• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

వైరల్: ఈ పాము ఏం మింగిందో తెలుసా... వీడియో చూస్తే కడుపులో తిప్పేస్తుంది

|
  ఈ పాము ఏం మింగిందో తెలుసా... వీడియో చూస్తే కడుపులో తిప్పేస్తుంది

  పెన్సిల్వేనియా: సాధారణంగా పాములకు ఆకలివేస్తే వేటకు వెళుతుంది. నివాస ప్రాంతాల్లో ఎక్కువగా తిరిగే ఏ కప్పనో, ఎలుకనో లేక కోడిపిల్లలనో చటుక్కున నోటితో కర్చుకుని గుటుక్కున మింగేస్తుంది. కొన్ని పాములైతే తమ సొంత పిల్లలనే మింగేసిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఇందులో ఓ పెద్ద పాముకు ఆకలి వేసినట్లు ఉంది. అయితే ఏంమింగిందో తెలుసా... మేము చెప్పడం ఎందుకు మీరే చూసేయండి. అయితే ఈ వీడియో చూస్తే మాత్రం కడుపులో తిప్పేస్తుంది జాగ్రత్త...

  పాముకు ఆకలి వేసింది

  పాముకు ఆకలి వేసింది

  ఆకలి వేసిన పాముకు తన శరీరాన్నే నోట్లో పెట్టేసుకుంది. చూడాటానికి కాస్త ఇబ్బందిగా ఉన్నా... ఈ వీడియోకు మాత్రం కొన్ని లక్షల్లో లైకులు షేర్లు వచ్చాయి. పెన్సిల్వేనియాలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ వీడియోను లైవ్‌లో రికార్డు చేశారు జంతుప్రేమికుడు జెస్సీ రాట్‌తాకర్. ముందుగా పాము తన తోకను నోట్లో పెట్టుకుని సగం భాగం వరకు కుక్కుకుంది. ఆ తర్వాత తిరిగి మొత్తాన్ని బయటకు తీసింది. మళ్లీ తినే ప్రయత్నం చేసింది.

  తోకను మరో పాముగా భావించి ఉండొచ్చు

  పాము అలా తన శరీరాన్నే తను తినడం వెనక కారణం జెస్సీ వివరించారు. సాధారణంగా కింగ్ కోబ్రాలు ఇతర పాములను తింటాయని కొన్నా సార్లు పొడవుగా ఉన్న తన తోకనే మరో పాముగా భావించి తింటాయని జెస్సీ తెలిపారు. అయితే ఎప్పుడైతే నొప్పి కలుగుతుందో అప్పుడు తన శరీరాన్ని తానే పొరపాటున నోట్లో పెట్టుకున్నట్లు గ్రహిస్తాయని చెప్పారు. ఇక లైవ్‌లో ఆ పాము తన శరీరాన్ని తినేదానిపై కెమెరాను ఫోకస్ చేశారు జెస్సీ. పాముకు ఆహారంను పెడుతున్నామని చెప్పిన జెస్సీ.. అయితే దాని ఆకలి ఇంకా తీరనట్లుంది కాబట్టే తన సొంత తోకను నోట్లోకి కుక్కేసుకుందని చెప్పారు.

  చివరి ప్రయత్నంలో తోకను వదిలేసిన పాము

  చివరి ప్రయత్నంలో తోకను వదిలేసిన పాము

  ఇక సగానికి పైగా తోకను నోట్లోకి పెట్టేసుకోవడంతో భయపడిపోయిన జెస్సీ వెంటనే పామును తడమడంతో తోకను వదిలేసింది. సాధారణంగా పాములు ఏదైనా తినేసమయంలో వాటిని బెదిరించడంలాంటివి చేస్తే నచ్చదని చెప్పారు జెస్సీ. అవి వెంటనే తినే ఆహారంను అక్కడే వదిలేసి వెళ్లిపోతాయట. కానీ ఇక్కడ పాము మాత్రం ఎంత గుచ్చినప్పటికీ తన తోకను మాత్రం వదలలేదు. ఇంకా లోపలికి తన సొంత తోకనే కుక్కే ప్రయత్నం చేసింది. ఆ తర్వాత జెస్సీ తన గోర్లతో గుచ్చడం మొదలు పెట్టాడు. అయినప్పటికీ వదల్లేదు. ఇక చివరి ప్రయత్నంలో ఆ పాము తన తోకను వదిలేసింది. సగానికి పైగా తన శరీరంను పాము మింగేసింది. ఆగష్టు 9న ఈ వీడియోను జెస్సే సోషల్ మీడియాలో పోస్టు చేశారు. పోస్టు అయిన కొన్ని గంటల్లోనే వీడియో వైరల్ అయ్యింది.

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  A stomach-churning video shows the bizarre moment a hungry snake swallowed half its body. What’s worse is that the video of the strange incident goes on to show the snake regurgitating itself as well. The video, both uncomfortable and yet fascinating, has collected quite a few reactions.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more