వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అన్నీసర్దుకున్నాక:షాకిచ్చిన భర్త, మారాలని భార్య ఫైర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

టెహ్రాన్: ఆసియా సాకర్ కప్‌లో ఇరాన్ జట్టు తరఫున ప్రాతినిథ్యం వహించే అవకాశం వచ్చిన నీలోఫర్ అర్దలన్ అనే మహిళ జట్టుతో కలిసి టోర్నీ వేదిక మలేషియాకు పయనమవ్వాల్సిన సమయంలో వెళ్లలేకపోయింది. అందుకు ఆమె ఆమె భర్త నిరాకరించడమే కారణం.

నీలోఫర్‌ను విదేశాలకు పంపేందుకు ఇష్టపడని భర్త, ఆమె పాస్‌పోర్ట్‌ను స్వాధీనం చేసుకున్నట్టు ఇరాన్ వార్తా సంస్థ వెల్లడించింది. ఇరాన్ దేశ చట్టాల ప్రకారం అక్కడి మహిళలు విదేశాలకు వెళ్లకుండా ఆపే హక్కు భర్తలకు ఉంది. ఇస్లామిక్ చట్టాల ప్రకారం అక్కడ విదేశీయానంకు భార్యకు భర్త అనుమతి తప్పనిసరి.

అయితే దీనిపై తీవ్రంగా స్పందించిన నీలోఫర్ మహిళల పట్ల తమ దేశ చట్టాలు మార్చాల్సిన అవసరముందని తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ సందేశం రాసింది.

నీలోఫర్‌... ఇరాన్‌ మహిళల ఫుట్‌బాల్‌ జట్టుకు ఆమె కెప్టెన్‌. గురువారం ఆసియా కప్‌ మొదలవుతోంది కాబట్టి మాములుగా ఆమె కూడా జట్టుతోపాటు మలేషియా చేరుకోవాల్సి ఉంది. కానీ, భర్త నిరాకరించడంతో ఆమె ఇంటికే పరిమితమైంది.

 Husband of Iran woman football star bans her from travelling to Malaysia tournament

ఆసియా కప్‌ కోసం కొన్ని నెలలుగా కఠోర సాధన ఆమె చేస్తూ వచ్చింది. తీరా సమయానికి భర్త అనుమతి నిరాకరించడంతో టోర్నీకి ఆమె దూరం కాబోతోంది.

దీని పైనే ఆమె అసహనం, అసంతృప్తి వ్యక్తం చేసింది. నా దేశ పతాకాన్ని రెపరెపలాడించేందుకు నేను ఆడుతున్నానని, విహార యాత్రల కోసం కాదని, కానీ నా భర్త నన్ను అడ్డుకుంటున్నాడని, ఇలాంటి పరిస్థితుల్లో క్రీడాకారిణుల హక్కులు కాపాడుకోవడానికి చట్టంలో మార్పులు రావాలని కోరుకుంటున్నానని నీలోఫర్‌ చెప్పింది.

English summary
Husband of Iran woman football star bans her from travelling to Malaysia tournament
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X