వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాలిచ్చే తల్లివేనా? జాకెట్ విప్పు: భారత మహిళకు ఘోర అవమానం

భారత సంతతికి చెందిన మహిళకు జర్మనీలోని ఓ విమానాశ్రయంలో ఘోర అవమానం ఎదురైంది.

|
Google Oneindia TeluguNews

బెర్లిన్‌: భారత సంతతికి చెందిన మహిళకు జర్మనీలోని ఓ విమానాశ్రయంలో ఘోర అవమానం ఎదురైంది. 'నువ్వు పాలిచ్చే తల్లివేనా? అయితే.. నీ బిడ్డ లేకుండా ఎందుకు ప్రయాణిస్తున్నావ్‌. నీ మీద మాకు అనుమానాలున్నాయ్‌... ఓసారి జాకెట్‌ విప్పు.. చనుబాలు పితికి చూపించు' అంటూ భారత సంతతికి చెందిన ఓ సింగపూర్‌ మహిళ పట్ల అక్కడి తనిఖీ సిబ్బంది అవమానవీయంగా ప్రవర్తించారు. దీంతో సదరు సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఉన్నతాధికారులకు ఆమె ఫిర్యాదు చేశారు. కానీ, వారి నుంచి ఎలాంటి స్పందన రాకపోవడం విచారకరం.

వివరాల్లోకి వెళితే.. గాయత్రీ బోస్‌ అనే మహిళ సింగపూర్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కంపెనీలో మేనేజర్‌గా పనిచేస్తున్నారు. ఆమెకు మూడేళ్ల బాబు, ఏడునెలల పాప ఉన్నారు. గత గురువారం ఆమె పారిస్‌ వెళ్లేందుకు బెర్లిన్‌లోని ఫ్రాంక్‌ఫర్డ్‌ విమానాశ్రయానికి వచ్చారు. ఆమె లగేజీని ఎక్స్‌రే మిషన్‌ ద్వారా అధికారులు చెక్‌ చేయగా అందులో బ్రెస్ట్‌ పంప్‌ (చిన్నారుల కోసం పాలు పితికే పరికరం) లభ్యమైంది.

‘Humiliated’ Indian-origin woman asked to prove she was breastfeeding at Germany airport

వెంటనే గాయత్రి పాస్‌పోర్టును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆపై ఓ మహిళా పోలీసు అధికారి ఆమెను పక్క గదిలోకి తీసుకెళ్లి 45 నిమిషాలపాటు ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసింది. లోపల తాను అనుభవించిన వ్యథనంతా చెప్పుకొని గాయత్రి కన్నీటి పర్యంతమయ్యారు.

'గదిలోకి తీసుకెళ్లిన మహిళా పోలీసు.. జాకెట్‌ విప్పి పాలిండ్లను చూపెట్టు అంటూ గద్దించింది. తర్వాత పాలు వస్తున్నాయో లేదో తెలుసుకునేందుకు రొమ్ములను ప్రెస్‌ చేయమంది. నాకు అలా చేయక తప్పలేదు. గది బయటకు వచ్చిన తర్వాత గానీ నా విషయంలో ఏం జరిగిందో అర్థం కాలేదు. కొద్దిసేపటి వరకు షాక్‌ నుంచి తేరుకోలేకపోయాను. జరిగింది తలచుకొని ఏడుపు ఆగలేదు' అని ఆమె వాపోయింది.

కొద్దిసేపటికి బ్రెస్ట్‌ పంప్‌ను పరీక్షించి, పారిస్‌ వెళ్లేందుకు అనుమతిస్తూ పాస్‌పోర్టును తిరిగి ఇచ్చేశారని ఆమె పేర్కొంది. తన పట్ల వ్యవహరించిన తీరుపై అధికారులను నిలదీశానని, అయితే.. 'జరిగిందేదో జరిగిపోయింది.. ఇక వెళ్లు' అంటూ వారు నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారని బాధితురాలు పేర్కొంది.

కాగా, ఈ ఘటనపై స్పందించేందుకు ఫ్రాంక్‌ఫర్ట్‌ ఎయిర్‌పోర్టు అధికారులు నిరాకరించారు. ఎల్లిస్‌ టేలర్‌ అనే ఎవియేషన్‌ నిపుణుడు మాత్రం స్పందిస్తూ.. ఓ మాతృమూర్తిని పట్టుకొని రొమ్ములను చూపెట్టమనడంలో అర్థం లేదని చెప్పారు.

విదేశాలకు వెళ్లిన సమయంలో పలు విమానాశ్రయాల్లో భారతీయులకు ఇలాంటి చేదు అనుభవం ఎదురుకావడం విచారకరం. ఎన్ని విమర్శలు వచ్చినప్పటికీ సదరు విమానాశ్రయాల అధికారులు, సిబ్బంది తమ వైఖరిని మార్చుకోకపోవడం చూస్తే ఆ దేశాల ప్రభుత్వాలు కూడా వారికి మద్దతుగా ఉంటున్నాయనే విషయం అర్థమవుతుంది. భద్రత పేరుతో ఇలాంటి చర్యలకు పాల్పడుతుండటంపై పలువురు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం
చేశారు.

English summary
A 33-year-old Indian-origin Singaporean woman has said that she was “humiliated” by German police when was told to squeeze her breast at Frankfurt airport to prove she was lactating, a media report said today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X