వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికాలో భారీ పేలుడు.. దద్దరిల్లిన హ్యూస్టన్ సిటీ శివారు..

|
Google Oneindia TeluguNews

అమెరికాలో భారతీయులు ఎక్కువగా నివసించే టెక్సాస్ రాష్ట్రం హ్యూస్టన్ సిటీ శివారులో శుక్రవారం తెల్లవారుజామున భారీ పేలుడు సంభవించింది. కిలోమీటర్ల దూరం వరకు పేలుడు శబ్ధం వినిపించడం, దాని ధాటికి వందలకొద్దీ అపార్ట్‌మెంట్లలో సీలింగ్ ఫ్యాన్లు, అద్దాలు విరిగిపడటంతో ప్రజలు భయంతో హాహాకారాలు చేశారు. అగ్నికీలకలు ఎగిసిపడటంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు వ్యాపించాయి. చుట్టుపక్కల జనం ఊపిరాడక ఇబ్బందిపడ్డారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు.. రెస్క్యూటీమ్‌లతోపాటు ఫైరింజన్లు, ఆంబులెన్స్‌లతో ఘటనా స్థలానికి చేరుకున్నాయి. మంటల్ని అదుపుచేయడంతోపాటు స్థానికుల్ని ఖాళీచేయించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.

అసలేం జరిగిందంటే..
హ్యూస్టన్ సిటీ శివారులోని గెస్నర్ రోడ్డులోని వాట్సన్ గ్రైండింగ్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్‌ కంపెనీ ఉంది. శుక్రవారం తెల్లవారుజామున అక్కడ సడెన్ గా భారీ పేలుడు చోటుచేసుకుంది. పేలుడు తీవ్రత ఎక్కువగా ఉండటంతో చుట్టుపక్కల బిల్డింగ్స్, అపార్ట్ మెంట్లు దద్దరిల్లిపోయాయి. కేటీఆర్‌కే అనే స్థానిక డిజిటల్ టీవీ ముందుగా ఈ వార్తను ప్రసారం చేసింది. ఆ తర్వాత ఈ ఘటనకు సంబంధించిన చాలా మంది బాధితులు వీడియోలు, ఫొటోలు కేటీఆర్‌కే ట్విటర్‌కు షేర్ చేశారు.

Huge explosion in Houston of Texas, damaging nearby homes

ప్రాణనష్టంపై..

Huge explosion in Houston of Texas, damaging nearby homes
పేలడు సంభవించిన గెస్నర్ రోడ్డు, దాని పరిసర ప్రాంతాలను పోలీసులు సీజ్ చేశారు. అటుగా వాహనాలు రావొద్దని, ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని ట్రాఫిక్ ఆంక్షలు జారీచేశారు. కాగా, కేటీఆర్‌కే రిపోర్టు ప్రకారం.. తీవ్రంగా గాయపడ్డ ఓ వ్యక్తిని ఆంబులెన్స్ లో తరలించారు. ఈ ఘటనలో ప్రాణనష్టం ఎంతన్నది తెలియాల్సిఉంది. పేలుడు జరిగినప్పుడు ఫ్యాక్టరీలోపల ఎవరైనా ఉన్నారా? లేరా?, అసలీ ప్రమాదం ఎలా జరిగిందనే విషయాలు తెలియాల్సిఉంది.
English summary
An explosion at a northwest Houston business shook part of the city early Friday, which occurred at Watson Grinding and Manufacturing sending at least one person to a hospital, damaging nearby homes and sending firefighters scrambling
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X