. ఐలాండ్ తీరంలో వచ్చిన భూకంప తీవ్రత ఎక్కువగా ఉండడంతో దాని ప్రభావం సునామీగా మారే అవకాశాలన్నాయని ఖంగారు పడ్డారు. అయితే రెండు గంటలపాటు ఉత్కంఠను స‌ృష్టించిన భూకంప తీవ్రత చివరకు సునామిగా మారకపోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. కాగ ఇప్పటికే సునామీ రావడానికి గల అవకాశాలు ఏమైనా ఉన్నాయా అనే నేపథ్యంలో పరిశోధనలు జరుపుతున్నారు.

భారీ స్థాయిలో భూకంప తీవ్రత నమోదు

భారీ స్థాయిలో భూకంప తీవ్రత నమోదు

న్యూజిలాండ్ సముద్ర తీరంలో శనివారం రాత్రీ 11.54కు భారీ భూకంపం ఏర్పడింది. ఉత్తర న్యూజీలాండ్‌కు సుమారు 600 మైళ్ల దూరంలోని కెర్మాడిక్ ఐలాండ్స్‌లో రిక్టర్ స్కేల్‌పై 7.4 భూకంప తీవ్రత నమోదైంది. సముద్ర గర్భంలో రావడంతో సునామి వచ్చే అవకాశాలు ఉన్నట్టు ఆదేశ సివిల్ డిఫెన్స్ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.ఒకవేళ సునామి వచ్చే అవకాశాలు ఉన్న నేపథ్యంలో దాని ప్రభావం సుమారు 300 కి.మీ వరకు ఉండే అవకాశలు ఉన్నాయని అంచనా వేశారు.

ప్రభావం చూపించన భూకంప తీవ్రత

ప్రభావం చూపించన భూకంప తీవ్రత

భూకంపం నమోదైన రెండు గంటల్లోగా సునామీగా మారే అవకాశాలు ఉన్నట్టు హెచ్చరించారు. అయితే 7.4గా నమోదైన భూకంప తీవ్రత ప్రకంపనలు పెద్దగా ప్రభావితం చూపించలేదు. దీంతో సునామీ పై జారీ చేసిన హెచ్చరికలను వెనక్కి తీసుకున్నారు.దీంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. భూమి నుండి భూకంపం ఏర్పడిన ప్రాంతం 10 కిలోమీటర్ల దూరంలో ఉందని అధికారులు గుర్తించారు.ఒకవేళ భూకంపం సునామిగా మారితే మాత్రం న్యూజిలాండ్ త్రీవ నష్టం జరిగి ఉండేదని అక్కడి నిపుణులు అంచనా వేశారు.

90 శాతం భూకంపాలు.. అగ్నిపర్వతాలు అక్కడే

90 శాతం భూకంపాలు.. అగ్నిపర్వతాలు అక్కడే

కాగా కార్మెడిక్ ఐలాండ్ పసిఫిక్ తీరంలోని రిగ్ ఆఫ్ ఫైర్ రిజియన్‌లో ఉంది. దీంతో అక్కడ తరచు భూకంపలు,వాల్కోనోస్ లాంటీవి వస్తుంటాయి. రిగ్ ఆఫ్ పైర్ ప్రాంతంలోనే 90 శాతం మేర భూపంపాలు వస్తాయి. దీంట్లో 75శాతం అగ్నిపర్వతాలు కూడ ఉన్నాయి.కాగా పసిఫిక్ ప్లేట్ నుండి రిగ్ ఆఫ్ ఫైర్ రీజియన్ సుమారు 25000 మైళ్ల దూరంలో ఉంటుంది.

English summary
huge 7.2 magnitude earthquake has hit off the coast of New Zealand causing a Tsunami warning according to the United States Geological Survey (USGS).and the Pacific Tsunami Warning Center said it may cause only minor sea level changes in some coastal areas.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X