వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కృత్రిమ మేధస్సుతో కరోనాకు వందలాది మందులు గుర్తింపు .. శాస్త్రవేత్తల వెల్లడి

|
Google Oneindia TeluguNews

రివర్‌సైడ్‌లోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలోని శాస్త్రవేత్తలు కరోనావైరస్ చికిత్సకు సహాయపడే వందలాది కొత్త ఉపయుక్త ఔషధాలను గుర్తించడానికి మెషీన్ లెర్నింగ్ ఉపయోగించారు. కరోనా చికిత్స చేసే మరియు వైరస్ ను నిరోధించే సమర్థవంతమైన ఔషధాలను గుర్తించాల్సిన అవసరం ఉంది" అని పరిశోధనకు నాయకత్వం వహించిన మాలిక్యులర్, సెల్ మరియు సిస్టమ్స్ బయాలజీ ప్రొఫెసర్ ఆనందసంకర్ రే అన్నారు. వివిధ లక్షణాలతో బాధ పడే చాలా మంది కరోనా పాజిటివ్ అభ్యర్థులను గుర్తించి, డ్రగ్ డిస్కవరీ పైప్‌లైన్‌ను అభివృద్ధి చేసామని ఆయన పేర్కొన్నారు.

డ్రగ్ డిస్కవరీ పైప్‌లైన్ అనేది కృత్రిమ మేధస్సుతో అనుసంధానించబడిన ఒక రకమైన గణన వ్యూహమని ,ఇది కంప్యూటర్ అల్గోరిథం అని పేర్కొన్నారు. కరోనా రోగుల లక్షణాలను కంప్యూటర్ లో ప్రోగ్రాం చేస్తే ఇది కంప్యూటర్ ప్రోగ్రామింగ్ ద్వారా కార్యాచరణను అంచనా వేయడానికి పనికొస్తుంది . కరోనా బాధితులకు కావాల్సిన వందలాది మందులను సూచిస్తుంది అని పేర్కొన్నారు.

Hundreds of drugs identified in the corona with artificial intelligence .. Scientists reveal

వేగవంతమైన ఇన్నోవేషన్, డిజైన్ & మెడికల్ పరికరాల అభివృద్ధి పై జరిగిన వర్చువల్ సమ్మిట్ లో కూడా ఈ విషయంపై పలువురు శాస్త్రవేత్తలు అభిప్రాయం వ్యక్తం చేశారు. వైద్య పరికరాలతో పాటు సాంకేతిక పరిజ్ఞాన అభివృద్ధి పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా పెరగాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం అయ్యింది . మెడ్‌టెక్ ప్రొవైడర్లు తమ పరికరాల ద్వారా మెరుగైన పనితీరు, మరింత విశ్లేషణ చేసి అవసరాలకు అనుగుణంగా టెక్నాలజీ ద్వారా మందులను అందించే సవాళ్ళను స్వీకరించటానికి మరింత వేగవంతం అయిన సాంకేతిక పరిజ్ఞానం పెరగాల్సిన అవసరం ఉందన్నారు . రీసెర్చ్ మరియు డెవలప్మెంట్ విభాగం దీనిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని చర్చించారు .

Recommended Video

Russia's Covid-19 Vaccine : How Can We Trust సైడ్ ఎఫెక్ట్స్ చూడకుండా ప్రజలపై ప్రయోగాలా ? Scientists

భారతదేశం ప్రపంచ దేశాల్లోనే మూడవ కరోనా బాధిత దేశంగా ఉంది . దేశంలోని ఆసుపత్రులలో మందుల కొరత ఉన్నట్లు వచ్చిన నివేదికల తరువాత కరోనా చికిత్స కోసం జైడస్ సైన్సెస్ యొక్క యాంటీవైరల్ డ్రగ్ రెమెడిసివిర్ యొక్క చౌకైన జెనరిక్ వెర్షన్‌ను జైడస్ కాడిలా గురువారం విడుదల చేశారు. జైడస్ దీని ధర 100 ఎంజి బాటిల్ కు 2,800 రూపాయలు గా నిర్ణయించింది.కరోనా రోగులకు చికిత్స చేస్తున్న ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఆసుపత్రులకు ఇది రెమ్‌డాక్ బ్రాండ్ పేరుతో విక్రయించబడుతుందని కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది.

English summary
Scientists at the University of California, Riverside, have used machine learning to identify hundreds of new potential drugs that could help treat COVID-19, The drug discovery pipeline is a type of computational strategy linked to artificial intelligence -- a computer algorithm.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X