వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హార్వే పోయిందనుకుంటే.. ఇర్మా వచ్చింది, అమెరికాను వణికిస్తోన్న హరికేన్లు!

ఇటీవల అమెరికాలోని టెక్సాస్‌లో బీభత్సం సృష్టించిన ‘హార్వే’ హరికేన్‌ను మరువక ముందే మరో ప్రమాదకర హరికేన్ ఫ్లోరిడా, సమీప ద్వీపాలైన ప్యూర్టో రికో, యూఎస్ వర్జిన్ ఐల్యాండ్స్‌లో విలయానికి సిద్ధమవుతోంది.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

Recommended Video

హార్వే పోయిందనుకుంటే.. ఇర్మా వచ్చింది, అమెరికాను వణికిస్తోన్న హరికేన్లు! : Video | Oneindia Telugu

వాషింగ్టన్: ఇటీవల అమెరికాలోని టెక్సాస్‌లో బీభత్సం సృష్టించిన 'హార్వే' హరికేన్‌ను మరువక ముందే మరో ప్రమాదకర హరికేన్ ఫ్లోరిడా, సమీప ద్వీపాలైన ప్యూర్టో రికో, యూఎస్ వర్జిన్ ఐల్యాండ్స్‌లో విలయానికి సిద్ధమవుతోంది. అమెరికా చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా అత్యంత ప్రమాదకరమైన 'ఇర్మా' హరికేన్ ఫ్లోరిడా, సమీప దీవులపై విరుచుకుపడనుంది.

ఇర్మా హరికేన్ ధాటికి ప్రభావిత ప్రాంతాలన్నీ అతలాకుతలం అవుతాయని, భారీ విలయం తప్పదని మియామీలోని జాతీయ హరికేన్ కేంద్రం హెచ్చరించింది. గంటకు 280 కి.మీ. వేగంతో భీకర గాలులు వీస్తాయని, 10 నుంచి 12 సెం.మీ. వర్షం కురుస్తుందని వెల్లడించింది.

వారాంతానికల్లా ఫ్లోరిడా వైపు...

వారాంతానికల్లా ఫ్లోరిడా వైపు...

అత్యంత ప్రమాదకరమైన ఈ కేటగిరీ 5 తుపాను కరేబియన్ సముద్రం, గల్ఫ్ ఆఫ్ మెక్సికోకు ఆవల అట్లాంటిక్ అట్లాంటిక్ మహాసముద్రంలో కేంద్రీకృమై ఉందని తెలిపింది. ఈ వారాంతానికి ఫ్లోరిడా వైపు దూసుకొస్తుందని హెచ్చరించింది.

మళ్లీ అత్యవసర పరిస్థితి...

మళ్లీ అత్యవసర పరిస్థితి...

ఈ హరికేన్ వల్ల కురిసే వర్షాలు, వీచే గాలులు భారీగా ప్రాణ, ఆస్తి నష్టాన్ని కలిగిస్తాయని అంచనా వేసింది. ఇర్మా హరికేన్ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఫ్లోరిడా, ప్యూర్టో రికో, యూఎస్ వర్జిన్ ఐల్యాండ్స్‌లో అత్యవసర పరిస్థితులను ప్రకటించారు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ, ఫెడరల్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ సమన్వయంతో విపత్తు సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

అప్పట్లో విల్మా విలయం...

అప్పట్లో విల్మా విలయం...

గతంలో 2005లో విల్మా హరికేన్ ఫ్లోరిడాను అతలాకుతలం చేసింది. విల్మా ధాటికి దక్షిణ ఫ్లోరిడా నీట మునిగింది. గంటకు 193 కి.మీ. వేగంతో వీచిన గాలులు ఇళ్లను నేలమట్టం చేశాయి. విల్మా హరికేన్ వల్ల ఐదుగురు దుర్మరణం చెందారు.

ఇది ఇంకా భయంకరం...

ఇది ఇంకా భయంకరం...

అయితే ఇప్పుడు వస్తోన్న ఇర్మా హరికేన్ దాని కన్నా భయంకరమైనది కావడంతో ఫ్లోరిడా వాసులు వణికిపోతున్నారు. అధికారులు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఇర్మా ప్రభావం ఉంటుందని భావిస్తున్న ప్రదేశాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

English summary
Florida, Puerto Rico and the US Virgin Islands as Hurricane Irma prepares for landfall. The declarations authorize the Department of Homeland Security and the Federal Emergency Management Agency to coordinate disaster relief efforts in those places. The dangerous Category 5 storm is wielding the most powerful winds ever recorded for a storm in the Atlantic Ocean. It is on a path that could take it toward Florida over the weekend. Irma's size and strength put the entire state on notice Tuesday. Residents and visitors prepared to leave in anticipation of catastrophic winds and floods. Throughout South Florida, officials readied evacuation orders and people raided store shelves, buying up water and other hurricane supplies. Long lines formed at gas stations and people pulled shutters out of storage and put up plywood to protect their homes and businesses.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X