వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మధ్యధరా సముద్రంలో బోట్ల మునక: 300 మంది గల్లంతు

|
Google Oneindia TeluguNews

యుఎన్: ఆఫ్రికా, పశ్చిమాసియా నుంచి యూరప్‌కు వలసవెళ్తున్న దాదాపు 300 మంది శరణార్థులు మధ్యధరా సముద్రంలో గల్లంతయ్యారు. రబ్బరు బోట్లపై వెళ్తున్న వీరంతా భీకరమైన సముద్ర అలలు, తీవ్ర చలికి బలైనట్లు తెలుస్తోంది.

తాగునీరు, ఆహారం లేకుండా రోజుల తరబడి సముద్రంలో ప్రయాణించటం వల్ల కూడా చాలామంది చనిపోయి ఉంటారని ఐక్యరాజ్యమితి మానవ హక్కుల సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పటివరకు 29 మృతదేహాలు లభించాయి. ఇటాలియన్ కోస్ట్‌గార్డ్స్, ఓ వ్యాపార నౌక దాదాపు 107 మందిని కాపాడాయి.

 Hundreds of migrants killed in new Mediterranean tragedy, says UN

దక్షిణ కొరియాలో రోడ్డు ప్రమాదం

దక్షిణకొరియా రాజధాని సియోల్ నగరం నుంచి ఇంచియాన్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కలుపుతూ నిర్మించిన 4.4 కిలోమీటర్ల యోంగ్‌జాంగ్ వంతెనపై బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలుకోల్పోగా, 70 మంది గాయపడ్డారు.

క్షతగాత్రుల్లో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉందని, వారిలో 18 మంది విదేశీయులు కూడా ఉన్నారని కొరియా విపత్తునివారణ అధికారులు తెలిపారు. వాహనాల్లో చిక్కుకుపోయినవారిని రెస్క్యూ సిబ్బంది బయటకు తీశారు. సియోల్‌లో జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో వంద కార్లు ధ్వంసమయ్యాయి. పొగమంచు కారణంగా ఈ ప్రమాదం సంభవించిందని అధికారులు తెలిపారు.

English summary
At least 300 migrants are feared to have drowned after attempting to cross the Mediterranean Sea from North Africa this week in rough seas, the UN says.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X