వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ ట్రక్కు నిండా శవాలే: ఎవరివి?(వీడియో)

|
Google Oneindia TeluguNews

హంగేరీ: ఆస్ట్రియాలోని ఓ రహదారిపై ట్రక్కులో పదుల సంఖ్యలో శవాలను గుర్తించారు. హంగేరీ సరిహద్దు ప్రాంతానికి సమీపంలో ఈ ట్రక్కును గురువారం గుర్తించినట్లు ఆస్ట్రియా పోలీసు విభాగం అధికార ప్రతినిధి తెలిపారు. శవాలు బాగా కుళ్లిన స్థితిలో ఉన్నాయని, దీంతో, అవయవాలు తేలిగ్గా విడవడిపోతున్నాయని చెప్పారు.

ఈ కారణంగా, శవాలు ఎన్ని? అన్న దానిపై స్పష్టత రాలేదని పేర్కొన్నారు. 70కి పైగా మృతదేహాలు ఉన్నట్టు అంచనా వేస్తున్నారు. వీరందరినీ వలసవాదులుగా భావిస్తున్నారు. వీరిని మరో ప్రాంతానికి అక్రమంగానో, బలవంతంగానో తరలిస్తున్నట్టు అనుమానిస్తున్నారు.

Hungarian police arrest driver of lorry that had 71 bodies inside

కాగా, ట్రక్‌పై స్లొవేకియా పౌల్ట్రీ ఉత్పత్తుల కంపెనీ 'హైజా' లోగో ఉంది. నెంబర్ ప్లేట్ మాత్రం హంగేరీ రిజిస్ట్రేషన్‌తో ఉంది. అయితే, ఆ వాహనం తమది కాదని 'హైజా' ప్రకటించింది. దాన్ని వేరే వ్యక్తులకు విక్రయించామని, అయితే వారు ఆ లోగోను తొలగించలేదని పేర్కొంది.

ఈ వాహనం హంగేరీ నుంచి ఆస్ట్రియాలో ప్రవేశించేటప్పటికే వారందరూ మరణించి ఉంటారని ఆస్ట్రియా పోలీసు విభాగం పేర్కొంది. అయితే, వారు ఎలా చనిపోయారన్నది మిస్టరీగా మారింది.

ఆ ట్రక్కును నికెల్స్ డార్ఫ్ తరలించారు. అక్కడ శవాలకు ఫోరెన్సిక్ పరీక్షలు నిర్వహిస్తారు. ఆ ట్రక్కు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకన్న హంగేరీ పోలీసులు, విచారిస్తున్నారు. కాగా, మొత్తం 71మంది మృతదేహాల్లో 59 పురుషులవి, 8 మహిళలవి, చిన్న పిల్లలవి నాలుగు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

English summary
Hungarian police have arrested the driver of a lorry found on an Austrian motorway with the decomposing bodies of more than 70 people inside.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X