వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భర్త రాసలీలను బయటపెట్టిందిలా, పరిహరం కోరుతూ కోర్టుకు అలా..

ఓ వ్యాపారవేత్త వివాహేతర సంబంధాలను టెక్నాలజీ బట్టబయలు చేసింది. తన వ్యక్తిగత జీవితానికి భంగం కల్గించింనందుకు గాను ఉబేర్ కంపెనీ పరిహరం చెల్లించాలని బాధితుడు కోర్టును ఆశ్రయించాడు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ:టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతి విషయం సులభంగానే మారిపోతోంది.అయితే టెక్నాలజీని ఏ రకంగా ఉపయోగించుకొంటే ఆ రకంగా అది పనికొస్తోంది. అయితే భర్త వివాహేతర సంబంధం ఉబేర్ అప్లికేషన్ ద్వారా తెలిసింది భార్యకు. తన వ్యవహరం వెలుగు చూడడంతో పరిహరం చెల్లించాలని ఆయన ఉబేర్ కంపెనీని కోరుతున్నాడు.

సదరన్ ప్రాన్స్ లోని గ్లిడ్జీ రివేరా ప్రాంతానికి చెందిన ఓ వ్యాపారి ఉబేర్ పై ఫిర్యాదు చేశాడు.45 మిలియన్ యూరోలు(భారత కరెన్సీలో రూ.320 కోట్లు ) చెల్లించాలని కోర్టును ఆశ్రయించాడు.

ఈ వ్యాపారవేత్త వివాహేతర సంబంధాలు పెట్టుకొని ప్రయాణాలు చేసేవాడు. అయితే ఈ ప్రయాణాలే ఆయన వ్యవహరాన్ని బట్టబయలు చేశాయి.

 Husband Illegal Affair Found through Uber App

ప్రయాణం చేసేందుకుగాను ఉబేర్ క్యాబ్ ను ఆయన బుక్ చేసుకొన్నాడు. అయితే ఒకసారి ఉబేర్ క్యాబ్ ను తన భార్య సతీమణి ఫోన్ నుండి బుక్ చేసుకొన్నాడు. ఇదే అతని కొంప ముంచింది.

ఆ రోజు నుండి ఆయన ఎప్పుడూ ఉబేర్ క్యాబ్ ను బుక్ చేసుకొన్నా ఆ విషయం ఆయన భార్యకు తెలిసిపోయేది. ఉబేర్ క్యాబ్ ను బుక్ చేసుకొని తన భర్త ఎక్కడికి వెళ్తుండన్నాడని ఆమెకు అనుమానం వచ్చింది.

తన భార్య ఫోన్ నుండి ఆయన లాగాఫ్ అయినా కాని, ఆయన ఉబేర్ క్యాబ్ ను బుక్ చేస్తే ఆ సమాచారం వెంటనే ఆయన భార్యకు చేరేది.సాఫ్ట్ వేర్ లోని సాంకేతిక లోపం కారణంగానే ఇది జరిగిందని నిపుణులు చెబుతున్నారు.

ఈ విషయమై తన భర్త ప్రయాణాలపై నిఘా వేసింది. వివాహేతర సంబంధాల కోసమే ఆయన ఉబేర్ క్యాబ్ లను బుక్ చేసుకొని తిరుగుతున్నాడని ఆమె గుర్తించింది.దీంతో భర్త ప్రవర్తనను తెలుసుకొని ఆయనతో ఆమె విడాకులు తీసుకొంది.

అయితే తన వ్యక్తిగత జీవితానికి భంగం కల్గించినంనదుకుగాను ఉబేర్ కంపెనీ పరిహరం చెల్లించాలంటూ ఆయన కోర్టును ఆశ్రయించాడు.అయితే కోర్టు నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి.

English summary
husband illegal affair found through uber app in New Delhi. wife suspeced her husbands attitude. wife divorced her husband.husband filed a petition in court against uber company.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X