వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారీ గండి: ఫ్లోరిడాపై ఇర్మా కోలుకోలేని దెబ్బ, కోట్ల మంది అంధకారంలోనే!

ఫ్లోరిడా కీస్ దీవుల్లో ఇర్మా సృష్టించిన భీభత్సం టూరిజానికి భారీ గండి కొట్టింది.

|
Google Oneindia TeluguNews

ఫ్లోరిడా: అమెరికా ఆర్థిక వ్యవస్థపై ఇర్మా తుఫాను తీవ్ర ప్రభావం చూపించింది. హరీకేన్ హార్వీ ధాటికి టెక్సాస్ అతలాకుతలం, ఆ వెంటనే ఫ్లోరిడాపై ఇర్మా విరుచుకుపడటం ఆ దేశానికి తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. ఇన్నాళ్లు అమెరికాలో అత్యధిక ఆదాయాన్ని అందిస్తూ వచ్చిన ఫ్లోరిడా ఆర్థిక పరిస్థితి ఇప్పుడు చితికిపోయింది.

టూరిజం ఆధారంగా ఎక్కువ ఆదాయాన్ని గడిస్తూ వచ్చిన ఫ్లోరిడాకు ఇర్మా పెద్ద దెబ్బలా పరిణమించింది. ఫ్లోరిడా కీస్ దీవుల్లో ఇర్మా సృష్టించిన భీభత్సం టూరిజానికి భారీ గండి కొట్టింది. అత్యద్భుత పర్యాటక కేంద్రంగా ఉన్న కీస్ కాస్త.. ఇప్పుడు శిథిలాలు, వ్యర్థాలతో అస్తవ్యస్థంగా తయారైంది.

నష్టం లక్షల కోట్లలో: అమెరికాకు బిగ్ డ్యామేజ్, తుఫాన్ల పేరు వెనుక కహానీ!నష్టం లక్షల కోట్లలో: అమెరికాకు బిగ్ డ్యామేజ్, తుఫాన్ల పేరు వెనుక కహానీ!

అట్లాంటిక్‌ సముద్రం, మెక్సికో జలసంధి మధ్యలో 120కి.మీ విస్తరించిన ఈ సుందర దీవులకు దారి కూడా మూసుకుపోయింది. మంచినీటి సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. చమురు నిల్వలు కరిగిపోయాయి. మూడు ఆసుపత్రులు మూతపడ్డాయి. మొబైల్ ఇళ్లన్ని చెల్లాచెదుయ్యాయని అధికారులు వెల్లడించారు.

hurricane irma effect on florida state

తుఫాను భీభత్సానికి ఆ ప్రాంతం వదిలి వెళ్లినవాళ్లంతా ఇప్పుడు తిరిగొస్తున్నారు.నష్టం ఎంతమేర ఉంటుందనే దానిపై ఇంకా అంచనాకు రాలేదని అధికారులు తెలిపారు.కీ వెస్ట్ ప్రాంతంలో హెలికాప్టర్లతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇర్మా ఎఫెక్ట్ తో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో.. 1.3కోట్ల మంది ఇంకా అంధకారంలోనే ఉన్నట్లు తెలుస్తోంది.

పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చేందుకు కొన్ని వారాలు పడుతుందని అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. కాగా, ఇర్మా హరికేన్‌ ప్రభావంతో ఇప్పటి వరకూ ఆరుగురు మరణించారు. సహాయ శిబిరాల్లో ఇప్పటికీ దాదాపు రెండు లక్షల మంది తలదాచుకున్నారు.

English summary
The hurricane has already unsettled the financial markets, sending insurance stocks falling and orange juice futures surging last week.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X