వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మాటల్లేవ్, మాట్లాడుకోవడాల్లేవ్ , 20 ఏళ్ళుగా భార్యతోనే ఉంటున్న మాటల్లేవ్

పిల్లలపై ప్రేమ చూపే పేరుతో తనను నిర్లక్ష్యం చేస్తోందనే నెపంతో భార్యతో 20 ఏళ్ళుగా మాట్లాడడం లేదు ఓ భర్త,. అయితే వీరి కొడుకు ఓ టివి షో ను ఏర్పాటు చేయడంతో వారిద్దరి మద్య 20 ఏళ్ళ తర్వాత మాటలు కలిశాయి.

By Narsimha
|
Google Oneindia TeluguNews

జపాన్ :భార్య, భర్తల మద్య గొడవలు జరగడం సహజం, అలగడం, తిరిగి మాట్లాడుకోవడం, విడిపోవడం, కలిసిపోవడం సాధారణంగా చూస్తూనే ఉంటాం. అయితే తన భార్యపై అలిగిన ఓ భర్త ఏకంగా 20 ఏళ్ళపాటు మాట్లాడలేదు.విచిత్రమేమిటంటే వీరిద్దరూ ఒకే ఇంట్లో పిల్లలతో కలిసి జీవిస్తున్నారు. 20 ఏళ్ళుగా భార్య,భర్తల మధ్య సైగలతోనే వారి మద్య కాపురం సాగుతోంది.

భార్య, భర్తల మద్య గొడవతో ఓ భర్త తన భార్యతో 20 ఏళ్ళుగా మాటలు బంద్ చేశారు. వీరిద్దరి మద్య తిరిగి మాటలు ప్రారంభమయ్యేందుకు పిల్లలు చూపిన చొరవ ఫలించింది. ఓ టివి షో ను ఏర్పాటుచేసి మరీ వీరిద్దరిని కలిపారు పిల్లలు.

జపాన్ లోని నర ప్రాంతానికి చెందిన ఓటోవ్ కటయమ. యమీ లకు 23 ఏళ్ళ క్రితం వివాహం జరిగింది. వీరిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. వీరికి ముగ్గురు సంతానం. అయితే పిల్లల ఆలనా పాలనా చూసుకొంటూ యూమీ బిజీగా ఉండేవారు.

husband has gone 20 years without speaking to his wife

పిల్లలపై ప్రేమతో తనను నిర్లక్ష్యం చేస్తుందని యూమీపై అలిగాడు భర్త ఓటోవ్ కటయమ. ఆమెతో మాట్లాడకపోవడమే సరైందని భావించాడు. ఈ మేరకు ఆ రోజు నుండి భార్యతో మాట్లాడడం మానివేశాడు.

పిల్లలు పెరిగి పెద్దవారు అయ్యారు. అయినా వీరిద్దరి మద్య మాటలు లేవు. ఇద్దరూ కూడ సైగల ద్వారానే మాట్లాడుకొనేవారు. .యూమీ తన భర్తకు ఎంతగా దగ్గర కావాలలని ప్రయత్నించినా భర్త కటయమ మాత్రం తన పంతాన్ని వీడలేదు. అయితే కటయమ కొడుకు యోషీ తన తల్లిదండ్రులను కలపాలని భావించాడు.ఈ మేరకు ఆయన ఓ టివి చానల్ ను ఆశ్రయించాడు.

ఆ టివి ఛానల్ నిర్వాహకులు వీరిద్దరిని ఓ పార్క్ లో ఏకాంతంగా కలిసేలా ఏర్పాటుచేశారు టివి ఛానల్ నిర్వాహకులు, ఆ సమయంలో ఒకరితో ఒకరు మాట్లాడుకొన్నారు. పిల్లలపై చూపే ప్రేమ, తనలో అసూయ కల్గించిందని, తనను నిర్లక్ష్యం చేస్తున్నావనే భాదతో మాట్లాడడం మానివేశానని ఆయన తన భార్యకు చెప్పాడు.

ఇంతకాలం పాటు తాను మాట్లాడకపోవడం పట్ల ఆయన పశ్చాతాపాన్ని వ్యక్తం చేశాడు. 20 ఏళ్ళుగా మాట్లాడనందుకు తనను క్షమించాలని ఆయన భార్యను కోరాడు. 20 ఏళ్ళ తర్వాత తల్లిదండ్రులు మాట్లాడుకోవడం చూసిన పిల్లలు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు.

English summary
It is unlikely to compare to a husband and wife who have not spoken for two decades, but continue to live with each other.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X