వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యూకే హైకోర్టులో మాల్యాకు భారీ ఊరట...న్యాయస్థానం ఏం చెప్పిందంటే..?

|
Google Oneindia TeluguNews

లండన్: యూకే హైకోర్టులో లిక్కర్ బ్యారన్ విజయ్ మాల్యాకు భారీ ఊరట లభించింది. భారత్‌కు మాల్యాను అప్పగించాలంటూ విచారణ సంస్థలు దాఖలు చేసిన పిటిషన్‌పై వాదనలు జరిగాయి. భారత్‌కు అప్పగించడంపై తను అప్పీల్ చేసుకోవచ్చని పేర్కొంది. భారత్‌లో పలు బ్యాంకులకు రూ.9వేల కోట్లు ఎగవేసి లండన్‌లో తలదాచుకుంటున్నాడు మాల్యా. లండన్‌లోని హైకోర్టులో ద్విసభ్య ధర్మాసనం మాల్యా కేసును విచారణ చేసింది. జస్టిస్ జార్జ్ లెగ్గట్, జస్టిస్ ఆండ్రూ పాప్లెవెల్ వాదనలు విన్నారు.

మాల్యా మోసాలకు మనీలాండరింగ్‌కు పాల్పడ్డారని యూకే హోం సెక్రటరీ చేసిన ఆరోపణలను జడ్జీలు కొట్టివేస్తూ మాల్యా అప్పీల్ చేసుకునేందుకు పరిమిత సమయంను ఇస్తూ లాయర్లకు సూచనలు చేశారు. ఇప్పుడు అప్పీల్ చేసుకునేందుకు అనుమతి వచ్చినందున తన కేసును యూకే హైకోర్టు పూర్తి స్థాయిలో విననుంది. ఒకవేళ హైకోర్టు కనుక భారత్‌కు అప్పగించే విషయమై అనుమతి నిరాకరించి ఉంటే సుప్రీంకోర్టులో కూడా అప్పీలు తిరస్కరణకు గురయ్యేది. అంతేకాదు 28 రోజుల్లో భారత్‌కు అప్పగించే ప్రక్రియ ముగిసేది.

mallya king

యూకే హైకోర్టు ఇచ్చిన తీర్పుపై మాల్యా స్పందించారు. ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుందని అన్నారు. తనపై నమోదు చేసిన కేసుల్లో వాస్తవాలు లేవని చెప్పారు. ముందుగా ప్రాథమిక ఆరోపణలపై తను నెగ్గాల్సి ఉందని చెప్పారు. బ్యాంకులకు డబ్బులు చెల్లిస్తానని ఇప్పటికీ చెబుతున్నానని చెప్పిన మాల్యా ఆ డబ్బులు భారత్‌ నుంచే ఇవ్వాల్సి ఉందని ఇందుకు ప్రభుత్వం సహకరించాలని కోరారు. కోర్టుకు హాజరుకాబోయే ముందు తను చాలా పాజిటివ్‌గా ఉన్నట్లు చెప్పారు. అనుకున్నట్లుగానే విజయ్ మాల్యాకు భారత్‌కు అప్పగించే విషయమై భారీ ఊరట లభించిందనే చెప్పాలి.

English summary
In an order that brought relief, The UK High Court on Tuesday allowed embattled liquor tycoon Vijay Mallya to appeal at least on one of the five grounds against his extradition order signed off by the UK home secretary to face alleged fraud and money laundering charges amounting to Rs 9,000 crore in India.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X