వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బలమైన గాలులు అంటూ రిపోర్టర్ ఓవరాక్షన్, నెటిజన్ల విమర్శలు

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: ఇటీవల టీవీ రిపోర్టర్లు అత్యుత్సాహం ప్రదర్శించి నవ్వులపాలు అవుతోన్న విషయం తెలిసిందే. నటి శ్రీదేవి చనిపోయినప్పుడు కూడా పలువురు రిపోర్టర్లు చేసిన తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. అమెరికాలో ఓ రిపోర్టర్ అత్యుత్సాహం నవ్వులపాలయ్యేలా చేసింది.

అమెరికాలోని తూర్పు తీరంలో హరికేన్‌ ఫ్లోరెన్స్‌ అక్కడి ప్రజలను వణికిస్తోంది. హరికేన్‌ కారణంగా బలమైన గాలులు వీస్తున్నాయి. ఓ రిపోర్టర్ ఈ హరికేన్‌ వార్తలకు సంబంధించి రిపోర్టింగ్‌ చేస్తున్నాడు. బలమైన గాలులు వీస్తుండటంతో సదరు విలేకరి సరిగ్గా నిలబడలేక అటూ ఇటూ ఊగుతున్నాడు. అయినా అతను గాలి బాగా వీస్తోందంటూ చెబుతూనే ఉన్నాడు.

Hurricane Florence makes landfall in North Carolina

కానీ అదే సమయంలో ఇద్దరు వ్యక్తులు అతని వెనుక వైపు నుంచి వెళ్తున్నారు. కానీ వారిపై ఎలాంటి గాలి ప్రభావం లేదు. వాళ్లు మామూలుగా నడుస్తూ వెళ్లడం వీడియోలో కనిపించింది. దీంతో రిపోర్టర్‌ అత్యుత్సాహం బయటపడింది. ఇందుకు సంబంధించిన వీడియోను ఓ నెటిజన్ పోస్టు చేశాడు. రిపోర్టర్ పైన నెటిజన్లు విమర్శలు కురిపించారు.

వీడియోపై సదరు మీడియా సంస్థ కూడా స్పందించింది. బ్యాగ్రౌండ్‌లో వెళ్తున్న వ్యక్తులు కాంక్రీట్‌ రోడ్డుపై నడుస్తున్నారని, మా రిపోర్టర్‌ మాత్రం చాలా సేపటి నుంచి తడి గడ్డిపై నిల్చుని రిపోర్టింగ్‌ చేస్తున్నాడని, ఈదురుగాలికి గడ్డి మరింత చల్లగా తగలడంతో అతడు నిలబడలేకపోయాడని పేర్కొంది.

English summary
So dramatic! Dude from the weather channel bracing for his life, as 2 dudes just stroll pas
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X