వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సముద్రంలో మునిగిన పడవలు, 240 మంది మృతి

|
Google Oneindia TeluguNews

లిబియా: వలసదారులతో ప్రయాణిస్తున్న ఓడలు సముద్రంలో మునిగి 240 మంది వరకు మృతి చెందారు. ఈ ఘటనలో ప్రాణాలతో బయటపడిన వారు.. పడవలు మునిగి వందలాది మంది మృతి చెందినట్లు తెలిపారు.

వలసదారులతో వెళ్తున్న తొలి పడవ సముద్రం మధ్యలో పగిలిపోయిందని ఐక్య రాజ్య సమితి శరణార్థుల ఏజెన్సీ తెలిపింది. ఓడలో సామర్థ్యానికి మించి ప్రయాణించడం వల్లే ఇది చోటు చేసుకుందని తెలుస్తోంది.

libya

మొదటి పడవ 140 మందితో బయలుదేరిందని, ప్రయాణీకులలో ఆరుగురు పిల్లలు, ఇరవై మంది మహిళలు ఉన్నారని వెల్లడించారు. లిబియా తీరానికి 40.కి.మీ. దూరంలో ఈ పడవ ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 29 మంది ప్రాణాలతో బయటపడ్డారు.

లిబియా నుంచి బుధవారం బయలుదేరిన ఓడలు కాసేపటికే ప్రమాదానికి గురయ్యాయని, ఓడలలో ఉన్న వారు భయంతో నీటిలోకి దూకినట్లు యూఎన్‌హెచ్‌సీఆర్‌ ప్రతినిధి వెల్లడించారు. నీళ్లలోకి దూకిన వారిలో 29 మందిని రెస్క్యూ సిబ్బంది సురక్షితంగా కాపాడగలిగారు. మరో ప్రమాదంలో 128 మంది సముద్రంలో మునిగిపోయినట్లు అధికారులు వెల్లడించారు.

English summary
Hundreds feared dead in refugee shipwrecks off Libya.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X