వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

‘మాథ్యూ’తో వణుతున్న అమెరికా, హైతీ: 300మంది మృతి, 20లక్షలమంది తరలింపు

|
Google Oneindia TeluguNews

న్యూయార్క్: అమెరికా దేశంలోని అనేక ప్రాంతాలో హరికేన్'మాథ్యూ' దెబ్బకు వణికిపోతున్నాయి. మాథ్యూ హరికేన్‌ వల్ల అమెరికా, హైతీల్లో ఇప్పటికే 300మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. హైతీలో ఈ మరణాల సంఖ్య ఎక్కువగా ఉంది. కాగా, హరికేన్‌తో అమెరికాలో ఆందోళనకర వాతావరణం నెలకొంది. ఈ పెనుతుపాను ఇప్పుడు ఫ్లోరిడా తీరాన్ని తాకడంతో భారీగా ప్రాణనష్టం వాటిల్లకుండా ముందస్తు జాగ్రత్తలో భాగంగా సురక్షిత ప్రాంతాలకు ప్రజలను తరలిస్తున్నారు.

అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా ఇప్పటికే ఫ్లోరిడా, జార్జియాలో అత్యవసర పరిస్థితి ప్రకటించారు. హరికేన్‌.. పెనుగాలులు, భారీ వర్షాలతో బీభత్సం సృష్టించే అవకాశం ఉన్నందున సుమారు 20లక్షలమంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మ్యాథ్యూ హరికేన్‌ ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుందని అధికారులు ప్రజలను హెచ్చరిస్తూ ప్రమాదక ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్నారు. సహాయక బృందాలు రంగంలోకి దిగి సహాయకచర్యలు చేపడుతున్నారు.

Hurricane Matthew kills 269; tears through Haiti, Bahamas, Cuba

పెను తుపాను మనుషులను చంపేస్తుంది, చాలా సీరియస్‌, ఇక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ అధికారులు ప్రజలను తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. ఇది నాలుగో కేటగిరీ హరికేన్‌ అని అధికారులు తెలిపారు. దశాబ్ద కాలంలో కరేబియన్‌ ప్రాంతంలో సంభవించిన తుఫానుల్లో ఇదే అత్యంత తీవ్రమైనదని అధికారులు చెప్తున్నారు. అమెరికా ఆగ్నేయ రాష్ట్రాలు ఫ్లోరిడా నుంచి నార్త్‌కెరోలినా వరకు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అంతేగాక, ఎమర్జెన్సీ ప్రకటించారు.

స్కూళ్లు, కళాశాలలకు సెలవు ప్రకటించారు. అమెరికా వ్యాప్తంగా మొత్తం ప్రభావిత ప్రాంతాల్లో సుమారు 3,800 విమాన సర్వీసులు కూడా రద్దు చేశారు. మాథ్యూ తీవ్రతను తెలియజేస్తూ వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తోంది. దాదాపు 25లక్షల మంది ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు తెలిపారు. ఫ్లోరిడా మీదుగా వెళ్లాల్సిన దాదాపు 2800 విమానాలను రద్దు చేశారు. గంటకు 230కిలోమీటర్ల వేగంతో గాలలు వీస్తాయని అంచనావేస్తున్నారు.

Hurricane Matthew kills 269; tears through Haiti, Bahamas, Cuba

ఇది ఇలా ఉండగా, హైతీలో ఈ పెనుతుపాను తీవ్ర ప్రాణనష్టం, ఆస్తినష్టం కలిగించింది. జెరెమీ నగరంలో దాదాపు 30వేల ఇళ్లు నేలమట్టమయ్యాయి. సుమారు 300 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్క రోచ్‌ ఎ బాట్యూ నగరంలోనే 50 మంది చనిపోయారు. ఈ తుపాను ప్రభావం హైతీ, క్యూబాలతో పాటు బహమాస్‌పై కూడా పడింది. భారీ వేగంతో వీచే గాలుల కారణంగా పెద్ద ఎత్తున చెట్లు, విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. అయితే, ఇక్కడ ప్రాణ నష్టం ఎక్కువగా నమోదు కాలేదు.

English summary
Hurricane Matthew pounded the Bahamas on Thursday on its way to the United States, after leaving behind a humanitarian crisis in Haiti.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X