వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కూచిభొట్ల హత్య: హంతకుడికి జీవిత ఖైదు విధించిన అమెరికా కోర్టు..

|
Google Oneindia TeluguNews

అమెరికా: అమెరికాలో హత్యకు గురైన హైదరాబాద్ టెక్కీ శ్రీనివాస్ కూచిభొట్ల(33) హంతకుడికి అక్కడి కోర్టు జీవిత ఖైదు విధించింది. కోర్టు తీర్పుపై కూచిభొట్ల భార్య సునయన హర్షం వ్యక్తం చేశారు.

జాత్యహంకార హత్యే, ఖండిస్తున్నాం: శ్రీనివాస్ హత్యపై ట్రంప్ తొలిసారి, ఏమన్నారంటే..? జాత్యహంకార హత్యే, ఖండిస్తున్నాం: శ్రీనివాస్ హత్యపై ట్రంప్ తొలిసారి, ఏమన్నారంటే..?

కాగా, గతేడాది స్నేహితుడితో కలిసి కాన్సాస్ లోని ఓ బార్ కి వెళ్లిన సమయంలో ప్యురింటన్(52) అనే వ్యక్తి శ్రీనివాస్ పై కాల్పులకు తెగబడ్డాడు. 'నా దేశం నుంచి వెళ్లిపోండి' అని పెద్దగా అరుస్తూ అతను కాల్పులు జరిపాడు.

Hyd techie Srinivas Kuchibholtas killer sentenced to life by US court

ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన కూచిభొట్ల చికిత్స పొందుతూ ఆసుపత్రిలో ప్రాణాలు వదిలారు. శ్రీనివాస్ స్నేహితుడు అలోక్ మాదసాని గాయాలతో బయటపడ్డారు. శ్రీనివాస్, అలోక్ మాదసానిలపై కాల్పుల సమయంలో ఇయాన్ గ్రిలట్ అనే వ్యక్తి నిందితుడు ప్యురింటన్ ను అడ్డుకోబోయాడు.

ఈ క్రమంలో అతనికి కూడా బుల్లెట్ గాయాలయ్యాయి. కాగా, భర్త దూరమవడంతో శ్రీనివాస్ భార్య సునయన తీవ్ర మనస్థాపం చెందిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది జనవరిలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తొలి స్టేట్‌ ఆఫ్‌ యూనియన్‌ ప్రసంగానికి కూచిభొట్ల భార్య సునయనను ఆహ్వానించారు. ఈ సందర్భంగా కూచిభొట్లపై దాడిని ఆయన ఖండించారు.

ఇదిలా ఉంటే, ప్యురింటన్ జీవితఖైదుపై కొంతమంది న్యాయవాదులు మాట్లాడుతూ... అతను 50ఏళ్ల తర్వాత గానీ పెరోల్ పై బయటకొచ్చే అవకాశం లేదన్నారు.

English summary
A US Navy veteran was sentenced to life in jail for killing Srinivas Kuchibhotla, the Indian techie from Hyderabad. The engineer was killed at a bar in the city of Olathe in Kansas last year. The murder was a racially motivated hate crime and the tragic death had sparked international outrage.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X