వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సంచలనం: పాకిస్తాన్‌పైకి.. హైడ్రోజన్ బాంబు సిద్ధం చేయించిన రాజీవ్ గాంధీ!

ఆమెరికా గూఢచార సంస్థ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (సీఐఏ) ఓ షాకింగ్ విషయాన్ని వెలుగులోకి తెచ్చింది.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఆమెరికా గూఢచార సంస్థ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (సీఐఏ) ఓ షాకింగ్ విషయాన్ని వెలుగులోకి తెచ్చింది. పాకిస్తాన్ అణు కార్యకలాపాల పైన ఆందోళనతో ఉన్న భారత్ అత్యంత శక్తిమంతమైన హైడ్రోజన్ బాంబు పరీక్షకు సర్వం సిద్ధం చేసినట్లు తాజాగా సీఐఏ డాక్యుమెంట్లు తెలుపుతున్నాయి.

ఐటీ అధికారులే అవాక్కు: మంత్రి-మహిళా నేతల ఇళ్లలో 12 కిలోల గోల్డ్, రూ.162 కోట్లు

భారత్ - పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో నాటి అమెరికా అధ్యక్షులు రొనాల్డ్ రీగన్ రాయబారులను పంపి రెండు దేశాల మధ్య ఉద్రిక్తతను చల్లార్చాలని భావించారని అంటున్నారు.

రాజీవ్ గాంధీ ప్రభుత్వం ఆధ్వర్యంలో బార్క్ (బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్)లో 36 మంది శాస్త్రవేత్తలు హైడ్రోజన్ బాంబును తయారు చేశారని పేర్కొంది. పాకిస్తాన్ న్యూక్లియర్ బాంబుకు కౌంటర్‌గా హైడ్రోజన్ బాంబును తెరపైకి తీసుకు వచ్చింది.

Hydrogen Bomb: Under Rajiv Gandhi, India was ready with H-Bomb to counter Pakistan's nukes

1.2 కోట్ల పేజీలున్న 9,30,000 డాక్యుమెంట్లను సీఐఏ ఆన్‌లైన్‌లో పోస్ట్ చేసింది. వీటిలో షాకింగ్ అంశాలు ఉన్నాయి. అప్పటికి 11 ఏళ్ల క్రితం అప్పటి ఇందిరాగాంధీ పరీక్షించిన హైడ్రోజన్ బాంబు కంటే ఎన్నో రెట్లు శక్తిమంతమైన హైడ్రోజన్ బాంబును పరీక్షించేందుకు అప్పటి ప్రధాని రాజీవ్‌గాంధీ దాదాపు ఏర్పాట్లు పూర్తి చేశారని నివేదిక పేర్కొంది.

అయితే అప్పటికే భారత్.. పాకిస్థాన్ కంటే అణు సాంకేతిక పరిజ్ఞానంలో ఎంతో ముందున్నదని పేర్కొంది.

మరో ఆసక్తికర విషయం ఏమంటే... ఇందిరాగాంధీ ప్రారంభించిన అణు కార్యక్రమాలను కొనసాగించేందుకు రాజీవ్ అంతగా ఇష్టపడలేదంట. అయితే పాకిస్థాన్ అణ్వస్త్రాల విషయంలో దూకుడుగా వెళ్తున్నట్టు 1985 తొలినాళ్లలో ప్రధాని రాజీవ్ గాంధీకి నివేదికలు అందడంతో ఆయన మనసు మార్చుకున్నారని తెలుస్తోంది.

బార్క్‌లో 36 మంది శాస్త్రవేత్తల బృందం హైడ్రోజన్ బాంబును తయారుచేసిందని సీఐఏ పేర్కొంది. అణ్వస్త్రాల తయారీకోసం భారత్ వద్ద అప్పటికే కావాల్సినంత ప్లూటోనియం నిల్వలు ఉన్నాయని నివేదిక తెలిపింది. అయితే రాజీవ్ ప్రభుత్వం హైడ్రోజన్ బాంబును పరీక్షించలేదు.

English summary
India under Rajiv Gandhi made preparations in 1985 to test a hydrogen bomb in response to Pakistan’s nuclear programmes, recently released US documents showed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X